అక్రమాస్తుల కేసులో జగన్‌కు, సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు
ఈ కేసులో విచారణలో ఆలస్యానికి కారణాలను తెలియజేస్తూ, విచారణ మరో రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయకూడదో తమ వాదన తెలపాలంటూ సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
లైవ్ కవరేజీ
ఐసీసీ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్: టాప్ బ్యాటర్‌గా అభిషేక్ శర్మ
ఫొటో సోర్స్, Hagen Hopkins/Getty Images
భారత ఓపెనర్ అభిషేక్
శర్మ ఐసీసీ టీ20 ఫార్మాట్లో ప్రపంచ
నంబర్ వన్ బ్యాటర్‌గా నిలిచాడు.
తాజాగా విడుదల చేసిన
ఐసీసీ టీ20 అంతర్జాతీయ బ్యాటర్ల
ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ ఒక స్థానం ఎగబాకి అగ్రస్థానానికి చేరుకున్నాడు. గత కొన్ని
వారాలుగా అగ్రస్థానంలో కొనసాగిన ఇషాన్ కిషన్ రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి
చేరాడు.
ఈ ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ బ్యాటర్ సాహిబ్ జాదా ఫర్హాన్ రెండో స్థానంలో ఉన్నాడు.
న్యూజీలాండ్‌తో జరిగిన
మూడో టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో
అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఒక్కరోజు తర్వాత ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి
చేరుకోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో అతను కేవలం 38 బంతుల్లో 113 పరుగులు సాధించాడు.
కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II అవార్డు ప్రదానం
ఫొటో సోర్స్, PTI
ఫొటో క్యాప్షన్, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II అవార్డు ప్రదానం
కాక్‌పిట్‌లో జరిగిన దాడిని ధైర్యంగా ఎదిరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన ఇండియన్ కెప్టెన్ స్మిత్
మచ్చర్‌ను, ప్లైదుబై సిబ్బందిని యూఏఈ అధ్యక్షుడు సత్కరించారు.
దుబయ్-టెల్ అవీవ్ విమానం ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికులను రక్షించడానికి చూపిన
ధైర్యసాహసాలకు గుర్తింపుగా భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్, ఫ్లైదుబయ్
సిబ్బందికి ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II పురస్కారాన్ని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రదానం
చేశారు.
దుబయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధానమంత్రి,
రక్షణమంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ
పతకాలను అందజేశారని, సిబ్బందిని ప్రశంసించారని దుబయ్ మీడియా కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
అర్నబ్ తుపాను ధాటికి ఏపీలో అయిదుగురి మృతి, భారీ వర్షాలు కొనసాగుతాయని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
చెట్లను పెకిలించి, పొలాలను ముంచేసి.. గతంలో ఏపీని వణికించిన తుపానులు ఇవే..
జుల్ఫికర్ అలీ భుట్టో: ‘నేను భారత పౌరుడిని’ అంటూ బెనజీర్ భుట్టో తండ్రి భారతీయ కోర్టుల్లో ఎందుకు పోరాడారు?
అర్నబ్ తుపానుతో పంటలకు తీవ్ర నష్టం: అమిత్ షాకు సీఎం లేఖ
ఫొటో సోర్స్, PTI
ఫొటో క్యాప్షన్, అమిత్ షాకు చంద్రబాబు లేఖ
కేంద్ర
హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అర్నబ్
తుపాను తీవ్రతను గుర్తించి నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను త్వరగా పంపించాలని
విజ్ఞప్తి చేశారు.
తుపాను వేళ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను అమిత్ షాకు చంద్రబాబు వివరించారు.
ముందు
జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రాణ నష్టం లేకుండా చూశామని చంద్రబాబు తన లేఖలో
పేర్కొన్నారు.
ప్రస్తుతం
క్షేత్రస్థాయిలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర కేంద్ర సిబ్బంది సహాయం మరింత కాలం
అందించాలని విజ్ఞప్తి చేశారు.
స్టాక్ ఎక్స్ఛేంజ్లోకి జియో ఫ్లాట్‌ఫామ్స్.. ధర ఎంతంటే?
ఫొటో సోర్స్, PTI
ఫొటో క్యాప్షన్, ఇవాళ స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించిన జియో ప్లాట్‌ఫామ్
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో జియో
ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌కు చెందిన ఒక్కో షేరు రూ. 1,358 చొప్పున లిస్ట్ అయ్యింది.
ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్
నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ, 1977లో
రిలయన్స్ తొలి పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు తన తండ్రి ముఖేష్ అంబానీ ఎంతో శ్రమించారని తెలిపారు.రిలయన్స్‌ను
సామాన్య ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే నిర్ణయాన్ని మా తాత ధీరూభాయ్ అంబానీ
తీసుకున్నారు. ఆ సమయంలో కంపెనీ రూ. 10 కోట్ల వాల్యుయేషన్‌తో రూ. 2.82 కోట్లు
సమీకరించింది" అన్నారు.
జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ స్టాక్
మార్కెట్ లిస్టింగ్ కోసం జరిగిన గంట మోగించే కార్యక్రమానికి
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్
వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ, ఎన్ఎస్ఈ ఎండీ & సీఈఓ
ఆశిష్ చౌహాన్ హాజరయ్యారు.
నరసాపురం సమీపంలో తీరం దాటిన అర్నబ్ తుపాను
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, నరసాపురం సమీపంలో తీరం దాటిన అర్నబ్ తుపాను
రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య యానాంకు
నైరుతిగా, నర్సాపురం సమీపంలో తీరం దాటినట్టు కొద్దిసేపటి కిందట ఏపీ విపత్తుల నిర్వహణ
సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.
తీరం దాటిన తర్వాత ప్రస్తుతం ఈ
తుపాను బలహీనపడిందని తెలిపారు. అర్నబ్తీరం దాటినప్పటికి ప్రజలు
అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ
వర్షాలు పడతాయని ప్రఖర్ జైన్ తెలిపారు.
‘నర్సాపురం-యానాం మధ్య తీరాన్ని తాకిన అర్నబ్ తుపాను’
ఫొటో సోర్స్, BBC/Screenshot
ఫొటో క్యాప్షన్, అర్నబ్ తీవ్ర తుపాను తీరాన్ని తాకింది
ఈ
తీవ్ర తుపాను నర్సాపురం, యానాం మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకినట్టు మూర్తి ఏఎన్ఐకి
చెప్పారు.
అర్నబ్ తుపాను
పూర్తిగా తీరం దాటేందుకు మరో రెండు మూడు గంటల సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.
"ప్రస్తుతం ఈ తీవ్ర తుపాను నర్సాపురం, యానాం
మధ్య తీర ప్రాంతంలో ఉంది. ఇది గంటకు మూడు కిలోమీటర్ల అతి తక్కువ వేగంతో
కదులుతోంది. తుపాను కేంద్రం ఇప్పటికే తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం
దాటడానికి ఒకటి నుంచి రెండు గంటలు, లేదా రెండు నుంచి
మూడు గంటల సమయం పట్టవచ్చు. తీరం దాటిన తర్వాత, ఈ తుపాను
ఉత్తర-వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల
వేగంతో గాలులు వీస్తున్నాయి, ఇవి గంటకు 140 కిలోమీటర్ల వేగం వరకు కూడా ఉండవచ్చు. తీరం దాటిన తర్వాత
ఈ గాలుల తీవ్రత క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల తీవ్రత ఈ
సాయంత్రం వరకు కొనసాగుతుంది; సాయంత్రం నుంచి
వర్షాల తీవ్రత నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది, అదే సమయంలో
గాలుల వేగం కూడా క్రమంగా తగ్గుతుంది" అని తెలిపారు.
అర్నబ్ తుపాను తీవ్రతను చూపే 11 ఫోటోలు
’24 గంటల్లో విద్యుత్ పునరుద్ధరణ, తెలంగాణ సాయం కోరాం ’ బీబీసీతో ఏపీ విద్యుత్‌శాఖా మంత్రి గొట్టిపాటి
అర్నబ్ తుపాను ప్రభావం తగ్గిన 24 గంటల్లోనే అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ను
పునరుద్ధరిస్తామని ఏపీ విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ బీబీసీకి ఫోన్ ద్వారా తెలిపారు.
తుపాను
ప్రభావం ప్రస్తుతానికి ఏపీసీపీడీసీఎల్పై ఎక్కువ ప్రభావం చూపుతున్నందున తెలంగాణ
సాయం కోరినట్టు మంత్రి తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన సామాగ్రి, మానవ వనరులు
అందించాలని తెలంగాణ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్‌తో మాట్లాడామన్నారు. అవసరమైతే ఆ
శాఖ మంత్రితో కూడా చర్చిస్తామని గొట్టిపాటి పేర్కొన్నారు.
ఇలాంటి సమయంలో పొరుగుల
రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని ముందుకు సాగడం తమ విధానంలో భాగమని మంత్రి తెలిపారు. గతంలో
తమిళనాడు సహాయం తీసుకున్నామని, ఇప్పుడు తెలంగాణ హెల్ప్ కోరామని వివరించారు.
