లైవ్, ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026: ఈశా సింగ్‌కు బంగారు పతకం.. మను భాకర్‌కు కాంస్యం

భారత యువ షూటర్ ఈశా సింగ్ సోమవారం జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026 మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించారు. ఇదే పోటీలో, మను భాకర్ కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.

సారాంశం

  • భారత యువ షూటర్ ఈశా సింగ్ సోమవారం జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026 మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో బంగారు పతకం సాధించారు. ఇదే పోటీలో, మను భాకర్ కాంస్య పతకం సొంతం చేసుకున్నారు.
  • హైడ్రా కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సోమవారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.
  • సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో తనకు పరువు నష్టం కలిగించేలా ఉన్న డీప్‌ఫేక్, ఏఐ పోస్టులపై సివిల్ దావా దాఖలు చేయడానికి కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.
  • పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఇవాళ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026ను ప్రవేశపెడతారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
  • టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సహా పలుపార్టీల ఎంపీలు ఈ బిల్లుపై లోక్‌సభలో మాట్లాడనున్నారు.
  • అమెరికాలోని సియాటెల్‌లో ప్రముఖ ప్రాంతమయిన స్పేస్ నీడిల్ దగ్గరలో ఉన్న సియాటెల్ సెంటర్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారని, ఐదుగురు గాయపడ్డారని సియాటెల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.
  • సియాటెల్ సెంటర్‌లో బైట్ ఆఫ్ సియాటెల్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఏటా జరిగే ఈ కార్యక్రమానికి లక్షలాది మంది హాజరవుతారు.
  • విద్యాసంస్కరణల కంటే ముందు మీడియా సంస్కరణలు రావాల్సిన అవసరముందని సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ భార్య డాక్టర్ గీతాంజలి అన్నారు. "నిత్యం వండివార్చిన కథనాలతో దేశం వివేకవంతం కాలేదు. అది ఒకే మూసధోరణి వైపు లాక్కెళ్తుంది" అని ‘ఎక్స్’లో చేసిన పోస్టులో ఆమె అభిప్రాయపడ్డారు.
  • ఫ్రాన్స్‌లోని బోర్డో నగరానికి దగ్గరలో కార్చిచ్చు వ్యాపించింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి వేలాదిమంది శ్రమిస్తున్నారు.
  • నగరాన్ని ఖాళీ చేయించే అవకాశం అంతగా లేదని అధికారులు చెప్పారు. గత వారం నుంచి యూరప్‌లోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి.

లైవ్ కవరేజీ

  1. స్మృతి ఇరానీ, ప్రకాశ్ జావదేకర్, రమేశ్ పోఖ్రియాల్, ధర్మేంద్ర ప్రధాన్.. విద్యా శాఖలో ఏ మంత్రీ ఎక్కువ కాలం ఎందుకు నిలవలేకపోయారు?

  2. మగవాళ్లకు కనిపించని రంగులు మహిళలకు కనిపిస్తాయా?

  3. ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026: ఈశా సింగ్‌కు బంగారు పతకం.. మను భాకర్‌కు కాంస్యం

    భారత యువ షూటర్ ఈశా సింగ్, ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్

    ఫొటో సోర్స్, Sanket Wankhade/Hindustan Times via Getty Images

    ఫొటో క్యాప్షన్, భారత యువ షూటర్ ఈశా సింగ్

    ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ 2026 మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో భారత యువ షూటర్ ఈశా సింగ్ బంగారు పతకం సాధించింది. ఇదే పోటీలో, మను భాకర్ కాంస్య పతకం గెలిచింది.

    21 ఏళ్ల ఈశా సింగ్ ఫైనల్ పోరులో 40 హిట్స్ స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. చైనాకు చెందిన జాంగ్ యుయును వెనక్కి నెట్టి ఆమె గోల్డ్ మెడల్ గెలవగా, చైనా షూటర్ 37 హిట్స్ స్కోరుతో సిల్వర్ మెడల్‌కే పరిమితమైంది.

    కాంస్య పతకం కోసం జరిగిన షూట్-ఆఫ్‌లో మను భాకర్ విజయం సాధించింది. ఆ తర్వాత ఫైనల్లో 28 స్కోరుతో ఆమె మూడో స్థానాన్ని దక్కించుకుంది.

