You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చైన్ స్నాచర్‌ను ధైర్యంగా అడ్డుకున్న ఆటోడ్రైవర్
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్న ఓ మహిళ మెడ నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని ఆటో డ్రైవర్ ప్రాణాలకు తెగించి పట్టుకున్నారు. హైదరాబాద్ బేగం బజార్‌లో ఈ ఘటన జరిగింది.
మంజు ఓం లత అనే మహిళ కోడలితో కలిసి మార్నింగ్‌వాక్‌కు వెళ్తుండగా దబీర్‌పురాకు చెందిన రౌడీ షీటర్ సోహైల్ ఆమె మెడ నుంచి బంగారు గొలుసు లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన బైక్ అదుపుతప్పి కిందపడింది. అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ జాహెర్ బాధితురాలి కేకలు విని అక్కడకు వచ్చి..తన ఆటోతో బైక్‌ను డీకొట్టి, నిందితుణ్ని పట్టుకున్నారు.
తర్వాత పోలీసులు సోహైల్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డయ్యాయి. చైన్ స్నాచర్‌ను ధైర్యంగా అడ్డుకున్న జాహెర్‌ను పోలీసులు సత్కరించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)