మ్యాన్‌హోల్స్‌లోకి దిగుతూ, బయటకు వస్తూ కెమెరాలకు చిక్కిన గుర్తు తెలియని వ్యక్తులు, ఆరా తీస్తున్న పోలీసులు...

అమెరికా, న్యూయార్క్, మురుగునీరు, డ్రైనేజ్
    • రచయిత, క్వాసీ అసియేదు
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 2 నిమిషాలు

న్యూయార్క్ నగరపు డ్రైనేజ్‌ పైపులలో నుంచి కొందరు బయటకు వస్తున్నట్లు, కొందరు అందులోకి దిగుతున్నట్లు కనిపిస్తున్న వీడియోలు ఇటీవల బయటకు వచ్చాయి.

బ్రూక్లిన్, క్వీన్స్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లోని నిఘా కెమెరాల్లో ఇవి రికార్డయ్యాయి. దీంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.

అండర్‌గ్రౌండ్‌లో విలువైన వస్తువుల కోసం వాళ్లు వెతుకుతున్నారని పోలీసు వర్గాలను ఉటంకిస్తూ అమెరికా మీడియా తెలిపింది.

ఈ వీడియోల్లో కనిపించే వ్యక్తులందరూ ఒకే గ్రూపుకు చెందినవారా లేక వేర్వేరు గ్రూపులవారా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు.

ఓ వీడియోలో కొందరు మ్యాన్‌హోల్ మూత తీసి డ్రైనేజ్‌లోకి దిగడం, కొన్ని గంటల తర్వాత తిరిగి బయటకు రావడం కనిపించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అమెరికా, న్యూయార్క్, మురుగునీరు, డ్రైనేజ్

ఫొటో సోర్స్, Getty Images

‘ప్రాణాలకు తెగించి’

డ్రైనేజీలోకి దిగడం చట్టవిరుద్ధమని, చాలా ప్రమాదకరమని న్యూయార్క్ పర్యావరణ పరిరక్షణ శాఖ ప్రతినిధి బీబీసీతో చెప్పారు.

'' కాల్వల్లో విషపూరితమైన, ప్రాణాంతక వాయువులు, ఎగుడుదిగుళ్లుగా ఉండే ఉపరితలాలు, వరదలముప్పు, ఇరుకుగా ఉండటం సహా అనేక ప్రమాదాలుంటాయి. మురుగునీరు పారే పైపులు, డ్రైయినేజ్‌లు, మ్యాన్‌హోల్స్‌, నీటిసేకరణ గుంతలు, మురుగునీరు బయటకు పోయేప్రదేశాల్లోకి ఎప్పుడూ వెళ్లకూడదు'' అని ఆయన తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తులు అనేకమంది గతవారం మ్యాన్‌హోల్ మూతలను తొలగించి వాటి లోపలికి ప్రవేశించినట్టు పోలీసులకు సమాచారం అందింది.

''తర్వాత ఆ వ్యక్తులు గుర్తుతెలియని వాహనంలో అక్కడినుంచి పారిపోయారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు ఎలాంటి సమాచారం లేదు. ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. దర్యాప్తు కొనసాగుతోంది'' అని అని న్యూయార్క్ పోలీసు డిపార్ట్‌మెంట్ బీబీసీకి తెలిపింది.

''మురుగునీటికాల్వ మ్యాన్‌హోల్ నుంచి బయటకు వస్తూ వీడియోల్లో కనిపించిన వ్యక్తులు ట్రెజర్ హంటర్లని, అండర్‌గ్రౌండ్‌లో విలువైన వస్తువుల కోసం వెతుకుతున్నారని భావిస్తున్నట్టు పోలీసు వర్గాలు బీబీసీ అమెరికా భాగస్వామి సీబీఎస్ న్యూస్‌తో చెప్పాయి.

ఆ వ్యక్తులు పట్టుబడితే దొంగతనం లేదా అక్రమ ప్రవేశానికి సంబంధించి క్రిమినల్ కేసులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)