    ఈశా సింగ్‌కు ఈ ఏడాది ఇది రెండో పెద్ద టైటిల్. అంతకుముందు మే నెలలో జరిగిన మ్యూనిచ్ వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లోనూ ఆమె గోల్డ్ మెడల్ గెలుచుకుంది.

    మరోవైపు, మ్యూనిచ్‌లో నిర్వహించిన అదే పోటీల్లో 10 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో కూడా ఆమె సిల్వర్ మెడల్ సాధించింది.

  4. నరేంద్ర మోదీ: పరాజయం లేని రాజకీయ జీవితంలో ఇప్పుడు ఎందుకు ప్రశ్నలు ఎదుర్కొంటున్నారు...

  5. జర్నలిస్టుల సమస్యలపై దిల్లీలో తెలంగాణ పాత్రికేయుల ధర్నా

    టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా

    ఫొటో సోర్స్, TWJF

    ఫొటో క్యాప్షన్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన "ఛలో పార్లమెంట్" పిలుపులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జర్నలిస్టులు దిల్లీ వెళ్లారు.

    దేశవ్యాప్తంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణకు చెందిన జర్నలిస్టులు సోమవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు.

    తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ఇచ్చిన "ఛలో పార్లమెంట్" పిలుపులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జర్నలిస్టులు దిల్లీ వెళ్లారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ నిరసనను, దిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు మారూఫ్ రజా ప్రారంభించారు.

    ఈ సందర్భంగా మారూఫ్ రజా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జర్నలిస్టులు దిల్లీ వేదికగా ముందుండి పోరాడటాన్ని ఆయన అభినందించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు జర్నలిస్టు ప్రతినిధులు కూడా ఈ ధర్నాకు హాజరై తమ మద్దతు తెలిపారు.జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య స్పష్టం చేశారు.

  6. జర్నలిస్టుల సమస్యలపై దిల్లీలో తెలంగాణ పాత్రికేయుల ధర్నా

    టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా

    ఫొటో సోర్స్, TWJF

    ఫొటో క్యాప్షన్, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన "ఛలో పార్లమెంట్" పిలుపులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జర్నలిస్టులు దిల్లీ వెళ్లారు.

    దేశవ్యాప్తంగా పాత్రికేయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణకు చెందిన జర్నలిస్టులు సోమవారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు.

    తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ఇచ్చిన "ఛలో పార్లమెంట్" పిలుపులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి జర్నలిస్టులు దిల్లీ వెళ్లారు. టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ నిరసనను, దిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ అధ్యక్షుడు మారూఫ్ రజా ప్రారంభించారు.

    ఈ సందర్భంగా మారూఫ్ రజా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సంక్షేమం, భద్రత, హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జర్నలిస్టులు దిల్లీ వేదికగా ముందుండి పోరాడటాన్ని ఆయన అభినందించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పలువురు జర్నలిస్టు ప్రతినిధులు కూడా ఈ ధర్నాకు హాజరై తమ మద్దతు తెలిపారు.జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు తమ పోరాటం కొనసాగుతుందని టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య స్పష్టం చేశారు.

  7. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తప్పించండి: తెలంగాణ హైకోర్టు, అమరేంద్ర యార్లగడ్డ, బీబీసీ ప్రతినిధి

    ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్, తెలంగాణ హైకోర్టు

    ఫొటో సోర్స్, BBC/HYDRAA

    ఫొటో క్యాప్షన్, కోర్టు ధిక్కరణకు పాల్పడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ స్థానం నుంచి రిలీవ్ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

    హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కమిషనర్ పదవి నుంచి ఏవీ రంగనాథ్‌ను తప్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సోమవారం తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

    కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసిందని ది హిందూ రిపోర్టు చేసింది.

    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామంలో జులై 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఈ కూల్చివేతలు చేపట్టిన స్థలం సర్వే నం.1, 2 పరిధిలోకి వస్తాయని, అది తమ భూమిగా చెబుతూ శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్చన్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, జులై 17న కూల్చివేతలు చేపట్టిన ప్రాంతంలో ప్రైవేటు స్థలాలు లేవని హైడ్రా స్పష్టం చేసింది.

