ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను తాకిడికి కాకినాడ శ్రీనగర్‌లో కూలిపోయిన చెట్టు
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు
ఫొటో సోర్స్, APEDCL
ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళం సర్కిల్, కోటబొమ్మాళి సెక్షన్ పరిధిలోని చలమయ్యపేట గ్రామం వద్ద ప్రభుత్వ ఆసుపత్రికి విద్యుత్ సరఫరా చేసే 11 కేవీ ఫీడర్పై కొబ్బరి కొమ్మ పడి, విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామని విద్యుత్ సిబ్బంది చెప్పారు.
ఫొటో సోర్స్, Konaseema I&PR
ఫొటో క్యాప్షన్, తుపాన్ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో చెట్లు కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని అధికారులు తెలిపారు.
ఫొటో సోర్స్, Konaseema I&PR
ఫొటో క్యాప్షన్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వీధులలోకి విరిగిపడిన చెట్లను తొలగిస్తున్న ప్రొక్లెయినర్
తుపాను మధ్యాహ్ననికి పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కొనసాగుతాయని, వర్షాలు కురుస్తాయని ఇవాళ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఫొటో సోర్స్, Konaseema I&PR
అర్నబ్ తుపాను ప్రభావం తగ్గిన 24 గంటల్లోనే అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని ఏపీ విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బీబీసీకి ఫోన్ ద్వారా తెలిపారు.
ఫొటో సోర్స్, Konaseema I&PR
ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను తీరం దాటుతున్న సమయంలో కాకినాడ జిల్లాలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అధికారుల హెచ్చరికలతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.
ఫొటో క్యాప్షన్, కాకినాడ జిల్లా పెద్దాపురం దగ్గర జాతీయరహదారిపై పడిపోయిన చెట్టు
ఫొటో సోర్స్, KKD Dist IPR
ఫొటో క్యాప్షన్, కాకినాడ జిల్లా తొండండి మండలం జీఎంపేటలో చెట్టును తొలగిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.
ఫొటో సోర్స్, Andhra Pradesh I&PR
ఫొటో క్యాప్షన్, తుపాను తీరం దాటే సమయంలో 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు.
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, కాకినాడ సమీపంలో ఓ ఇంట్లోకి చొచ్చుకొచ్చిన సముద్రపు నీరు