కన్నీళ్లు, సంబరాలు, సెల్ఫీలు: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాల రియక్షన్లు.. 13 ఫోటోలలో
ఫొటో సోర్స్, AFP via Getty Images
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు
రిపబ్లికన్ల కంచుకోటలలో డెమొక్రాట్లు వరుస విజయాలు సాధించి, సెనేట్, ప్రతినిధుల సభలను కైవసం చేసుకోవడంతో చాలా ప్రాంతాల్లో ఆనందోత్సాహాలు కనిపించాయి. ఆలింగనాలు, కేరింతలు, చిరునవ్వులు చిందిస్తూ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు.
ఈ విజయంతో డోనల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవీకాలం ముగిసేంత వరకు కాంగ్రెస్‌పై వారికి పట్టు లభిస్తుంది.
ఈ ఫలితాలతో రిపబ్లికన్లకు తీవ్ర నిరాశ ఎదురైంది. వారికి బలమైన మద్దతుంటుందని భావించే రాష్ట్రాల్లో కూడా వారికి ఓటములు ఎదురయ్యాయి.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మద్దతు తెలిపిన రిపబ్లికన్ అభ్యర్థి, వ్యాపారవేత్త రిక్ జాక్సన్‌ను డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కీషా లాన్స్ బాటమ్స్ ఓడించారు. జార్జియా గవర్నర్‌గా ఎన్నికైన తొలి నల్లజాతి మహిళ బాటమ్స్.
ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
ఫొటో క్యాప్షన్, డెమొక్రాట్ అభ్యర్థి షెరాడ్ బ్రౌన్ చేతిలో ఓడిపోయిన రిపబ్లికన్ సెనేటర్ జాన్ హస్టెడ్ తన కుటుంబ సభ్యుల మధ్య కన్నీరు కార్చారు.
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, జార్జియాలో డెమొక్రటిక్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీకి చెందిన సెనేటర్ జాన్ ఒసాఫ్ మరోసారి ఎన్నికై సెనేటర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
ఫొటో క్యాప్షన్, 2028లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున జాన్ ఒసాఫ్ పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన అధ్యక్ష అభ్యర్థిగా బరిలోకి దిగే ప్రముఖ నేతల్లో ఒకరిగా భావిస్తున్నారు.
ఫొటో సోర్స్, X/Reuters
ఫొటో క్యాప్షన్, అమెరికాలోని పోర్ట్‌ల్యాండ్‌లో డెమొక్రటిక్ పార్టీ సెనేట్ అభ్యర్థి ట్రాయ్ జాక్సన్ విజయం సాధించడంతో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్లుగా సెనేటర్‌గా ఉన్న రిపబ్లికన్ అభ్యర్థి సుసాన్ కాలిన్స్‌ను ఆయన ఓడించారు.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ఐయోవాలోని డెస్ మోయిన్స్‌లో మధ్యంతర ఎన్నికల ఫలితాలను నిరాశగా చూస్తున్న రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు.
ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
ఫొటో క్యాప్షన్, రిపబ్లికన్ సెనేటర్ జాన్ సునునును ఓడించి, సెనేట్‌కు ఎన్నికైన మొట్టమొదటి స్వలింగ సంపర్కుడిగా డెమొక్రాట్ క్రిస్ పాప్పాస్ చరిత్ర సృష్టించారు.
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, పాప్పాస్ తన భర్త(ఎడమవైపు వ్యక్తి) తో కలిసి వేదికపై సంబరాలు జరుపుకున్నారు.
ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, డెమొక్రటిక్ పార్టికి చెందిన అమెరికా మాజీ గవర్నర్ రాయ్ కూపర్ రిపబ్లికన్ అభ్యర్థి మైఖేల్ వాట్లీపై విజయం సాధించారు.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, నార్త్ కరోలినాలో విజయాన్ని సంబరంగా జరుపుకుంటున్న ఓ మద్దతుదారు.
ఫొటో సోర్స్, AFP via Getty Images
ఫొటో క్యాప్షన్, మిషిగన్‌లో డెమొక్రాట్ అబ్దుల్ ఎల్-సయీద్ అమెరికా తొలి ముస్లిం సెనేటర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో వరుస ఓటములు ఎదురవడంతో ఆ పార్టీ మద్దతుదారుల్లో నిరాశ కనిపించింది.