    ‘‘ఇప్పటికే రెండు కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగులో ఉన్నాయి. కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. అయినప్పటికీ 17వ తేదీన హైడ్రా భారీ బలగంతో వచ్చి ప్రహారీ, ఇతర నిర్మాణాలు కూల్చివేసింది’’ అని పిటిషనర్ తరఫున న్యాయవాది ఎం.హరీశ్ కుమార్ తెలంగాణ హైకోర్టుకు తెలిపారు.

    లోతుకుంట గ్రామంలోని 40 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నాయని, 2021లోనే హైకోర్టు తీర్పు చెప్పిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టు తీర్పు అమలు కాకపోవడంపై గతంలో కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలు చేసినట్లుగా వివరించారు. దీనిపై జులై 27న మరోసారి తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు రావడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

    హైడ్రా కమిషనర్‌పై మొత్తం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగులో ఉన్నాయని తెలగాణ హైకోర్టు చెప్పినట్లు ది హిందూ రిపోర్టు చేసింది.

    ఈ నేపథ్యంలో పదేపదే కోర్టు ధిక్కరణకు పాల్పడున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆ స్థానం నుంచి రిలీవ్ చేసి ఆ స్థాయి అధికారిని వేరొకర్ని నియమించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

  8. E20 వివాదం: ఎక్స్, మెటా, గూగుల్‌లపై సివిల్ దావాకు గడ్కరీకి హైకోర్టు అనుమతి

    E20, నితిన్ గడ్కరీ, బాంబే హైకోర్టు

    ఫొటో సోర్స్, Prakash Singh/Bloomberg via Getty Images

    ఫొటో క్యాప్షన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

    సోషల్ మీడియా, ఇంటర్నెట్‌లో తనకు పరువు నష్టం కలిగించేలా ఉన్న డీప్‌ఫేక్, ఏఐ పోస్టులపై సివిల్ దావా దాఖలు చేయడానికి కేంద్ర మంత్రి, సీనియర్ బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరీకి బాంబే హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది.

    లైవ్ లా వెబ్ సైట్ అందించిన సమాచారం ప్రకారం జస్టిస్ అభయ్ అహూజా ధర్మాసనం ఈ కేసును విచారించింది. గడ్కరీ తరఫున న్యాయవాది సందీప్ ఎస్. లడ్డా హాజరై, ఈ దావా వేయడానికి కోర్టు అనుమతి కోరారు.

    దాంతో ఎక్స్, మెటా, గూగుల్‌తో పాటు ఇతర గుర్తుతెలియని వ్యక్తులపై సివిల్ కేసు దాఖలు చేయడానికి కోర్టు గడ్కరీకి అనుమతినిచ్చింది. ఈ వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని, తనకు తగిన ఉపశమనం కలిగించాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.

    రూ. 11 కోట్ల నష్టపరిహారం డిమాండ్

    ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ ద్వారా గడ్కరీ, ఆయన కుటుంబ సభ్యులు ఆర్థికంగా లాభపడ్డారంటూ ఈ పోస్టుల ద్వారా తప్పుడు ప్రచారం చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ఈ ప్రకటనల్లో అవినీతి, పక్షపాతం, స్వార్థ ప్రయోజనాలు, పదవి దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలు చేశారనీ గడ్కరీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పరువు నష్టం కలిగించేలా ఉన్న ఇలాంటి 24 పోస్టులను గడ్కరీ తన పిటిషన్‌లో ప్రస్తావిస్తూ, వాటిని తొలగించాలని కోరారు. తన అనుమతి లేకుండా డీప్‌ఫేక్ రూపంలో తన గుర్తింపును, ప్రతిష్ఠను వాడుకోవడం వ్యక్తిగత హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆయన వాదించారు. ఈ మేరకు రూ. 11 కోట్ల నష్టపరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.

    ఇ20, అరవింద్ కేజ్రీవాల్

    ఫొటో సోర్స్, ANI

    E20 కి వ్యతిరేకంగా పోరాడుదాం: కేజ్రీవాల్

    ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత, ఇకపై ‘E20’ కి వ్యతిరేకంగా గళం విప్పుతామని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

    సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ "దేశ యువత ఒక అహంకార ప్రభుత్వాన్ని తలవంచేలా చేసింది, దాంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంలోనే E20 ఇంధనం సమస్యను కూడా పరిష్కరించాలని ప్రధానమంత్రి మోదీని కోరుతున్నాను. ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు, వారి వాహనాలు పాడవుతున్నాయి" అన్నారు.

