దిల్లీ : 12 ఫోటోలలో సీజేపీ ఆందోళన

ఫొటో సోర్స్, Ritesh Shukla/Getty Images
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ పిలుపిచ్చిన ఆందోళనలో పాల్గొనడానికి వేలాది మంది దేశ రాజధాని దిల్లీకి చేరుకున్నారు. కొంతమందిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.
దిల్లీలో యుద్ధ వాతావరణం ఉన్నట్లుగా పోలీసులను, పారామిలిటరీ బలగాలను మోహరించారని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ 'ఎక్స్'లో రాశారు.
"దిల్లీలో అనేక చోట్ల పోలీసు చెక్‌పోస్టులు ఉన్నాయి, రోడ్లపై కాంక్రీట్ బారికేడ్లు, ముళ్ల తీగలను ఏర్పాటు చేశారు. ఏదో యుద్ధం జరుగుతున్నట్లుగా నగరం అంతటా 22,000 మంది పోలీసులను, పారామిలిటరీ బలగాలను మోహరించారు" అని కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ తెలిపారు.
దిల్లీ నుంచి రాకపోకలు సాగించే 250 రైళ్లను రద్దు చేశారు. 52 మెట్రో స్టేషన్లను మూసివేశారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, EPA
దిల్లీలో జరిగిన నిరసన ప్రదర్శనలో నిరసనకారులతో పాటు కొంతమంది జర్నలిస్టులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులలో న్యూస్‌లాండ్రీ, స్క్రోల్.ఇన్, నవభారత్ టైమ్స్‌కు చెందినవారు ఉన్నారు.
"జర్నలిస్టులు తాము మీడియాకు చెందినవారమని చెప్పినప్పుడు, అక్కడ మీడియా అనేదే లేదని వారికి చెప్పారు. జర్నలిస్టుల వద్ద నుంచి ఫోన్లను కూడా లాక్కున్నారు. నిరసనకారులు, జర్నలిస్టులతో సహా సుమారు 30 మందిని ఒకే బస్సులో కూర్చోబెట్టారు" అని న్యూస్‌లాండ్రీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, EPA

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, EPA
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)


