ముందు
జాగ్రత్తగా తుపాను ప్రభావిత ప్రాంతాలకు 15000లకుపైగా విద్యుత్ స్తంభాలు, ఇతర సామాగ్రిని
తరలించామని మంత్రి తెలిపారు. తుపాను ప్రభావం శ్రీకాకుళం జిల్లా మొదలు కొని, కృష్ణా
జిల్లా వరకు ఉంటుందన్నారు. ప్రస్తుతానికి వర్షాలు తగ్గకపోవడంతో పనులకు ఆటంకం
కలుగుతోందని చెప్పారు. అయినా సరే విశాఖలో విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని,
ఇప్పుడు అక్కడి సిబ్బందిని, సామాగ్రిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నామని అన్నారు.
దాదాపు నాలుగు
వందల వరకు ఫీడర్స్‌లో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్టు మంత్రి వెల్లడించారు.
కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ తీగలు తెగి సరఫరాకు
అంతరాయం ఏర్పడితే మరికొన్ని చోట్ల ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారులే సప్లై
నిలిపివేశారని పేర్కొన్నారు. వర్షాలు తగ్గుముఖ పట్టిన వెంటనే గంటల వ్యవధిలోనే
పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని, అంత వరకు ప్రజలు విద్యుత్ తీగలు పట్టుకోవడం, స్తంభాలను తాకడం చేయవద్దని సూచించారు.
‘మధ్యాహ్నానికి గాలుల వేగం తగ్గే అవకాశం’ : ఏపీ వాతావరణ శాఖ
ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరందాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు.
అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరం దాటుతుందని
ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు. ఏఎన్ఐతో మాట్లాడిన ఆమె తుపాను తీరం దాటే సమయంలో 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.
"ప్రస్తుతం ఈ
తుపాను తీవ్రతను గమనిస్తే, కోనసీమ, కాకినాడ
పరిసర ప్రాంతాలతోపాటు ఇతర తీరప్రాంత జిల్లాల్లో గాలి వేగం గంటకు 125 నుంచి 135
కిలోమీటర్ల వరకు ఉంది. ఇది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది.
ప్రస్తుతం తుపాను దాదాపు ఒకే చోట నిలిచి ఉంది.ఒకటి రెండు గంటల్లో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఈ
తుపాను తీరాన్ని దాటుతుందని అంచనా. ఆ తర్వాత దీని తీవ్రత తగ్గి, 'తీవ్ర తుపాను'గా మారుతుంది.మధ్యాహ్నానికి
ఇది మరింత బలహీనపడి కేవలం 'తుపాను'గా మారే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో ఇది 'అత్యంత తీవ్ర తుపాను' స్థితిలో ఉంటుంది. కొన్ని గంటల తర్వాత గాలి వేగం గంటకు 90 నుంచి 120
కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. మధ్యాహ్నానికి గాలి వేగం మరింత తగ్గి, గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లకు చేరుకుంటుందని
అంచనా" అని నాగరత్నం తెలిపారు.
అర్నబ్ తుపాను: ఇవాళ, రేపు, ఎల్లుండి పలు రైళ్లు రద్దు
ఫొటో సోర్స్, Facebook/SCR
ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే
అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను
రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే దీనికి సంబంధించిన తాజా వివరాలతో ఒక ప్రకటన
విడుదల చేసింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం ఇవాళ రేపు రద్దు అయిన రైళ్ల
వివరాలు ఇవే
ఇవాళ రద్దు అయిన రైళ్లు (28 అక్టోబర్)
12727 విశాఖపట్నం-
సికింద్రాబాద్
12739 విశాఖపట్నం- సికింద్రాబాద్
17206 కాకినాడ
పోర్టు- సాయినగర్ షిర్డీ
12737 కాకినాడ పోర్టు
– లింగంపల్లి
20707 సికింద్రాబాద్- విశాఖపట్నం
20708 విశాఖపట్నం- సికింద్రాబాద్
20833 విశాఖపట్నం- సికింద్రాబాద్
12787 నర్సాపురం-
నాగర్సోల్
17255 నర్సాపురం-
లింగంపల్లి
20834సికింద్రాబాద్- విశాఖపట్నం
రేపు రద్దు అయిన రైళ్లు(29 అక్టోబర్)
12703 హౌరా-
సికింద్రాబాద్ ట్రైన్
17015 భువనేశ్వర్ – సికింద్రాబాద్
22881 పుణె-
భువనేశ్వర్
17205 సాయినగర్ షిర్డీ-
కాకినాడ పోర్ట్
శుక్రవారం రద్దు అయిన రైళ్లు(30 అక్టోబర్)
20809 సంబల్పూర్-
హెచ్ఎస్ నాందేడ్
రీ షెడ్యూల్
అయిన రైళ్లు(బయల్దేరాల్సిన సమయానికి కంటే మూడు గంటలు ఆలస్యంగా నడుస్తాయి)
12805 విశాఖపట్నం-
లింగంపల్లి
17221 కాకినాడ పోర్టు
– ఎల్టీటీ ముంబై
12806 లింగంపల్లి-
విశాఖపట్నం
18046 చర్లపల్లి- షాలీమర్
18519 విశాఖపట్నం- ముంబై ఎల్టీటీ (నిన్న బయల్దేరాల్సిన రైలు ఇవాళ ఉదయం నాలుగు
గంటలకు రీ షెడ్యూల్ చేశారు)
అర్నబ్ విధ్వంసం: నేలకొరిగిన చెట్లు, కూలిన వేలాది విద్యుత్ స్తంభాలు
ఫొటో సోర్స్, @GVMC_VISAKHA
ఫొటో క్యాప్షన్, కూలిన విద్యుత్ స్తంభాలు, నేలకొరిగిన చెట్లు, రెండు రోజుల పాటు తుపాను ప్రభావం, సీఎంకి వివరించిన అధికారులు
అర్నబ్ తుపానుకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఆర్టీజీఎస్ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
మరో రెండు రోజుపాటు దీని ప్రభావం ఉంటుందని తెలిపారు.
