లైవ్ , అమెరికా మధ్యంతర ఎన్నికలు: కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్.. కొన్ని చోట్ల మొదలైన లెక్కింపు

అమెరికాలో చాలా రాష్ట్రాల్లో పోల్స్ ముగిశాయి. ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది. కెంటకీ, ఇండియానా, ఫ్లోరిడా, సౌత్ కరోలినా, వెర్మాంట్, వర్జీనియా, జార్జియా, న్యూ హాంప్‌షైర్, ఒహియో, నార్త్ కరోలినా, వెస్ట్ వర్జీనియాలో ఓటింగ్ ఇంకా కొనసాగుతోంది.

సారాంశం

  • అమెరికాలో చాలా రాష్ట్రాల్లో పోల్స్ ముగిశాయి. ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది.
  • యూఎస్ ఓటర్ల సర్వేలో ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్య స్థితి ఓటర్లను ప్రధానంగా ప్రభావితం చేసినట్టు తేలింది.
  • ఈ ఫలితాలు డెమొక్రాట్‌లకు కొంత ఊరటనిస్తాయనే విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
  • యూరప్ వ్యాప్తంగా 7 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు.
  • 57 నిమిషాలు క్రితంఫ్లోరిడాలో రిపబ్లికన్ అభ్యర్థిపై భారత సంతతికి చెందిన పియా దండియా విజయం

లైవ్ కవరేజీ

  1. ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు, యూరప్ వ్యాప్తంగా కలకలం

    ఐరోపా
    ఫొటో క్యాప్షన్, ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు

    యూరప్ వ్యాప్తంగా 7 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. వీటిలో రెండు యూకే నుంచి బయలుదేరాయి.

    డబ్లిన్, లిస్బన్ నుంచి బయలుదేరిన రెండు రైనాఎయిర్ విమానాలు రోమ్‌లో ల్యాండ్ చేసి సోదాలు చేశారు. అయితే, ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని ఆ నగరంలోని ఫియుమిసినో విమానాశ్రయ వర్గాలు బీబీసీకి తెలిపాయి.

    డబ్లిన్ విమానం దిగే వరకు ఇటాలియన్ వైమానిక దళం దానికి రక్షణగా నిలిచింది. అధికారులు పోలాండ్, స్పెయిన్, బల్గేరియాలోని విమానాల్లో కూడా తనిఖీలు చేపట్టారు.

    ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోయినప్పటికీ, కావాలనే గగనతల ప్రయాణానికి అంతరాయం కలిగించేందుకు గందరగోళపరిచేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

    "దురుద్దేశపూర్వక బూటకపు బెదిరింపులు"గా యూకే ప్రభుత్వం అభివర్ణించింది.

    "ప్రపంచంలోనే అత్యంత పటిష్టమైన విమానయాన భద్రతా వ్యవస్థలలో ఒకటి తమ వద్ద ఉందని, ఇలాంటి దురుద్దేశపూర్వక బూటకపు బెదిరింపులతో పాటు, ఏవైనా ముప్పులను ఎదుర్కొనే శక్తి ఉంది" అని ఒక ప్రకటనలో పేర్కొంది.

    ప్రయాణీకుల విమానాల్లో బాంబు బెదిరింపులు "అంత తరచుగా జరగవని", అందువల్ల తాజా ఘటనలు "అసాధారణమైనవని" విమానయాన భద్రతా నిపుణుడు పాల్ మేసన్ అన్నారు.

  2. ఫ్లోరిడాలో రిపబ్లికన్ అభ్యర్థిపై భారత సంతతికి చెందిన పియా దండియా విజయం

    పియా దండియా, అమెరికా మధ్యంతర ఎన్నికలు
    ఫొటో క్యాప్షన్, పియా దండియా

    అమెరికా మధ్యంతర ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కొన్నిచోట్ల ఫలితాలు వస్తున్నాయి.

    డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, భారత సంతతికి చెందిన పియా దండియా ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెస్ నియోజకవర్గం స్థానాన్ని గెలుచుకున్నట్టు ఛానల్ సీబీఎస్ పేర్కొంది. ఆమె రిపబ్లికన్ అభ్యర్థి కేసీ ఆస్కార్‌ను ఓడించారు.

    2026 మధ్యంతర ఎన్నికలకు ముందు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెసాంటిస్ చేపట్టిన కాంగ్రెస్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా తిరిగి ఏర్పడ్డ ఈ కొత్త నియోజకవర్గంలో దండియా విజయం డెమోక్రటిక్ పార్టీకి దక్కిన ఘనతగా నిలిచింది.

