కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి అనుమతించిన కోర్టు

దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను మార్చి 28వ తేదీ వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది.

లైవ్ కవరేజీ

  1. మూత్రనాళ ఇన్ఫెక్షన్‌: గర్భిణులు తీసుకోవాల్సిన 8 జాగ్రత్తలు

  2. ‘ఐ డోంట్‌ కేర్‌.. గెలిస్తే గెలుస్తా, లేదంటే ఓడిపోతా.. ఫైట్ అయితే తప్పదు’.. ఏబీ వెంకటేశ్వరరావు బీబీసీ ఇంటర్వ్యూలో ఇంకా ఏమేం చెప్పారు?

  3. Ind vs Nz: భారత్ టార్గెట్ 226, పది ఓవర్లకు 119/3

    హాగ్లీ ఓవల్
    ఫొటో క్యాప్షన్, 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది.

    క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. పది ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది.

    భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు జట్టుకు శుభారంభాన్ని ఇచ్చారు. మొదటి ఐదు ఓవర్లలో 16 రన్ రేట్‌తో పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సంజూ శామ్సన్ 33 బంతుల్లో 67 పరుగులు, అభిషేక్ శర్మ 12 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యారు. తిలక్ వర్మ 6 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. క్రీజులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ ఉన్నారు.

    ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. న్యూజీలాండ్ ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్ దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టుకు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అలెన్ 24 బంతుల్లో 45 పరుగులు చేయగా, సీఫర్ట్ 24 పరుగులు సాధించాడు. డారిల్ మిచెల్ 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు.

    నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్ ఫిలిప్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఫిలిప్స్, నాలుగో వికెట్‌కు బెవన్ జాకబ్స్‌తో కలిసి 32 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఫిలిప్స్ 40 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లతో 82 పరుగులు చేశాడు.

    జాకబ్స్ 16 బంతుల్లో మూడు సిక్సర్ల సాయంతో 31 పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది.

    భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.

    ఈ మ్యాచ్‌తో పేసర్ భువనేశ్వర్ కుమార్ 2022 తర్వాత తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.

  4. దసరా పండుగను అక్కడ 76 రోజుల పాటు జరుపుకుంటారు, కానీ రావణ దహనం మాత్రం ఉండదు

  5. స్థానిక సంస్థల ఎన్నికలు: తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

  6. ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలు: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
    ఫొటో క్యాప్షన్, అనిల్ చంద్ర పునేఠా

    సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 19 ప్రాంతాల్లోనే ఆపాలని భావించినా, ఇప్పుడు మొత్తం 100 స్థానాల్లో ఆపేస్తున్నట్లు పేర్కొంది.

    అభ్యర్థుల జాబితా ప్రకటన ఈ నెల 25 వరకు వాయిదా వేయడంపై ఇవాళ నిర్ణయించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీల నివేదికల ఆధారంగా తుది నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

    రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో నామినేషన్లు వేసే అవకాశం తమ పార్టీ అభ్యర్థులకు కల్పించలేదని సుప్రీంకోర్టులో వైసీపీ పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దని ఆదేశించింది. గురువారం ఒక నిర్ణయం ప్రకటించాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

    సుప్రీంకోర్టు ఆదేశాలపై బుధవారం న్యాయనిపుణులతో చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా నోటిఫికేషన్ వచ్చిన 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.

  7. 82 ఏళ్ల కిందట గల్లంతైన జర్మన్ జలాంతర్గామి ఇప్పుడు కనిపించింది

  8. ఏపీ మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల గడువుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  9. ‘ఫోటో ఆధారంగా అనారోగ్యాన్ని, ఎంత కాలం జీవించే అవకాశముందో చెప్పేసే ఏఐ టూల్’

  10. నకిలీ పోస్టల్ స్టాంపులతో అమెరికాకు రూ.100 కోట్ల నష్టం కలిగించిన పాక్ పౌరుడి అరెస్ట్

    అమెరికా, పాకిస్తాన్,
    ఫొటో క్యాప్షన్, నకిలీ పోస్టేజ్ స్టాంపులతో అమెరికాకు వంద కోట్లకుపైగా నష్టం కలిగించిన పాకిస్తానీ అరెస్టు

    నకిలీ పోస్టల్ స్టాంపులను విక్రయించే వ్యాపారాన్ని నడుపుతున్నాడనే ఆరోపణలపై పాకిస్తాన్ సైబర్ క్రైమ్ ఏజెన్సీ ఒక వ్యక్తిని అరెస్టు చేసింది.

