ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. గుడ్‌నైట్
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం. గుడ్‌నైట్
ఈరోజు ముఖ్యమైన వార్తలు కొన్నింటిని ఇక్కడ చూడండి.

గురువారం శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
వర్షాల కారణంగా వాగులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున వాటిని దాటేందుకు ప్రయత్నించద్దని ప్రఖర్ జైన్ సూచించారు. విపత్తు పరిస్థితుల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు 16 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ఫొటో సోర్స్, Hagen Hopkins/Getty Images
భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు.
తాజాగా విడుదల చేసిన ఐసీసీ టీ20 అంతర్జాతీయ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ ఒక స్థానం ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు. గత కొన్ని వారాలుగా అగ్రస్థానంలో కొనసాగిన ఇషాన్ కిషన్ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి చేరాడు.
ఈ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ బ్యాటర్ సాహిబ్ జాదా ఫర్హాన్ రెండో స్థానంలో ఉన్నాడు.
న్యూజీలాండ్‌తో జరిగిన మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఒక్కరోజు తర్వాత ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 38 బంతుల్లో 113 పరుగులు సాధించాడు.

ఫొటో సోర్స్, PTI
కాక్‌పిట్‌లో జరిగిన దాడిని ధైర్యంగా ఎదిరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన ఇండియన్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను, ప్లైదుబై సిబ్బందిని యూఏఈ అధ్యక్షుడు సత్కరించారు.
దుబయ్-టెల్ అవీవ్ విమానం ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికులను రక్షించడానికి చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్, ఫ్లైదుబయ్ సిబ్బందికి ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II పురస్కారాన్ని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రదానం చేశారు.
దుబయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధానమంత్రి, రక్షణమంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ పతకాలను అందజేశారని, సిబ్బందిని ప్రశంసించారని దుబయ్ మీడియా కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.

ఫొటో సోర్స్, EPA
స్పెయిన్‌లో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 64కు చేరుకుంది. అయితే, మృతుల సంఖ్య దీనికంటే ఎక్కువగా ఉండవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మాడ్రిడ్‌కు దక్షిణంగా సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉర్దా పట్టణం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో కనీసం 30 మంది మరణించినట్లు ప్రాంతీయ ప్రభుత్వ వర్గాలు స్పెయిన్‌కు చెందిన ఎఫె వార్తా సంస్థకు తెలిపాయి.
ప్రైవేటు సంస్థ ఇరియో నడుపుతున్న రైలులో 147 మంది ప్రయాణికులు ఉండగా, హైస్పీడ్ రైలులో 397 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఆగి ఉన్న ఇరియో రైలును హైస్పీడ్ రైలు వెనుక నుంచి ఢీకొట్టిందా అనే విషయాన్ని ఇప్పటి వరకు నిర్ధరించలేకపోయామని అధికారులు తెలిపారు.
ప్రమాదానికి సంబంధించి అధికారిక వివరాలు ఇంకా వెల్లడికాలేదు. అయితే, పట్టాలలో తలెత్తిన సమస్య కారణంగా ఒక రైలు నిలిచిపోగా, వెనుక నుంచి వచ్చిన హైస్పీడ్ రైలు దానిని ఢీకొట్టినట్లు వార్తా కథనాలు సూచిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Arijit Sen/Hindustan Times via Getty Images
కర్ణాటకలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చూసింది. ఈ స్థానాల్లో బీజేపీకి ఇప్పటికే గట్టి పట్టు ఉంది. గతంలోనూ పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల కోటా కింద జరిగిన పలు ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించింది.
అయితే, ఈసారి బెంగళూరు ఉపాధ్యాయుల నియోజకవర్గంలో కూటమి సాధించిన విజయం అత్యంత కీలకంగా నిలిచింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పుట్టణ్ణ వరుసగా ఐదుసార్లు ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారు.
ఈసారి ఆయనను జనతాదళ్ సెక్యులర్ అభ్యర్థి, బెంగళూరు అడ్వొకేట్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఏపీ రంగనాథ్ ఓడించారు. 918 ఓట్ల మెజారిటీతో రంగనాథ్ విజయం సాధించారు.
ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వయంగా ప్రచారం చేశారు. మిగిలిన మూడు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఈ ఫలితాలపై రాష్ట్ర హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందిస్తూ, “ఫలితాలు మా అంచనాలకు అనుగుణంగా లేవు. దీని నుంచి మేము పాఠం నేర్చుకున్నాం. ఇకపై మరింత కష్టపడి పనిచేస్తాం. అయితే, ఈ ఫలితాలను మా ప్రభుత్వ పనితీరుకు అద్దంగా భావించలేం” అని అన్నారు.

