గుడ్‌నైట్
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన కథనాలు:
పుతిన్, ట్రంప్‌లతో తన సమావేశం ‘పాజిటివ్‌గా, కనస్ట్రక్టివ్‌గా, చాలా ప్రొడక్టివ్‌గా సాగింది’ అని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తెలిపారని చైనా బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ పేర్కొంది. ‘రెండో ప్రపంచ యుద్ధంలో కలసి పోరాడిన చరిత్రను జిన్‌పింగ్ గుర్తు చేసుకున్నారని.. కష్టపడి సాధించుకున్న శాంతిని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యాన్ని ముగ్గురు నేతలు నొక్కి చెప్పారని సీసీ టీవీ పేర్కొంది.
గుడ్‌నైట్
ఈ లైవ్ పేజీని ఇంతటితో ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్యమైన కథనాలు:

ఫొటో సోర్స్, IMD
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను అక్వాన్ గురువారం సాయంత్రం 5.30 గంటల సమయానికి కళింగపట్నానికి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం నాటికి ఇది ఒడిశాలోని గోపాల్‌పుర్ సమీపంలో తీరం దాటొచ్చని అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
‘అక్వాన్’ తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్రంగా ఉండొచ్చన్న భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.
తీరప్రాంత మండలాలైన రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, ఇచ్ఛాపురం మండలాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు పూర్తిగా సెలవు వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
తీరప్రాంత మండలాలు మినహా శ్రీకాకుళం టెక్కలి డివిజన్లలోని మిగిలిన మండలాల్లో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున కురిసే వర్షపాతం, గాలుల వేగాన్ని బట్టి సెలవు ప్రకటించే అధికారాన్ని స్థానిక మండల స్థాయి అధికారులకు (తహసీల్దార్, ఎంఈఓ) కలెక్టర్ అప్పగించారు.
శుక్రవారం ఉదయం 6 గంటలకు శ్రీకాకుళం, టెక్కలి ఆర్డీఓలు ఈ పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించి తగిన నిర్ణయం తీసుకుంటారని, ఈ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చూడాలని ఆర్డీఓలందరినీ ఆదేశించినట్లు ప్రకటనలో తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
పుతిన్, ట్రంప్‌లతో తన సమావేశం ‘పాజిటివ్‌గా, కనస్ట్రక్టివ్‌గా, చాలా ప్రొడక్టివ్‌గా సాగింది’ అని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తెలిపారని చైనా బ్రాడ్‌కాస్టర్ సీసీటీవీ పేర్కొంది.
‘రెండో ప్రపంచ యుద్ధంలో కలసి పోరాడిన చరిత్రను జిన్‌పింగ్ గుర్తు చేసుకున్నారని.. కష్టపడి సాధించుకున్న శాంతిని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యాన్ని ముగ్గురు నేతలు నొక్కి చెప్పారని సీసీ టీవీ పేర్కొంది.
ప్రధాన శక్తులన్నీ ఇతర దేశాల న్యాయబద్ధమైన భద్రతా ఆందోళనలను గౌరవించాలని, చర్చలు కొనసాగినంత కాలం, తలుపులు తెరిచి ఉన్నంత కాలం శాంతిపై ఆశ ఉంటుందని ముగ్గురు నేతలు అంగీకరించినట్లు జిన్ పింగ్ చెప్పారని సీసీటీవీ రిపోర్ట్ చేసింది.
ఈ త్రైపాక్షిక సమావేశంలో నాటిన విత్తనాలు నిస్సందేహంగా వేళ్లూనుకుని, మొలకెత్తి, వికసించి, ఫలాలను ఇస్తాయని ఆ రిపోర్ట్ పేర్కొంది.

ఫొటో సోర్స్, VSBabu/x.com
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడులోని కొలత్తూరు ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూశారని ఎంజీఎం ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ఆయన వయసు 75 సంవత్సరాలు.
గత ఎన్నికలలో డీఎంకే నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఆయన ఓడించారు.
దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యల కారణంగా వీఎస్ బాబు సెప్టెంబర్ 9 నుంచి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి డైరెక్టర్ తెలిపారు.
వైద్యులు పలు చికిత్సలు చేసినప్పటికీ ఆయన పరిస్థితి విషమించిందని.. ఈరోజు (నవంబర్ 19) మధ్యాహ్నం ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
వీఎస్ బాబు కొలత్తూరు నియోజకవర్గం నుంచి టీవీకే అభ్యర్థిగా తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆయన డీఎంకే నాయకుడు ఎం.కె. స్టాలిన్‌పై 8,795 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
వీఎస్ బాబు మృతి పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం తెలిపారు.

