మహిళల ఆసియా కప్ 2026: భారత్ ఘన విజయం, పాక్ సెమీస్ ఆశలు గల్లంతు

మహిళల ఆసియా కప్ 2026, టీ ట్వంటీ క్రికెట్, భారత్ - పాక్ మ్యాచ్, శ్రీ చరణి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

మహిళల ఆసియా కప్ టీ ట్వంటీ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

56 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన భారత జట్టు ఆదిలోనే తడబడింది. అయితే స్కోరు తక్కువ కావడం, దీప్తి శర్మ దూకుడుగా ఆడటంతో తేలిగ్గా విజయం సాధించింది.

భారత ఓపెనర్లు తక్కువ స్కోరుకే అవుటయ్యారు. 6 బంతుల్లో 12 పరుగులు చేసిన షెఫాలీ వర్మ ఫాతిమా సనా బౌలింగ్‌లో ఔటయ్యింది.

మరో ఓపెనర్ స్మృతి మందానను ఫాతిమా సనా ఎల్‌బీడబ్ల్యూగా ఔట్ చేసింది. దీంతో భారత్ 1.6 ఓవర్లలో 18 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.

వన్ డౌన్‌లో వచ్చిన ప్రతీకా రావల్ నాలుగు పరుగులకే వెనుదిరిగింది.దీంతో హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తి శర్మ ఆచి తూచి ఆడుతూ భారత్‌ను గెలుపు ముంగిట నిలిపారు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా 3 వికెట్లు తీసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మహిళల ఆసియా కప్ 2026, టీ ట్వంటీ క్రికెట్, భారత్ - పాక్ మ్యాచ్, శ్రీ చరణి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మూడు వికెట్లు తీసిన శ్రీ చరణి

సెమీస్‌కు చేరడంలో కీలకమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టు చతికిల పడింది.

పాకిస్తాన్ జట్టు 18.1 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది.

భారత బౌలర్లు శ్రీచరణి, ప్రేమ రావత్ మూడేసి వికెట్లు తీశారు. దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టగా షెఫాలీ వర్మ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకుంది.

మహిళల క్రికెట్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరుకు దుబయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికైంది.

మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్‌లో భాగంగా గ్రూప్ 'ఏ' మ్యాచ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు పాకిస్తాన్‌ను ఓడించింది.

మహిళల ఆసియా కప్ 2026, టీ ట్వంటీ క్రికెట్, భారత్ - పాక్ మ్యాచ్, శ్రీ చరణి

ఫొటో సోర్స్, Getty Images

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

భారత బౌలర్లు చెలరేగడంతో పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 8 మంది పాక్ బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. వీరిలో ముగ్గురు సున్నా పరుగులకే పెవిలియన్ బాట పట్టారు.

ఓపెనర్లు మునీబా అలీ 13 పరుగులు, షవాల్ జుల్ఫీకర్ 14పరుగులు చేశారు.

మహిళల ఆసియా కప్ 2026, టీ ట్వంటీ క్రికెట్, భారత్ - పాక్ మ్యాచ్, శ్రీ చరణి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా బ్యాటింగ్ ఎంచుకున్నారు.

భారత బౌలర్లలో శ్రీచరణి నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.

మరో బౌలర్ ప్రేమ రావత్ కూడా 4 ఓవర్లలో 9 పరుగులిచ్చి 3 వికెట్లు తీసింది.

పాకిస్తాన్ జట్టు ఏ దశలోనూ భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేక పోయింది. పాక్ బ్యాటర్లు ఒకరి తర్వాత ఒకరు వెంట వెంటనే ఔటయ్యారు.

పాకిస్తాన్ జట్టు మునీబా అలీ బ్యాటింగ్‌పై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆమె 13 పరుగులకే షెఫాలీ వర్మ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది.

గ్రూప్ దశలో ఇప్పటికే వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా సెమీఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)