ఫొటో సోర్స్, UGC
రాత్రి 2 నుంచి ఉదయం 8 గంటల మధ్య యానానికి నైరుతిగా(నరసాపురం వైపు) తీరం దాటిందని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది.
తీరం దాటిన తర్వాతే తీవ్ర తుపానుగా బలహీనపడిన అర్నబ్ ప్రభావంతో రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.పూర్తి కథనం లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అర్నబ్ తుపాను శ్రీకాకుళం జిల్లాలోనూ బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులతోపాటు భారీ వర్షం కురియడంతో శ్రీకాకుళం బస్టాండ్ నీట మునిగింది. బుకింగ్ కౌంటర్లలోకి నీరు చేరడంతో ఆర్టీసీ సిబ్బంది అవస్థలు పడ్డారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, UGC

ఫొటో సోర్స్, ANI
కాకినాడపై అర్నబ్ తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. జగన్నాధపురం గోలీల పేట, ఇందిరా నగర్, ముత్తా నగర్ వరకు సముద్రపు నీరు చొచ్చుకొస్తోంది.
సముద్రపు నీరు చేరడంతో ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి వెళ్ళిపోతున్నారు.

ఫొటో సోర్స్, PTI
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అర్నబ్ తుపాను తీవ్రతను గుర్తించి నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను త్వరగా పంపించాలని విజ్ఞప్తి చేశారు.
తుపాను వేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను అమిత్ షాకు చంద్రబాబు వివరించారు.
ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రాణ నష్టం లేకుండా చూశామని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర కేంద్ర సిబ్బంది సహాయం మరింత కాలం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఫొటో సోర్స్, PTI
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌కు చెందిన ఒక్కో షేరు రూ. 1,358 చొప్పున లిస్ట్ అయ్యింది.
ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ, 1977లో రిలయన్స్ తొలి పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు తన తండ్రి ముఖేష్ అంబానీ ఎంతో శ్రమించారని తెలిపారు.రిలయన్స్‌ను సామాన్య ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే నిర్ణయాన్ని మా తాత ధీరూభాయ్ అంబానీ తీసుకున్నారు. ఆ సమయంలో కంపెనీ రూ. 10 కోట్ల వాల్యుయేషన్‌తో రూ. 2.82 కోట్లు సమీకరించింది" అన్నారు.
జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ కోసం జరిగిన గంట మోగించే కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ, ఎన్ఎస్ఈ ఎండీ & సీఈఓ ఆశిష్ చౌహాన్ హాజరయ్యారు.

ఫొటో సోర్స్, ANI
అర్నబ్ తుపాను నర్సాపురానికి సమీపంలో తీరాన్ని దాటినట్టు ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ప్రకటించింది.
రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య యానాంకు నైరుతిగా, నర్సాపురం సమీపంలో తీరం దాటినట్టు కొద్దిసేపటి కిందట ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
తీరం దాటిన తర్వాత ప్రస్తుతం ఈ తుపాను బలహీనపడిందని తెలిపారు. అర్నబ్తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ప్రఖర్ జైన్ తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/Screenshot
అర్నబ్ తీవ్ర తుపాను తీరాన్ని తాకినట్టు విశాఖపట్నం వాతావరణ కేంద్రడైరెక్టర్ పీవీఎన్ మూర్తి చెప్పారు.
ఈ తీవ్ర తుపాను నర్సాపురం, యానాం మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకినట్టు మూర్తి ఏఎన్ఐకి చెప్పారు.
అర్నబ్ తుపాను పూర్తిగా తీరం దాటేందుకు మరో రెండు మూడు గంటల సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
"ప్రస్తుతం ఈ తీవ్ర తుపాను నర్సాపురం, యానాం మధ్య తీర ప్రాంతంలో ఉంది. ఇది గంటకు మూడు కిలోమీటర్ల అతి తక్కువ వేగంతో కదులుతోంది. తుపాను కేంద్రం ఇప్పటికే తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటడానికి ఒకటి నుంచి రెండు గంటలు, లేదా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టవచ్చు. తీరం దాటిన తర్వాత, ఈ తుపాను ఉత్తర-వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి, ఇవి గంటకు 140 కిలోమీటర్ల వేగం వరకు కూడా ఉండవచ్చు. తీరం దాటిన తర్వాత ఈ గాలుల తీవ్రత క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల తీవ్రత ఈ సాయంత్రం వరకు కొనసాగుతుంది; సాయంత్రం నుంచి వర్షాల తీవ్రత నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది, అదే సమయంలో గాలుల వేగం కూడా క్రమంగా తగ్గుతుంది" అని తెలిపారు.