ఫొటో సోర్స్, IMD
అక్వాన్ తీవ్ర తుపాను పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర, వాయువ్య దిశగా సాగుతోందని భారతవాతావరణ శాఖ వెల్లడించింది.
ఇది ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం, ఒడిశాలోని పూరీ మధ్య తీరం దాటే అవకాశముందని తెలిపింది.
నవంబర్ 20 మధ్యాహ్నం నాటికి ఇది ఒడిశాలోని గోపాల్‌పుర్ సమీపంలో తీరం దాటొచ్చని అంచనా వేసింది.
తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తరాంధ్ర జిల్లాలపై తుపాను ప్రభావం ఉంటుందని ఐఎండీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ కె.నాగరత్న ఏఎన్ఐవార్తాసంస్థతో చెప్పారు.
చెట్లకొమ్మలు విరిగిపడొచ్చని, చెట్లు నేలకూలే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదని సూచించారు.

ఫొటో సోర్స్, VCG/VCG via Getty Images
ఏఐ చాట్‌బాట్ క్లాడ్ వెనుక ఉన్న సంస్థ ఆంథ్రోపిక్ స్టాక్ మార్కెట్ అరంగేట్రంలో రికార్డు స్థాయిలో $81 బిలియన్లు (సుమారు రూ. 7.5 లక్షల కోట్లు) సమీకరించింది.
ఇది ఈ సంస్థను ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలలో ఒకటిగా నిలబెట్టనుంది.
నష్టాల్లో ఉన్న ఈ వ్యాపారంలో షేర్లను కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్ల నుండి భారీగా ఆసక్తి పెరగడంతో, మొదట అనుకున్న కంటే ఎక్కువ షేర్లు అమ్ముడయ్యాయి.
ఆంథ్రోపిక్ షేర్ ధరను మొదట ప్రతిపాదించిన $70-$78 శ్రేణి కంటే ఎక్కువగా, $83 వద్ద నిర్ణయించారు.

ఫొటో సోర్స్, Reuters
షీ జిన్‌పింగ్, డోనల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య త్రైపాక్షిక సఃమావేశం ముగిసిందని చైనా స్టేట్ బ్రాడ్‌కాస్టర్ సీసీ టీవీ, రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ వెల్లడించాయి.
ఈ ముగ్గురు నేతల మధ్య సమావేశం గంటన్నర పాటు సాగినట్లు టాస్ వెల్లడించింది.

