సుప్రీంకోర్టు జడ్జి అనుకుని అసదుద్దీన్ ఒవైసీకి గౌరవ వందనం సమర్పించిన ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు
సుప్రీంకోర్టు జడ్జిగా భావించి ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి పోలీసులు పొరపాటున గౌరవ వందనం సమర్పించినట్టు పీటీఐ రిపోర్ట్ చేసింది.
ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లోని సర్క్యూట్ హౌస్‌ను సుప్రీంకోర్టు జడ్జి ఒకరు శనివారం(నవంబర్ 21) సందర్శించాల్సిఉంది.
ఆయన పర్యటన సందర్భంగా గౌరవ వందనం సమర్పించేందుకు పోలీసులు ఉదయాన్నే అక్కడకు చేరుకున్నారు.
అయితే, అదే సమయంలో అసదుద్దీన్ ఒవైసీ అక్కడకు వెళ్లారు. అప్పటికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇంకా అక్కడకు చేరుకోలేదు.
పోలీసులు అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్ట్ జడ్జి అనుకుని గౌరవ వందనం సమర్పించారని పీటీఐ తెలిపింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