ఫొటో సోర్స్, APEPDCL
అర్నబ్ తుపాను ప్రభావం తగ్గిన 24 గంటల్లోనే అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని ఏపీ విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బీబీసీకి ఫోన్ ద్వారా తెలిపారు.
తుపాను ప్రభావం ప్రస్తుతానికి ఏపీసీపీడీసీఎల్పై ఎక్కువ ప్రభావం చూపుతున్నందున తెలంగాణ సాయం కోరినట్టు మంత్రి తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన సామాగ్రి, మానవ వనరులు అందించాలని తెలంగాణ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో మాట్లాడామన్నారు. అవసరమైతే ఆ శాఖ మంత్రితో కూడా చర్చిస్తామని గొట్టిపాటి పేర్కొన్నారు.
ఇలాంటి సమయంలో పొరుగుల రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని ముందుకు సాగడం తమ విధానంలో భాగమని మంత్రి తెలిపారు. గతంలో తమిళనాడు సహాయం తీసుకున్నామని, ఇప్పుడు తెలంగాణ హెల్ప్ కోరామని వివరించారు.
ముందు జాగ్రత్తగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు 15000లకుపైగా విద్యుత్ స్తంభాలు, ఇతర సామాగ్రిని తరలించామని మంత్రి తెలిపారు. తుపాను ప్రభావం శ్రీకాకుళం జిల్లా మొదలు కొని, కృష్ణా జిల్లా వరకు ఉంటుందన్నారు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గకపోవడంతో పనులకు ఆటంకం కలుగుతోందని చెప్పారు. అయినా సరే విశాఖలో విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని, ఇప్పుడు అక్కడి సిబ్బందిని, సామాగ్రిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని అన్నారు.
దాదాపు నాలుగు వందల వరకు ఫీడర్స్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు మంత్రి వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగి సరఫరాకు అంతరాయం ఏర్పడితే మరికొన్ని చోట్ల ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులే సప్లై నిలిపివేశారని పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖ పట్టిన వెంటనే గంటల వ్యవధిలోనే పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని, అంత వరకు ప్రజలు విద్యుత్ తీగలు పట్టుకోవడం, స్తంభాలను తాకడం చేయవద్దని సూచించారు.

ఫొటో సోర్స్, ANI
అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరం దాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు. ఏఎన్ఐతో మాట్లాడిన ఆమె తుపాను తీరం దాటే సమయంలో 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.
"ప్రస్తుతం ఈ తుపాను తీవ్రతను గమనిస్తే, కోనసీమ, కాకినాడ పరిసర ప్రాంతాలతోపాటు ఇతర తీరప్రాంత జిల్లాల్లో గాలి వేగం గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం తుపాను దాదాపు ఒకే చోట నిలిచి ఉంది.ఒకటి రెండు గంటల్లో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఈ తుపాను తీరాన్ని దాటుతుందని అంచనా. ఆ తర్వాత దీని తీవ్రత తగ్గి, 'తీవ్ర తుపాను'గా మారుతుంది.మధ్యాహ్నానికి ఇది మరింత బలహీనపడి కేవలం 'తుపాను'గా మారే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో ఇది 'అత్యంత తీవ్ర తుపాను' స్థితిలో ఉంటుంది. కొన్ని గంటల తర్వాత గాలి వేగం గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. మధ్యాహ్నానికి గాలి వేగం మరింత తగ్గి, గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లకు చేరుకుంటుందని అంచనా" అని నాగరత్నం తెలిపారు.