    ఈయన చేసిన మోసం కారణంగానే యూఎస్ పోస్టల్ సర్వీస్‌కు 126 మిలియన్ (119 కోట్ల రూపాయలు) డాలర్ల నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి.

    నిందితుడిని 33 ఏళ్ల ఫహీమ్ అక్రమ్‌గా గుర్తించారు. ఈయన ఒక నకిలీ వెబ్‌సైట్ ద్వారా యూఎస్ వినియోగదారులకు నకిలీ పోస్టల్ స్టాంపులు, షిప్పింగ్ లేబుల్‌లను విక్రయించినట్లు అభియోగాలు ఉన్నాయి.

    యూఎస్ ప్రాసిక్యూటర్ల ప్రకారం, ఫహీమ్ అక్రమ్ 2023 నుంచి లేబుల్స్‌బ్యాంక్‌ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. ఈ వెబ్‌సైట్ ద్వారా నకిలీ యూఎస్ పోస్టల్ స్టాంపులు, షిప్పింగ్ లేబుళ్లను విక్రయించారనే ఆరోపణలతో అధికారులు ఆ వెబ్‌సైట్‌ను మూసివేశారు.

    ఫ్లోరిడాలోని ఒక ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ గత నెలలో అక్రమ్‌పై అభియోగాలు మోపింది. ఆయన గత కొన్నేళ్లుగా వేల మంది అమెరికన్ వినియోగదారులకు 5 మిలియన్లకు పైగా నకిలీ షిప్పింగ్ లేబుళ్లను విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    ఈ నెల ప్రారంభంలో, యూఎస్ పోస్టల్ సర్వీస్ ఆయనను పట్టుకోవడానికి తగిన సమాచారం ఇచ్చినవారికి 100,000 డాలర్ల వరకు బహుమతిని ప్రకటించింది.

  11. రోటీ, రైస్ తింటూ బరువు తగ్గొచ్చా? 9 ప్రశ్నలు - జవాబులు

  12. ఆత్మగౌరవ భావన ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది – ప్రధాని మోదీ

    ప్రధాని మోదీ, దసరా, సంస్కృతి
    ఫొటో క్యాప్షన్, దిల్లీలో రావణ దహనం కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

    దిల్లీ ఐపీ ఎక్స్‌టెన్షన్‌లోని డీడీఏ గ్రౌండ్‌లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

    ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశ ప్రజల్లో ఆత్మగౌరవ భావన ఉండాలని ప్రధాని మోదీ అన్నారు.

    ఆత్మగౌరవాన్ని పెంపొందించడంలో దేశ వారసత్వ సంపద కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.

    వారసత్వాన్ని, గుర్తింపును పరిరక్షించుకోవడానికి భారత్ ప్రస్తుతం అంకితభావంతో పనిచేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు.

    "శతాబ్దాలుగా మన వారసత్వ సంపదను దోచుకుని విదేశాలకు తరలించారు. కానీ ఇప్పుడు వాటిని తిరిగి మనదేశానికి తీసుకొస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

    12 ఏళ్లలో 650కి పైగా పురాతన విగ్రహాలను భారత్‌కు తిరిగి తీసుకొచ్చినట్టు ప్రధాని తెలిపారు.

    "భారత్‌లోని సాంస్కృతిక కేంద్రాలకు ప్రపంచవ్యాప్తంగా కొత్త గుర్తింపు తీసుకొస్తున్నాం. గత కొన్నేళ్లలో దేశంలోని అనేక ప్రదేశాలకు యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు లభించింది’’ అని ఆయన అన్నారు.

    గతేడాది దీపావళికి కూడా యునెస్కో మానవాళి అమూర్త సాంస్కృతిక వారసత్వ జాబితాలో చోటు లభించిందని చెప్పారు.

    "ఇది కోట్లాది మంది భారతీయుల సమష్టి సంకల్పానికి ఫలితం" అని మోదీ అభివర్ణించారు. ఇదే నిబద్ధతతో దేశం భవిష్యత్తులోనూ ముందుకు సాగాలని అన్నారు.

    ‘‘ఇది విజయానికి ప్రతీక అయిన పండుగ. గెలుపును వేడుకగా జరుపుకునే సందర్భం’’ అని మోదీ పేర్కొన్నారు.

    శత్రువు ఎంత శక్తిమంతుడైనా సరే.. మనం సత్యం,మానవత్వంవైపు నిలబడితే చివరికి విజయం సాధిస్తామనే ధైర్యాన్ని ఈ పండుగ ఇస్తుందని అన్నారు.