ఫొటో సోర్స్, EPA
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఎపెక్ సదస్సు జరిగిన షెన్‌జెన్‌లో ఈ త్రైపాక్షిక సమావేశం జరుగుతోంది.
చైనా, రష్యా, అమెరికా అధినేతలు ఒకే సమావేశంలో పాల్గొనడం చరిత్రలో ఇదే తొలిసారి. దీనికి "చరిత్రాత్మక ప్రాధాన్యం ఉంది" అని జిన్‌పింగ్ సమావేశం ప్రారంభంలో వ్యాఖ్యానించినట్టు చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది.
సమావేశం ప్రారంభం కావడానికి ముందు ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్‌లు ఒక వేదికపై నిలబడ్డారు. వాళ్ల వెనుక మూడు భాషల్లో (చైనీస్, రష్యన్, ఇంగ్లీష్) 'చైనా-రష్యా-అమెరికా షెన్‌జెన్ సదస్సు' అనే పదాలు కనిపించాయి.
వేదికపై మూడు దేశాల జాతీయ జెండాలను ఏర్పాటు చేశారు. నాయకులకు ఇరువైపులా మూడుదేశాల జెండాలనుంచారు. జిన్‌పింగ్ మధ్యలో నిలబడగా ఆయనకు ఎడమవైపు ట్రంప్, కుడివైపు పుతిన్ నిలబడ్డారు.
ఆ వెంటనే ముగ్గురూ అక్కడి నుంచి బయలుదేరి మూడు దేశాల మధ్య త్రైపాక్షిక సమావేశం జరిగే హాలులోకి వెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Doug Mills - Pool/Getty Images
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశంలో వివిధ విషయాలు చర్చకు వచ్చినట్టు చైనా ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది.
వాణిజ్యం, హార్ముజ్ జలసంధి, ఇరాన్ అణు కార్యక్రమం, రష్యా-యుక్రెయిన్ యుద్ధంతో సహా పలు అంశాలపై చైనాతో సహకారం గురించి సమావేశం ప్రారంభంలో ట్రంప్ మాట్లాడారు.
హార్ముజ్ జలసంధి ద్వారా ఇంధన సరఫరా కొనసాగాలని అమెరికా, చైనా రెండూ కోరుకుంటున్నాయని, ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదని ట్రంప్ అన్నారు .
రష్యా-యుక్రెయిన్ యుద్ధం వల్ల ప్రతి నెలా సుమారు 25,000 మంది సైనికులు మరణిస్తున్నందున, దానిని ముగించేందుకు రెండు దేశాలు సహాయం చేయాలనుకుంటున్నాయని ట్రంప్ అన్నారు.
షీ జిన్‌పింగ్‌తో తన వ్యక్తిగత సంబంధం "అద్భుతంగా" ఉందని ట్రంప్ అభివర్ణించారు. "మీరు, నేను బాధ్యత తీసుకున్నంత కాలం, మనకు ఎప్పటికీ ఎలాంటి సమస్యలు ఉండవని భావిస్తున్నాను" అని ఆయన అన్నారు.
రాయిటర్స్ వార్తా సంస్థ ప్రకారం , చైనా-అమెరికా సంబంధాలు "సరైన దిశలో ముందుకు సాగేలా" చూసేందుకు తాను ట్రంప్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని షీ చెప్పారు.
రెండు దేశాల సంబంధాలు మొత్తం మీద స్థిరంగా, మెరుగుపడుతున్నాయని షీ అభివర్ణించారు. పరస్పర గౌరవం, న్యాయం, సమన్వయంతో కూడిన చర్యల ఆధారంగా ఇద్దరు నాయకులు ఈ సంబంధాన్ని పునర్నిర్మించారని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Hagen Hopkins/Getty Images
భారత్, న్యూజీలాండ్ తొలి టెస్టు మొదటిరోజు కివీస్ జట్టు ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.
ఎదురుదెబ్బల నుంచి కోలుకున్న న్యూజీలాండ్ తొలిరోజు ఆట ముగిసేనాటికి హెన్రీ నికోల్స్ 113 పరుగులతో, గ్లెన్ ఫిలిప్స్ 94 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.
వారిద్దరూ ఆరో వికెట్‌కు 173 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
నికోల్స్ తన టెస్ట్ కెరీర్‌లో 12వ సెంచరీని పూర్తి చేయగా, ఫిలిప్స్ సెంచరీకి ఆరు పరుగుల దూరంలో ఉన్నాడు.
టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్‌లోనే న్యూజీలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్‌ను ఔట్ చేశాడు.
భారత ఫాస్ట్ బౌలర్లు న్యూజీలాండ్‌ను 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత నికోల్స్, ఫిలిప్స్ తొలి రోజు ఆట ముగిసే వరకు మరో వికెట్ నష్టపోకుండా జాగ్రత్తగా ఆడారు.
భారత్ తరఫున బుమ్రా 17 ఓవర్లలో 52 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్, అన్షుల్ కంబోజ్‌లు చెరో వికెట్ తీసుకున్నారు.

ఫొటో సోర్స్, Ng Han Guan - China Pool/Getty Images
ఆసియా-పసిఫిక్ ప్రాంత ఆర్థిక వ్యవస్థలతో రష్యా 'సానుకూల భాగస్వామ్యాన్ని' కోరుకుంటోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
రష్యాను ఈ ప్రాంతంలో ఒక "విడదీయరాని భాగం"గా ఎపెక్ శిఖరాగ్ర సమావేశంలో పుతిన్ అభివర్ణించారని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ తెలిపింది.
ప్రపంచానికి రష్యా ద్వారాలు తెరిచి ఉందని, తన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకుంటోందని ఆయన అన్నారు .
కృత్రిమ మేధస్సు, సాంకేతికతకు సంబంధించిన నైపుణ్యాన్ని ఈ ప్రాంతంలోని తమ భాగస్వాములతో పంచుకోవడానికి రష్యా సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
తన ప్రసంగం ముగింపులో ఎపెక్ శిఖరాగ్ర సమావేశ ఉమ్మడి ప్రకటనకు పుతిన్ మద్దతు తెలిపారు.
దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఎపెక్ గ్రూప్ ఫోటోలో పుతిన్ కనిపిస్తున్నారు.