ఫొటో సోర్స్, Facebook/SCR
అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే దీనికి సంబంధించిన తాజా వివరాలతో ఒక ప్రకటన విడుదల చేసింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం ఇవాళ రేపు రద్దు అయిన రైళ్ల వివరాలు ఇవే
ఇవాళ రద్దు అయిన రైళ్లు (28 అక్టోబర్)
రేపు రద్దు అయిన రైళ్లు(29 అక్టోబర్)
శుక్రవారం రద్దు అయిన రైళ్లు(30 అక్టోబర్)

ఫొటో సోర్స్, APSDMA
అర్నబ్ తుపాను తీరం దాటే ప్రక్రియ రెండుగంటలుగా నిలకడగా ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
తీరం దాటే ప్రక్రియ నరసాపురానికి 30 కిమీ దూరంలోనే కేంద్రీకృతమై కొనసాగుతోందని తెలిపింది.
తుపాను మధ్యాహ్ననికి పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు కొనసాగుతాయని, వర్షాలు కురుస్తాయని ఇవాళ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఫొటో సోర్స్, IPR BRA Konaseema
యానాంలో మంగళవారం సాయంత్రం నుంచి ఏకధాటిగా వానలు పడుతున్నాయని బీబీసీ ప్రతినిధి గరికిపాటి ఉమాకాంత్ తెలిపారు.
“ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ కాకినాడ నగరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పుదుచ్చేరి రాష్ట్రంలోని యానాంలో ఉన్నాను. నిన్నటి నుంచి ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తూనే ఉంది. రాత్రి 4 గంటల తర్వాత గాలుల ప్రభావం ఉన్నప్పటికీ వర్షం జోరు తగ్గింది. మళ్లీ ఉదయం ఆరు గంటల 20 నిమిషాల నుంచి వర్ష ఉద్ధృతి పెరిగింది” అని వివరించారు.
అర్నబ్ తుపాను ప్రభావంతో యానాంను ఆనుకొని వెళ్లే జాతీయ రహదారిపై చెట్లు నేల కూలాయి. తుపాను ఈ ప్రాంతంలో భారీ విధ్వంసం సృష్టించింది.
తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో యానాం అధికారులు ముందు జాగ్రత్తగా చాలా ప్రాంతాల్లోని ప్రజలను శిబిరాలకు తరలించారు. అక్కడ పరిస్థితులు తెలుసుకునేందుకు మంత్రి మల్లాదికృష్ణారావు శిబిరాలను పరిశీలించారు. అనంతరం సముద్రం నీరు చొచ్చుకొని వచ్చిన సావిత్రి నగర్‌ను కూడా సందర్శించారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడారు. అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు.

ఫొటో సోర్స్, ANI
అర్నబ్ తుపాను తీరం దాటుతున్న సమయంలో కాకినాడ జిల్లాలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. అధికారుల హెచ్చరికలతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. రాత్రంతా కురిసిన వర్షం ధాటికి పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
‘అర్నబ్’ ప్రభావం కాకినాడ జిల్లాలోని చాలా ప్రాంతాలపై పడింది. పగడాలపేట సహా పలు తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. వారి కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడ వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పించారు.

ఫొటో సోర్స్, @GVMC_VISAKHA
అర్నబ్ తుపానుకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఆర్టీజీఎస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరో రెండు రోజుపాటు దీని ప్రభావం ఉంటుందని తెలిపారు.
ఇవాళ ఉదయం 6 గంటల తర్వాత తుపాను తీరం దాటుతోందని వేకువజామున అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.
తుపాన్ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయని, కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ నిలిపేశామన్నారు.
పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాలని... తీవ్రత తగ్గాక విద్యుత్ పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
చెరువులు, కాల్వలు పొంగి పొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జిల్లాల వారీగా తాము చేపడుతున్న సహయక చర్యలను కలెక్టర్లు వివరించారు.
కోనసీమ జిల్లాలో సుమారు 6వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.