    "ఈ అంశంపై అందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి, ఈ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి E20కి వ్యతిరేకంగా నేషనల్ టౌన్‌హాల్ నిర్వహిస్తున్నాం" అన్నారు.

  9. గుండెకు స్టంట్ వేస్తే ఎన్ని రోజుల తరువాత నుంచి సెక్స్‌లో పాల్గొనవచ్చు?

  10. వయసు 92... 68 ఏళ్లుగా ఆపరేషన్లు చేస్తున్న సర్జన్

  11. సౌదీ-అమెరికా అణు ఒప్పందం: పాకిస్తాన్ గురించి వ్యక్తమవుతున్న ఆందోళనలేంటి?

  12. లంబర్ జాక్: మొద్దులు నరికే వరల్డ్ కప్‌లో రికార్డులు సృష్టించిన అమ్మాయి...

  13. పాములకు పాలు తాగించడం వాటి ప్రాణాలకు ప్రమాదకరమా, బలవంతంగా తాగిస్తే వాటి శరీరంలో ఏం జరుగుతుంది?

  14. కొత్త తరం ఆలోచనల్ని వాళ్లు అర్ధం చేసుకోలేకపోతున్నారు - సౌరవ్ దాస్

    ఆందోళన, దిల్లీ

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, సౌరవ్ దాస్

    జంతర్ మంతర్ దగ్గర నిరసన అనంతరం డ్యాన్స్ చేస్తూ పార్టీ చేసుకుంటున్నట్టు వైరల్ అయిన వీడియోపై కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ స్పందించారు.

    "జెన్-జెడ్ , కొత్త తరం ఆలోచనా విధానాన్ని, భాషను ప్రభుత్వం, గోదీ యాంకర్లు ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారని ఇది మరోసారి స్పష్టం చేస్తోంది" అని సౌరవ్ దాస్ ‘ఎక్స్’లో రాశారు.

    ‘‘ఎన్నిరోజులు అవసరమైతే అన్నిరోజులు మేం వీధుల్లో కూర్చుని నిరసన తెలపగలం. పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఆందోళన కొనసాగించగలం. చేతిలో కోల్డ్ కాఫీని పట్టుకుని కూడా ఉద్యమాన్ని నిర్వహించగలం. మార్పు కోసం పోరాడటానికి, గత తరాలు ఉద్యమకారుల గురించి ఊహించిన ఒకే రకమైన రూపంలో మనం కనిపించాల్సిన అవసరం లేదు. (ఎవరినీ ఎద్దేవా చేయడం లేదు)

    ఈ తరం ప్రత్యేకత ఇదే. ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, పోరాట స్ఫూర్తితో ఉంటుంది. మమ్మల్ని ఒకే మూసలో బంధించడం సాధ్యం కాదు.

    అంకుళ్లు, ఆంటీలు ఎంత ఫిర్యాదుచేసినా ఈ తరంతో కలిసి జీవించడం, మమ్మల్ని అంగీకరించడం తప్పదు’’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోల్లో, జంతర్ మంతర్ దగ్గర నిరసన ముగిసిన తర్వాత సౌరవ్ దాస్ తన సహచరులతో పార్టీ చేసుకుంటూ, డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

    ఈ వీడియోను బీబీసీ ధృవీకరించలేదు.

  15. పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్రం

    ఆందోళన, నీట్

    ఫొటో సోర్స్, Getty Images

    ఫొటో క్యాప్షన్, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్)సవరణ బిల్లు

    ప్రశ్నపత్రాల లీకేజ్‌లను నివారించడానికి, పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024కు సవరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో ఒక బిల్లును ప్రవేశపెట్టనుంది.

    కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.

    ప్రశ్నాపత్రాలను లీక్ కేసుల్లో దోషులు వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, ఐదు నుంచి పది కోట్ల రూపాయల వరకు జరిమానా విధించవచ్చు. ఇలాంటి కేసుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. పరీక్షకు అయిన ఖర్చును కూడా దోషుల నుంచి వసూలు చేస్తారు. వారిని ఎనిమిదేళ్లపాటు ఎలాంటి ప్రభుత్వ పరీక్షలు రాయకుండా నిషేధిస్తారు. గతంలో జరిమానా కోటిరూపాయలుగా ఉండేది. నిషేధం నాలుగేళ్లు ఉండేది.

    ప్రతిపాదిత బిల్లు ప్రకారం పేపర్ లీకేజ్ కేసుల దర్యాప్తును సీబీఐ లేదా సిట్ రెండు నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

  16. పార్లమెంట్‌లో విపక్ష ఎంపీల నిరసన

    పార్లమెంటులో ఎంపీల నిరసన

    ఫొటో సోర్స్, Chamala Kiran Kumar

    సీజేపీ నేతృత్వంలో విద్యార్థులు జులై 20న జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ఆందోళన సమయంలో జరిగిన ఘటనలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలుసోమవారం పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన తెలిపారు.

  17. ఫ్రాన్స్‌లో కార్చిచ్చు, అధ్యక్షుడు మేక్రాన్ అత్యవసర సమావేశం

    కార్చిచ్చు, మంటలు, అటవీ ప్రాంతం

    ఫొటో సోర్స్, EPA

    ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లో కార్చిచ్చు

    ఫ్రాన్స్‌లోని బోర్డో నగరానికి దగ్గరలో కార్చిచ్చు వ్యాపించింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పదివేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి వేలాదిమంది శ్రమిస్తున్నారు. 8,50,000మంది ఉండే నగరాన్ని ఖాళీ చేయించే అవకాశం అంతగా లేదని అధికారులు చెప్పారు. బోర్డోకు 15కిలోమీటర్ల దూరంలో మంటలు వ్యాపించాయి.

    మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమ్మానుయేల్ మేక్రాన్ అత్యవసర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.

    మంగళవారం నుంచి ఫ్రాన్స్‌లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్ వరకు పెరగొచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది.

    ఫ్రాన్స్‌లోని గిరోండ్ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా గతంలో ఎన్నడూ లేనంతగా పైరోక్యుములోనింబస్ అనే భారీ అగ్ని తుఫాన్ మేఘం ఏర్పడిందని నేషనల్ ఫైర్‌ఫైటర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఫ్రాన్స్(ఎఫ్ఎన్ఎస్‌పీఎఫ్) తెలిపింది.

    కార్చిచ్చు ఫ్రాన్స్‌పై తీవ్ర ప్రబావం చూపింది. నైరుతి ఫ్రాన్స్‌లో 42వేల హెక్టార్లు కాలిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చెలరేగిన భారీ కార్చిచ్చుల్లో ఇదొకటి.

    గత వారం నుంచి యూరప్‌లోని అనేక ప్రాంతాల్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి.

  18. అమెరికాలో కాల్పులు, ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

    అమెరికాలో కాల్పులు

    ఫొటో సోర్స్, Reuters

    ఫొటో క్యాప్షన్, సియాటెల్‌లో కాల్పులు

    అమెరికాలోని సియాటెల్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారని సియాటెల్ ఫైర్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. రెండేళ్ల చిన్నారి, ముగ్గురు మహిళలు సహా ఐదుగురు గాయపడ్డారని తెలిపింది.

    నగరంలో ప్రముఖ ప్రాంతమయిన స్పేస్ నీడిల్ దగ్గరలో ఉన్న సియాటెల్ సెంటర్‌లో ఈ కాల్పులు జరిగాయి.

    కాల్పుల్లో గాయపడ్డ రెండేళ్ల బాలుణ్ని ఆస్పత్రికి తరలించారు. బాలుడి పరిస్థితి నిలకడగా ఉంది. గాయపడ్డవారిలో 56ఏళ్ల మహిళ ఉన్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

    "సియాటెల్ సెంటర్‌లో కాల్పులు జరిగాయి. కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం. దయచేసి ఆ ప్రాంతానికి దూరంగా ఉండండి" అని సియాటెల్ పోలీసులు ‘ఎక్స్’లో తెలిపారు.

    ఘటనాస్థలంలో భారీగా పోలీసులు, అత్యవసర సర్వీసులుకు చెందిన వారిని మోహరించినట్టు సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఫోటోల్లో కనిపిస్తోంది.

