రన్‌వేపై అదుపు తప్పి క్రాష్ అయిన విమానం, ఐదుగురు మృతి.. ప్రమాద ఘటన 7 ఫోటోలలో...

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రమాదానికి గురై ఒరిగిన విమానం ఇలా కనిపించింది.
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

అమెరికాలోని ఫ్లోరిడాలో విమాన ప్రమాదం జరిగింది.

మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగేందుకు ప్రయత్నిస్తున్న ఓ అమెజాన్ కార్గొ విమానం రన్‌వేను ఢీకొట్టింది.

ఈ ఘటనలో 5 మంది చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్యూర్టో రికోలోని సాన్ జువా లూయీ మునోజ్ మారిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన బోయింగ్ 767-300 కార్గో విమానం ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) క్రాష్ అయ్యింది.

గ్రౌండ్‌పై ఉన్న పలు ఇతర వాహనాలను సైతం ఈ విమానం ఢీకొట్టింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రమాదానికి గురైన విమానాన్ని బైనాక్యులర్ ద్వారా చూస్తున్న బాలుడు

ప్రమాదం జరిగిన క్షణాల్లోనే రిస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, సహాయక చర్యలు అందిస్తున్నారని మయామి డేడ్ కౌంటీ మేయర్ డానియెల్ల లెవీన్ కావా తెలిపారు.

ఈ ఘటనతో మయామిలో అన్ని విమానాల రాకపోకలను నిలిపివేయాలని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆదేశించింది.

ఈ ప్రమాదం ఏడాదిలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రయాణ సమయాల్లో ఒకటైన లేబర్ డే (కార్మిక దినోత్సవం) వారాంతంలో జరిగింది.

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, విమానం ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయిన వాహనం

గాయపడిన ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని మయామీ ఫైర్ చీఫ్ రాయిద్ జడల్లా తెలిపారు.

క్షతగాత్రుల్లో పలువురు విమానం లోపల, నేలపై ఉన్న వాహనాల కింద చిక్కుకొని ఉన్నారని వెల్లడించారు.

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, విమానం రన్‌వే మీద ఇలా ఒరిగిపోయింది.

200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో ఉన్నారని జడల్లా తెలిపారు.

మంటలను పూర్తిగా ఆర్పేసినా, ఘటనా స్థలిలో ఇంకా ఇంధనం లీక్ అవుతోందని చెప్పారు.

విమాన ప్రమాదం
ఫొటో క్యాప్షన్, విమానం ప్రమాదానికి గురైన ఎయిర్ పోర్ట్ చిత్రం

ప్రమాదానికి గల కారణాలు ఇప్పుడే తెలియవని, జాతీయ రవాణా భద్రతా బోర్డు ప్రమాదంపై పూర్తి దర్యాప్తు చేస్తుందని అధికారులు తెలిపారు.

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

ఈ ఘటనపై అమెజాన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

"ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారనే వార్త మమ్మల్ని తీవ్రంగా బాధపెట్టింది. బాధితులకు సహాయం అందించేందుకు అధికారులకు సహకరిస్తున్నాం" అని అమెజాన్ కార్పొరేట్ గ్లోబల్ మీడియా రిలేషన్స్ డైరెక్టర్ కెల్లీ నాన్టెల్ తెలిపారు.

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రమాదానికి గురైన విమానాన్ని పరిశీలిస్తున్న సిబ్బంది

ఫ్లైట్‌ రాడార్24 అనే ట్రాకింగ్ సైట్ ప్రకారం, రన్‌వే నుంచి నిష్క్రమించే క్రమంలో అమెజాన్ కార్గొ విమానం గంటకు 207 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు డాటా సూచిస్తోంది.

ఘటన జరిగిన సమయంలో మయామిలో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షం, ఈదురు గాలులు వీస్తున్నాయని ఆ వెబ్‌సైట్ చెబుతోంది.

ప్రమాదం కారణంగా అనేక విమాన సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అధికారుల నుంచి తమకు సరైన సమాచారం లేదని వాపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)