అనుమతి లేకుండా మైనింగ్ చేసిన కంపెనీ నుంచి ఆస్ట్రేలియా ఆదివాసీలకు రూ.800 కోట్ల పరిహారం

మైనింగ్ కంపెనీ, ఆస్ట్రేలియా, ఆదివాసీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫోర్టెస్క్యూ వ్యవస్థాపకుడు ఆండ్రూ ఫొర్రెస్ట్
    • రచయిత, గేవిన్ బట్లర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 3 నిమిషాలు

వాయువ్య ఆస్ట్రేలియాలో భూయజమానులైన ఆదివాసీలకు 150.1 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల (సుమారు 830 కోట్లరూపాయల) భారీ పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. వీరి భూమిలో ఓ ప్రసిద్ధ సంపన్న వ్యాపారి అనుమతి లేకుండా మైనింగ్ జరిపినందుకు కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

ఆస్ట్రేలియాలో భూ హక్కులకు సంబంధించి మూలవాసులకు ఇంతపెద్దమొత్తంలో పరిహారం ప్రకటించడంతోపాటు దీర్ఘకాలంగా ఇంద్‌జిబరాండీ ప్రజలకు, ఆండ్రూ ఫారెస్ట్ మైనింగ్ కంపెనీ ఫోర్టెస్క్యూ సాగుతున్న న్యాయపోరాటం కూడా ముగిసింది.

వాయువ్య ఆస్ట్రేలియాలోని మారుమూల ప్రాంతాలలో 2013 నుంచి ఫోర్ట్స్‌స్య్కూ ఐరన్‌ఓర్ ఖనిజాన్ని వెలికితీయడం ద్వారా దశాబ్దాలపాటు డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.

దీనిపై ఇంద్‌జిబరాండీ తెగ 1.8 బిలియన్ల ఆస్ట్రేలియా డాలర్లను పరిహారంగా కోరింది.

తాము అడిగిన మొత్తం ఉత్పత్తి లాభంలో ఒక శాతమని, దీంతోపాటు 250 సాంస్కృతిక స్థలాలతోపాటు, సాంస్కృతిక అనుబంధాన్ని కోల్పోయినందుకు పరిహారం ఇవ్వాలని కోరారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

‘స్థానికుల జీవితంపై ప్రభావం చూపింది’

ఇంద్‌జిబరాండి ప్రజలకు తమ భూమితో "లోతైన, భావోద్వేగపూరిత అనుబంధం" ఉందని, అది వారి జీవితంలోని ప్రతి అంశంపై ప్రభావం చూపుతుందని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి స్టీఫెన్ బర్లీ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఫోర్టెస్క్యూ కంపెనీ కారణంగా 1.5 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్ల ఆర్థిక నష్టం, 150 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల సాంస్కృతిక నష్టం జరిగిందని ఆయన మంగళవారం తీర్పు ఇచ్చారు.

భూమితో సంప్రదాయ అనుబంధం తగ్గిపోవడం, తమ నేలతో ఉన్న బంధం దెబ్బతిన్నందుకే ఈ పరిహారం అని బర్లీ వ్యాఖ్యానించారు.

మైనింగ్ కంపెనీ, ఆస్ట్రేలియా, ఆదివాసీలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫోర్టెస్క్యూ కంపెనీ 2013నుంచి మైనింగ్ చేస్తోంది.

పరిహారంపై ఆదివాసీ పెద్దల అసంతృప్తి

ఖనిజ సంపద సమృద్ధిగా ఉన్న పిల్బారా ప్రాంతంలోని 2,700 చదరపు కిలోమీటర్ల భూభాగంపై ఇంద్‌జిబరాండి నగురా అబారిజినల్ కార్పొరేషన్‌ (వైఎన్ఏసీ)కు ప్రత్యేక భూ హక్కులను కోర్టు 2017లో గుర్తించింది. అనంతరం అదే ఏడాది ఫోర్టెస్క్యూపై ఈ కేసు దాఖలైంది.

అయితే అప్పటికే ఫోర్టెస్క్యూ సంస్థ ప్రభుత్వం, స్థానిక ఆదివాసీ ప్రతినిధి సంఘం అనుమతులతో అక్కడ లాభదాయకమైన సోలమన్ హబ్ గనులను అభివృద్ధి చేసింది. కానీ వైఎన్‌ఏసీ నుంచి మాత్రం అనుమతి పొందలేదు.

వైఎన్‌ఏసీ ఫోర్టెస్క్యూ మధ్య భూవినియోగ ఒప్పందం కుదరకపోవడంతో దాదాపు 20 సంవత్సరాలపాటు న్యాయపోరాటం కొనసాగి మంగళవారం ముగిసింది.

ఆస్ట్రేలియాలో మూలవాసుల భూ హక్కుల కేసుల్లో కోర్టు ఆదేశించిన పరిహారాల్లో రెండో అతిపెద్ద పరిహారంతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ. అయినప్పటికీ కొందరు ఆదివాసీ పెద్దలు ఈ మొత్తంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

మంగళవారం కోర్టు వెలుపల మాట్లాడిన ఇంద్‌జిబరాండీ పెద్ద వెండీ హ్యూబర్ట్‌, ఫోర్టెస్క్యూ సంస్థ ఎన్నో ఏళ్లుగా సంపాదించిన అపార ఆదాయంతో పోలిస్తే ఈ పరిహారం "చాలా తక్కువ" అని వ్యాఖ్యానించినట్లు ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ తెలిపింది.

ఈ గనులు 2040ల మధ్యకాలంలో మూసివేయనున్నప్పటికీ, అప్పటివరకు కనీసం మరో దశాబ్దంపాటు ఫోర్టెస్క్యూ సంస్థకు భారీ ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.