ఫొటో సోర్స్, Sergei BOBYLYOV/POOL/AFP via Getty Images

ఫొటో సోర్స్, Ng Han Guan - China Pool/Getty Images
చైనా, రష్యా దేశాల నాయకులు ఇద్దరూ తనను ఇష్టపడతారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు. పుతిన్, జిన్‌పింగ్‌తో త్రైపాక్షిక సమావేశానికి ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"వందల సంవత్సరాలుగా పసిఫిక్‌లో అమెరికా ఒక శక్తిగా ఉంది. ఈ ప్రాంతంలో అభివృద్ధి, స్థిరత్వం, సార్వభౌమత్వం, శ్రేయస్సు, శాంతిని ప్రోత్సహించడానికి కృషి చేస్తూనే ఉంటాం" అని ఎపెక్ సదస్సులో ట్రంప్ అన్నారు .
దేశం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతోందని అమెరికా ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఏఐ ఒక మంచి సాంకేతికత అని, ఈ పరిశ్రమ వృద్ధిని అడ్డుకునే నిబంధనలను తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు.
ట్రంప్‌కు ముందు జిన్‌పింగ్ ప్రసగించారు. ఆ సమయంలో ట్రంప్ కళ్ళు మూసుకుని కనిపించగా, పుతిన్ మాత్రం శ్రద్ధగా ఏదో చదువుతూ కనిపించారు.

ఫొటో సోర్స్, Ng Han Guan/POOL/AFP via Getty Images
ఆసియా-పసిఫిక్ సహకారానికి తమ మద్దతు కొనసాగుతుందని చైనాఅధ్యక్షుడు జిన్‌పింగ్ తెలిపారు.
ఎపెక్ సదస్సు ప్రధాన సమావేశంలో జిన్‌పింగ్ మాట్లాడారు.
"చైనాకు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో మూలాలు ఉన్నాయి. ఆసియా-పసిఫిక్ సహకారం కోసం చైనా 20 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తుంది’’ అనిప్రకటించారు.
షెన్‌జెన్‌లో ఆసియా-పసిఫిక్ అధ్యయనాల కేంద్రాన్ని చైనా ఏర్పాటు చేస్తుందని కూడా చెప్పారు.
ఈ సమావేశం సందర్భంగా ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్ సహా ప్రపంచ నాయకులు గ్రూప్ ఫోటో తీసుకున్నారు.
స్వేచ్ఛా వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థల వైవిధ్యీకరణ, డేటా నిర్వహణకు సంబంధించిన నిబంధనలకు 33వ ఎపెక్ సదస్సులో జిన్‌పింగ్ మద్దతు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఎపెక్ సదస్సు జరుగుతున్న షెన్‌జెన్ ఇంటర్నేషనల్ ఎక్సేంజ్ సెంటర్‌కు ట్రంప్, జిన్‌పింగ్, పుతిన్ చేరుకున్నారని చైనా ప్రభుత్వ మీడియా సీసీటీవీ తెలిపింది.
కాసేపట్లో పుతిన్, జిన్‌పింగ్, ట్రంప్‌ల కీలక సమావేశం జరగనుంది.
ఎపెక్ సదస్సు జరిగే ప్రాంతం కాకుండా షెన్‌జెన్‌లోని కైలిన్ విల్లాకు కాసేపటి తర్వాత ముగ్గురు నేతలు వెళ్లనున్నట్టు సమాచారం.
కైలిన్ విల్లా దగ్గర భద్రతాఏర్పాట్లు చేయడం కాస్త సులభమని, సమావేశం ముగిసిన వెంటనే దగ్గరే ఉన్న ఎయిర్ పోర్ట్ నుంచి ట్రంప్ నేరుగా బయలుదేరే వీలుంటుందని న్యూయార్క్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ షాయూ యువాన్ అభిప్రాయపడ్డారు.
అధికారిక హంగులు ఎంత తక్కువగా ఉంటే..ఆశించిన ఫలితాలు రాకపోయినా రాజకీయంగా ఎదరయ్యే ఇబ్బందులు అంత తక్కువగా ఉంటాయని ఆయన విశ్లేషించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో సోర్స్, IMD
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర తుపాను 'అక్వాన్' వేగంపెంచింది.
గత ఆరు గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది.
ప్రస్తుతం ఇది నర్సాపురంకు 420 కిలోమీటర్లు, కళింగపట్నానికి ఆగ్నేయంగా 400 కిలోమీటర్లు, చెన్నైకి ఈశాన్యంగా 580 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 490 కిలోమీటర్లు, పూరీకి 550 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఈ తుపాను ఉత్తర-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నానికి నర్సాపురం, పూరీ మధ్య గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది.
తీరం దాటే సమయంలో గరిష్ఠంగా గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. గాలుల వేగం అప్పుడప్పుడు గంటకు 110 కిలోమీటర్ల వరకు చేరవచ్చు.
శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.
ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు.
నేను బీబీసీ ప్రతినిధి కమలాదేవి నల్లపనేని.
ఇప్పటినుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ముఖ్యమైన అంశాలను అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.