    సియాటెల్ సెంటర్‌లో బైట్ ఆఫ్ సియాటెల్ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఏటా జరిగే ఈ కార్యక్రమంలో ఆహార స్టాల్స్, ప్రత్యక్ష సంగీత ప్రదర్శనలు ఉంటాయి. దీనికి లక్షలాది మంది హాజరవుతారు.

    అమెరికా కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల సమయంలో వరుసగా పలుమార్లు కాల్పుల శబ్దాలు వినిపించాయని ప్రత్యక్ష సాక్షులను ఉటంకిస్తూ సియాటెల్ టైమ్స్ తెలిపింది.

    కాల్పుల శబ్దం వినిపించగానే అక్కడి నుంచి పరుగులు తీశామని బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడిన పలువురు ప్రత్యక్షసాక్షులు చెప్పారు.

    మొదట బాణాసంచా పేలుళ్లేమో అనుకున్నామని ప్రత్యక్ష సాక్షులన్నారు.

    ‘‘అందరూ పరుగులు తీస్తుండంతో మేమూ వారితో పాటు పరుగెత్తాం. అక్కడి నుంచి దూరంగా వెళ్లాలనుకున్నాం. మేం ఎక్కడ ఉన్నామో తెలుసుకోడానికి స్పేస్ నీడిల్ వైపు చూశాను. నిజంగా చాలా భయమేసింది’’ అని ఓ మహిళ చెప్పారు.

    కాల్పుల శబ్దం వినగానే తల్లిదండ్రులు భయపడిపోయారని, పిల్లల చేతులు పట్టుకుని ఎగ్జిట్ గేట్ వైపు పరుగులు తీశారని, అక్కడంతా భయాందోళన నెలకొందని స్థానిక వ్యాపారి చెప్పారు.

  19. దేశం కోసం స్వర్ణం గెలవడం కన్నా ఆనందకరమైనది ఏదీ లేదు: మీరాబాయి చనూ

    కామన్‌వెల్త్ గేమ్స్

    ఫొటో సోర్స్, ANI

    ఫొటో క్యాప్షన్, మీరాబాయి చనూ

    గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చనూ స్వర్ణపతకం గెలుచుకుంది. దేశం కోసం స్వర్ణం సాధించడం కంటే ఆనందకరమైనది మరొకటి లేదని వరుసగా మూడోసారి కామన్‌వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుచుకున్న అనంతరం మీరాబాయి చనూ చెప్పింది.

    "నేను చాలా సంతోషంగా ఉన్నాను. కామన్వెల్త్ గేమ్స్‌లో ఇది నా మూడో స్వర్ణ పతకం. మొత్తంగా ఇది నా నాలుగో పతకం. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజత పతకం గెలుచుకోవడంతో నా ప్రయాణం మొదలైంది" అని మీరాబాయి చెప్పినట్టు న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది.

    జుట్టులోని త్రివర్ణ పతాక రంగుల్లో క్లిప్పు పెట్టుకోవడానికి గల కారణాన్ని మీరాబాయి చెప్పింది.

    "ఈ త్రివర్ణ క్లిప్పులను నేనే స్వయంగా తయారు చేసుకున్నాను. మన జాతీయ పతాకానికి ప్రాతినిధ్యం వహించేలా ఏదైనా ప్రత్యేకంగా ఉండాలనుకున్నా. ఏదైనా తయారు చేయాలని అకస్మాత్తుగా అనిపించింది. అందుకే ఈ సీతాకోకచిలుక ఆకారపు క్లిప్పులను పోటీల ముందురోజు నేనే స్వయంగా తయారు చేసుకున్నాను. త్రివర్ణ పతాకాన్ని నాతో పాటు తీసుకువెళ్లడం నాకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇవాళ నేను చాలా భావోద్వేగానికి లోనై చాలా ఏడ్చాను. అయితే భావోద్వేగాలతో నిండి ఉన్నప్పటికీ ఈ క్షణం నాకు అంతే ఆనందాన్ని కూడా ఇచ్చింది" అని మీరాబాయి తెలిపింది.

  20. బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌కు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి కమలాదేవి నల్లపనేని.

    ఇప్పటినుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను లైవ్ పేజ్ ద్వారా మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    మరిన్న ‘బీబీసీ తెలుగు’ కథనాలు మీకోసం..