    విజయదశమి అందించే ఈ సందేశం ఎప్పటినుంచో భారత మౌలిక భావనల్లో అంతర్భాగంగా ఉందని ప్రధాని మోదీ చెప్పారు.

  13. గరివిడి లక్ష్మి: ‘మూణ్నాలుగు జిల్లాలకు తెలిసిన నన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు’

  14. పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ

  15. కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?

  16. హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

  17. ఉచిత ప్రచారానికి ధన్యవాదాలు: అభిజిత్ దీప్కే

    కాక్రోచ్ జనతాపార్టీ, దసరా, రావణ దహనం
    ఫొటో క్యాప్షన్, పీతాంపురలో రావణుడు, కుంభకర్ణుడుతో పాటు కాక్రోచ్ దిష్టిబొమ్మ

    రావణునితో పాటు కాక్రోచ్ దిష్టిబొమ్మను దహనం చేస్తామనడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకులు అభిజిత్ దీప్కే స్పందించారు.

    దిల్లీ పీతంపురాలోని నేతాజీ సుభాష్ ప్యాలెస్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన కాక్రోచ్ దిష్టిబొమ్మ ఫోటోను అభిజిత్ దీప్కే ‘ఎక్స్’లో షేర్ చేశారు. "ఉచిత ప్రచారానికి ధన్యవాదాలు" అని రాశారు.

    రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుని దిష్టిబొమ్మలతో పాటు30 అడుగుల ఎత్తైన కాక్రోచ్ దిష్టిబొమ్మను కూడా శ్రీ కృష్ణ రామలీలా కమిటీ దహనం చేయబోతోంది.

    "ఈ దేశంలో ఏదైనా సరే... నాటకాలు ఆడించండి చాలు" అని అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు.

    "దసరా సందర్భంగా కాక్రోచ్ దిష్టిబొమ్మను దహనం చేయడం చూస్తుంటే అధికారంలో ఉన్న పార్టీ ఎంత భయపడుతోందో అర్ధమవుతోంది. మీరు మాకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నందుకు సంతోషంగా ఉంది. మమ్మల్ని మీకు పోటీగా చూస్తున్నారంటే మేం మీపై ఇంత ప్రభావం చూపిస్తున్నామని తెలుసుకోవడం బాగుంది’’ అని దీప్కే తరఫున స్పందించిన రత్నాసింగ్ అన్నారు.

    తాము సరైనదారిలోనే వెళ్తున్నామని దీనివల్ల అర్ధమవుతోందన్నారు.

  18. ఫ్రాన్స్‌లోని పరిస్థితికి వలసదారులే కారణమని ట్రంప్ ఆరోపణ

    ఫ్రాన్స్, డోనల్డ్ ట్రంప్, అమెరికా, పారిస్, యూరప్,
    ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లోని పరిస్థితికి వలసదారులే కారణమని ట్రంప్ ఆరోపించారు

    ఫ్రాన్స్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలకు వలసదారులు, జిహాదీలు, కమ్యూనిస్టులే కారణమని ట్రంప్ ఆరోపించారు.

    కాన్సాస్‌లోని విచిటాలో జరిగిన ఒక ప్రచార సభలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న ఘర్షణల గురించి ప్రస్తావించారు. రాబోయే మధ్యంతర ఎన్నికల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అమెరికాలో అలాంటి పరిస్థితులు రాకుండా నివారించాలని మద్దతుదారులకు సూచించారు.

    ఐరోపా వామపక్ష నాయకులు "పాశ్చాత్య విలువలను దెబ్బతీసే" వలస విధానాలను అనుసరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఐరోపాలో జరిగిన తప్పులు జరగొద్దని అన్నారు.

    "పశ్చిమ దేశాలతో ఏమాత్రం సంబంధం లేని మూడో ప్రపంచ దేశాల వలసదారులను ప్రపంచ వామపక్షం ఐరోపాకు తీసుకువస్తోంది. వారు ఫ్రాన్స్‌లోని ప్రతి విషయాన్నీ ద్వేషిస్తారు. వారు ఆ దేశాన్ని నాశనం చేస్తున్నారు. మన దేశానికి అలా జరగనివ్వం," అని ట్రంప్ అన్నారు.

    విలేకరులతో మాట్లాడుతూ, దేశ సరిహద్దులను మూసివేయడం గురించి తాను ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఇప్పటికే హెచ్చరించినట్లు ట్రంప్ చెప్పారు.

    "ఫ్రాన్స్‌లో జరుగుతున్నది పాఠశాలల వల్లనో లేదా మరే ఇతర కారణం వల్లనో కాదు. అది వలసల వల్లే," అని ట్రంప్ అన్నారు.

  19. ‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్