లైవ్ , బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా అక్వాన్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన అక్వాన్ రేపు(నవంబర్ 19)సాయంత్రానికి సమయానికి అతి తీవ్రతుపానుగా బలపడే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

సారాంశం

  • అక్వాన్ తుపాను అతి తీవ్ర తుపాన్‌గా మారి ఆంధ్రప్రశ్‌లో తీరం దాటనుందని వాతావరణశాఖ తెలిపింది.
  • దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వాతావరణశాఖ తెలిపింది.

లైవ్ కవరేజీ

  1. బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా అక్వాన్

    తుపాను, వర్షాలు, గాలులు
    ఫొటో క్యాప్షన్, వాతావరణ శాఖ

    దక్షిణ, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుపాను గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వాతావరణశాఖ తెలిపింది.

    ప్రస్తుతానికి ఈ తుపాను చెన్నైకి 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 620 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో ఉందని వాతావరణ శాఖ వివరించింది.

    తుపాను నెమ్మదిగా ఉత్తర వాయువ్యదిశగా కదులుతూ మరింత బలపడే అవకాశముందని ఈ తెల్లవారుజామున పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిందని తెలిపింది. ఉత్తర వాయువ్యదిశగానే కదులుతూ రేపు సాయంత్రం(నవంబర్ 19)5.30 గంటల సమయానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశముందని తెలిపింది.

    నవంబర్ 20న మధ్యాహ్నం సమయంలో నెల్లూరు, విశాఖపట్టణం మధ్య తీరాన్ని దాటే అవకాశముందని ఆ సమయంలో గంటకు 120 నుంచి 130కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని, గాలుల తీవ్రత 145కిలోమీటర్ల వరకు పెరగొచ్చని అంచనావేసింది.

    తుపాను ప్రబావంతో రేపు, ఎల్లుండి(నవంబర్ 19,20) కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

    నవంబర్ 20,21 తేదీల్లో తెలంగాణలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

  2. గుడ్ మార్నింగ్

    బీబీసీ తెలుగు లైవ్ పేజ్‌కు స్వాగతం

    నేను బీబీసీ ప్రతినిధి కమలాదేవి నల్లపనేని.

    ఇప్పటి నుంచి మధ్యాహ్నం 3.00గంటలవరకు ముఖ్యమైన వార్తలను అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.