You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
అమెరికా హెచ్చరికలు ఉన్నా హార్ముజ్ జలసంధిని దాటిన ఆ నాలుగు నౌకలు ఎవరివి? దిగ్బంధంపై చైనా ఏమన్నది..
అమెరికా నౌకాదళ దిగ్బంధం ప్రారంభమైనప్పటికీ, పలు నౌకలు మంగళవారం హార్ముజ్ జలసంధిని దాటినట్లు షిప్ ట్రాకింగ్ డేటా ద్వారా తెలుస్తోంది. ఇంతకీ ఆ నౌకలు ఏ దేశాలవి?
హార్ముజ్‌ను మూసేస్తామన్న ట్రంప్ హెచ్చరిక భారత్‌కు సమస్యలు పెంచుతుందా?
గత కొన్ని నెలల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కనిష్ఠ స్థాయికి చేరింది. దీనివల్ల ఎగుమతులకు కొంత మద్దతు లభించినా, దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారుతాయి. ఇది కూడా ప్రభుత్వానికి పెద్ద ఆందోళన.
స్లోజమస్తాన్: 'ప్రపంచాన్ని చుట్టలేని వ్యక్తి ఏకంగా ఈ దేశాన్నే సృష్టించుకున్న కథ
ప్రపంచ దేశాలన్నీ చుట్టాలనే తన కల కరోనా వల్ల ఆగిపోతే, ఏకంగా సొంత దేశాన్నే సృష్టించుకున్నారో ట్రావెలర్. అమెరికా ఎడారిలో 11 ఎకరాల్లో వెలిసిన ఈ ‘వింత దేశమే’ స్లోజమస్తాన్.
తెలంగాణ: 'ఆయిల్ పామ్' వైపు మళ్లితే ఏమవుతుంది?
దేశీయంగా, అంతర్జాతీయంగా ఎడిబుల్ ఆయిల్స్‌కు ఉన్న సానుకూల పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు ఆయిల్ పామ్ సాగు పెరగడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు.
ఏపీలో క్వాంటమ్ కంప్యూటర్ టెస్ట్ బెడ్స్.. అసలేంటివి?
''సాధారణ కంప్యూటర్లకు ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. క్వాంటమ్ కంప్యూటర్ చాలా వేగంగా రియాక్ట్ అవుతుంది. ఉదాహరణకు ఒక డ్రగ్ తయారీలో కొన్ని మిలియన్స్ మూలిక్యులర్స్ను స్క్రీన్ చేసి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ కంప్యూటర్‌కు ఇందుకు కొన్ని నెలలు పడుతుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్ కేవలం 20 రోజుల్లోనే ఈ పని చేస్తుంది'' అని విశాఖ రుషికొండ ఐటీ పార్క్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఓ నరేష్ బీబీసీకి తెలిపారు.
ఈ హాబీతో గోళ్లు కొరకడం, స్మోకింగ్ వంటి అలవాట్లు మానేయొచ్చా?
2024లో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, డీఅడిక్షన్ సెంటర్లలో ఉన్న మహిళలు "నిట్ టు క్విట్" కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత తక్కువ సిగరెట్లు తాగినట్లు గుర్తించారు. ఇలాంటి పరిశోధనలు కూడా కొంత ఆశాజనకంగా ఉన్నాయి.
ఇరాన్, అమెరికా.. ఇప్పుడేం చేయబోతున్నాయి?
ఇస్లామాబాద్‌లో జరిగిన అమెరికా–ఇరాన్ చర్చలు ఏ ఒప్పందం లేకుండానే ముగియడంతో, రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక శాంతి సాధ్యమా అనే ప్రశ్నలు మళ్లీ ఉత్పన్నమవుతున్నాయి.
ఇరాన్ తీరంపై అమెరికా దిగ్బంధనం ప్రారంభం- ఆహారం, మందులకు మినహాయింపు
యుద్ధ మేఘాల మధ్య అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ తీరప్రాంతాన్ని దిగ్బంధించేందుకు సిద్ధమైంది. నిబంధనలు ఉల్లంఘిస్తే నౌకల స్వాధీనమేనని సెంటకామ్ హెచ్చరించింది.
నోయిడా: కార్మికులు ఒక్కసారిగా ఎందుకు నిరసనలకు దిగారు, ప్రభుత్వం ఏం చెప్పింది?
వేతనాల పెంపు, బోనస్, మెరుగైన పని వాతావరణం కల్పించాలని, అలాగే పని ప్రదేశంలో లైంగిక వేధింపులను నివారించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత స్మృతి మంధాన
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.
అలెగ్జాండర్ మనవరాలితో చంద్రగుప్తుడి కుమారుడి వివాహం జరిగిందా, చరిత్రకారులు ఏమంటున్నారు?
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?
హైదర్ అలీ: బ్రిటిష్ వారిని తరిమికొట్టిన టిప్పు సుల్తాన్ తండ్రి, ఈ యోధుడు జీవించి ఉంటే చరిత్ర మరోలా ఉండేదా?
"హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి."
ధురంధర్: పాకిస్తాన్లో పేరుమోసిన డాన్ రహమాన్ డకైత్ పోలీస్ కాల్పుల్లో ఎలా మరణించాడు?
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్‌కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’
హుమయూన్, అక్బర్, జహంగీర్, ఔరంగజేబు జ్యోతిష్యాన్ని నమ్మేవారా? అక్బర్‌ను 'శుభ ముహూర్తం'లో కనాలని తల్లి హమీదాకు పురిటి నొప్పులు రాకుండా ఆపేశారా?
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.