    దండియా గతంలో హార్లెమ్‌లో ఉపాధ్యాయురాలిగా, ఉన్నత పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు. ఆమె వైట్ హౌస్ ఫెలోగా కూడా సేవలందించారు. ఆపిల్‌లో కూడా పనిచేశారు.

    ఎన్ఆర్ఐ సంతతి అయిన దండియా పామ్ బీచ్ కౌంటీలో పుట్టి పెరిగారు. తన ప్రచారంలో విద్య, ద్రవ్యోల్బణ సవాళ్లు, ఆర్థిక అవకాశాలను కీలక అంశాలు ప్రస్తావించారు.

    ఆగస్టులో జరిగిన డెమోక్రటిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో దండియా గెలుపొందారు.

    దాండియా ప్రత్యర్థి అయిన కేసీ అస్కార్ నేపుల్స్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త, మెరైన్ కార్ప్స్ మాజీ సైనికుడు. ప్రచార సమయంలో, ఆయన తనను తాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రభుత్వ విధానాల మద్దతుదారుగా అభివర్ణించుకున్నారు.

  3. ఘోర రైలు ప్రమాదం: స్పెయిన్ రవాణా శాఖ మంత్రి రాజీనామా

    ఆస్కార్ ప్యూంటె
    ఫొటో క్యాప్షన్, ఆస్కార్ ప్యూంటె

    స్పెయిన్‌లో దాదాపు 69 మంది మరణించి, పదుల సంఖ్యలో గాయపడిన రైలు ప్రమాదం జరిగిన ఆరు రోజుల తర్వాత ఆ దేశ రవాణా శాఖ మంత్రి ఆస్కార్ ప్యూంటె రాజీనామా చేశారు.

    రాజధాని మాడ్రిడ్‌కు దక్షిణాన ఉన్న ఉర్దా పట్టణం సమీపంలో గత బుధవారం జరిగిన దుర్ఘటన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌లో తన నిర్ణయాన్ని ప్రకటించారు.

    "స్పెయిన్ వంటి దేశంలో, ఏడాదిలోపు ఇంతటి తీవ్రత కలిగిన రెండు ప్రమాదాలు జరిగిన తర్వాత ఒక రవాణా శాఖ మంత్రి పదవిలో కొనసాగలేను" అని ఆయన అన్నారు. ఇదే మార్గంలో జనవరిలో జరిగిన రైలు ప్రమాదాన్ని ఆయన గుర్తుచేశారు.

    గత వారం జరిగిన ప్రమాదం ఐరోపా ఆధునిక చరిత్రలో అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఒకటి కాగా, 2013 తర్వాత స్పెయిన్‌లో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదం కూడా ఇదే.

  4. అమెరికా మధ్యంతర ఎన్నికలు: కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న పోలింగ్.. కొన్ని చోట్ల మొదలైన లెక్కింపు

    అమెరికా మధ్యంతర ఎన్నికలు
    ఫొటో క్యాప్షన్, అమెరికా మధ్యంతర ఎన్నికల అప్‌డేట్: కొన్ని రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

    అమెరికాలో చాలా రాష్ట్రాల్లో పోల్స్ ముగిశాయి. ఓట్ల లెక్కింపు కూడా మొదలైంది.

    కెంటకీ, ఇండియానా, ఫ్లోరిడా, సౌత్ కరోలినా, వెర్మాంట్, వర్జీనియా, జార్జియా, న్యూ హాంప్‌షైర్, ఒహియో, నార్త్ కరోలినా, వెస్ట్ వర్జీనియాలో ఓటింగ్ ఇంకా కొనసాగుతోంది.

    డెమొక్రటిక్ సెనేటర్ మార్క్ ఆర్. వార్నర్ తన సీటు నిలబెట్టుకుంటారని సీబీఎస్ న్యూస్ అంచనా వేస్తోంది. ఇది ఊహించిన ఫలితమని అంటున్నారు.

    జార్జియా సెనేట్ రేసు డెమొక్రటిక్ అధికారంలో ఉన్న జోన్ ఒసాఫ్‌కు వెళ్తుందని అంచనా ఉంది.

    యూఎస్ ఓటర్ల సర్వేలో ఆర్థిక వ్యవస్థ, ప్రజాస్వామ్య స్థితి ఓటర్లను ప్రధానంగా ప్రభావితం చేసినట్టు తేలింది.

    ఈ ఫలితాలు డెమొక్రాట్లకు కొంత ఊరటనిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఫలితాలపై ఆశాజనకంగా ఉన్నారని ఒక అధికారి బీబీసీతో చెప్పారు

  5. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన అప్‌డేట్స్ మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి