ఫుడ్‌పై చీమలతో గార్నిషింగ్.. రెస్టారెంట్‌కు భారీ జరిమానా

ఫొటో సోర్స్, Korean Ministry of Food and Drug Safety
- రచయిత, మలు కర్సినో
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఒక డెజర్ట్ గార్నిష్‌గా (అలంకరణగా) చీమలను ఉపయోగించినందుకు గాను సియోల్‌లోని ఓ రెస్టారెంట్‌కు భారీ జరిమానా పడింది.
దక్షిణ కొరియా రాజధానిలోని 'ఎవెట్ రెస్టారెంట్' యజమానికి 15 మిలియన్ల వోన్లు (భారత కరెన్సీలో 'సుమారు రూ.10,49,290) జరిమానా విధించగా, ఫుడ్ శానిటేషన్ యాక్ట్‌ను ఉల్లంఘించినందుకు ఆ రెస్టారెంట్‌ను నడుపుతున్న కంపెనీకి 10 మిలియన్ల వోన్ల (సుమారు రూ.6,92,737) జరిమానా విధించినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.
దక్షిణ కొరియాలో ఆహారంగా వినియోగించడానికి ఆమోదించిన 10 కీటకాల జాబితాలో చీమలు లేవు.
ఆమోదించిన జాబితాలో మిడతలు, కొన్ని రకాల పట్టుపురుగులు మాత్రమే ఉన్నాయి.
రెస్టారెంట్ యజమానికి ఒక ఏడాది జైలు శిక్షతో పాటు 20 మిలియన్ వోన్ల జరిమానా విధించాలని ప్రాసిక్యూటర్లు కోరారు. కానీ, యజమాని తప్పును అంగీకరించడం, అంతకుముందు ఎలాంటి నేర చరిత్ర లేకపోవడాన్ని జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు.
అయితే, ఆహార ప్రమాణాలను ఉల్లంఘించడమే కాకుండా.. చీమలను పరీక్షించినప్పుడు వాటిలో ప్రమాణాలకు మించిన హెవీ మెటల్స్ ఉన్నట్లు గుర్తించారని, దీనివల్ల ''నేర తీవ్రత తక్కువగా ఏమీ లేదు'' అని న్యాయమూర్తి వ్యాఖ్యానించినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

ఇతర దేశాలలో ఆహారంలో చీమలను ఉపయోగిస్తున్నందున.. దక్షిణ కొరియాలో ఆహారంలో చీమలను అందించడం నిషేధించినట్లు యజమానికి తెలియదని చెబుతున్నారు.
ఎవెట్ రెస్టారెంట్‌లో సోర్బెట్(ఫుడ్)లపైన వీటిని టాపింగ్‌గా వాడుతున్న విషయం ఆన్‌లైన్ రివ్యూలతో పాటు ఉన్న ఫోటోలను అక్కడి 'ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ మినిస్ట్రీ' గుర్తించి, పరిశీలించిన తర్వాత వెలుగులోకి వచ్చింది.
కొన్ని వంటకాలకు "పుల్లని రుచిని" ఇవ్వడానికి యజమాని వాటిపై మూడు నుంచి ఐదు చీమలను చల్లినట్లు ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ మినిస్ట్రీ తెలిపింది.
దాదాపు నాలుగేళ్ల కాలంలో.. అలంకరణ కోసం (గార్నిష్‌గా) ఉపయోగించిన మొత్తం చీమలు దాదాపు 49 వేల వరకు ఉంటాయని అంచనా.
ఈ చీమల్లో చాలా వరకు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారని, మరికొన్ని థాయిలాండ్ నుంచి తీసుకొచ్చారని 'ఫుడ్ అండ్ డ్రగ్ సేఫ్టీ మినిస్ట్రీ' తెలిపింది.
ఈ రెస్టారెంట్ 15 కోర్సు మెనూలో ఇవి చిన్న భాగం మాత్రమేనని, చీమలు లేని ప్రత్యామ్నాయ టాపింగ్‌లను ఎంచుకునే స్వేచ్ఛ ఇక్కడ భోజనం చేసే వారికి ఉందని రెస్టారెంట్ యజమాని వాదించారు.
అనేక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికన్ సంస్కృతిలో చీమలను తింటారు. కొన్నిసార్లు వాటిని అత్యంత రుచికరమైన వంటకంగా కూడా భావిస్తారు.
థాయ్, కంబోడియన్ వంటకాల్లో వీవర్ చీమలు, వాటి గుడ్లను ఉపయోగిస్తారు. అలాగే కొలంబియాలో రాణి చీమలను కేవియర్ అంత విలువైనవిగా భావిస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