ఇవాళ ఉదయం 6 గంటల తర్వాత తుపాను తీరం దాటుతోందని
వేకువజామున అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ప్రభావంతో ఇవాళ, రేపు భారీ వర్షాలు
నమోదయ్యే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు.
తుపాన్ ప్రభావంతో చాలా ప్రాంతాల్లో
చెట్లు నేలకొరిగాయని, కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ నిలిపేశామన్నారు.
పడిపోయిన చెట్లను వెంటనే తొలగించాలని...
తీవ్రత తగ్గాక విద్యుత్ పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
చెరువులు, కాల్వలు పొంగి
పొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. జిల్లాల వారీగా తాము
చేపడుతున్న సహయక చర్యలను కలెక్టర్లు వివరించారు.
కోనసీమ జిల్లాలో సుమారు 6వేల
విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
భారత్ విడిచి వెళ్లాలంటూ ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసుపై బాంబే హైకోర్టు తాజా స్పందనేంటి?
ఫొటో సోర్స్, Kunal Patil/Hindustan Times via Getty Images
ఫొటో క్యాప్షన్, నటుడు ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)
‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.
ఆ నోటీసులో ఇమ్రాన్ ఖాన్ అక్టోబర్ 28వ తేదీలోగా భారత్ విడిచి వెళ్లాలని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ),
తదుపరి విచారణ జరిగే వరకు ఇమ్రాన్ ఖాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టుకు మౌఖికంగా హామీ ఇచ్చారు.
తదుపరి విచారణ వరకు ఈ కేసులో తదుపరి చర్యలను కూడా కోర్టు నిలిపివేసింది.
ముంబైలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్ఆర్ఆర్ఓ) అక్టోబర్ 14న జారీ చేసిన ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందున ఈ నోటీసు జారీ చేసినట్లు ఎఫ్ఆర్ఆర్ఓ పేర్కొంది.
చీర కట్టుకుని చెప్పులు లేకుండా పరుగెత్తిన కవితా దేవి ‘హోంగార్డ్’ కల ఎందుకు నెరవేరలేదు?
అభిషేక్ శర్మ తుపాన్ బ్యాటింగ్, న్యూజీలాండ్‌పై 35 బంతుల్లోనే సెంచరీ.. 6 వికెట్లతో భారత్ గెలుపు
అర్నబ్ తుపాను ప్రభావంతో రద్దైన రైళ్లు ఇవే- దక్షిణమధ్య రైల్వే అధికారిక ప్రకటన
ఫొటో క్యాప్షన్, రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేసిన దక్షిణ మధ్యరైల్వే
పశ్చిమ- మద్య
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావం రవాణా రంగం తీవ్రంగా ఉంది. ఇప్పటికే
విమానాల సర్వీసులపై ఎఫెక్ట్ పడుతుందని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలని ఎయిర్
ఇండియా తన ప్రయాణికులకు సూచించింది.
ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే కూడా ఒక ప్రకటన చేసింది. తుపాను ప్రభావిత
ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగేంచే పలు రైళ్లను రద్దు చేసింది.
ఇవాళ రద్దు అయిన
రైళ్లు ఇవే
12704 సికింద్రబాద్-
హౌడా
17016 సికింద్రాబాద్- భువనేశ్వర్ న్యూ
12728 హైదరాబాద్-
విశాఖపట్నం
12862 మహబూబ్‌నగర్-
విశాఖపట్నం
12740 సికింద్రాబాద్-
విశాఖపట్నం
12776 లింగంపల్లి-
కాకినాడ టౌన్
17256 లింగంపల్లి-
నర్సాపూర్
12738 లింగంపల్లి-
కాకినాడ పోర్ట్
20810 హెఎస్ నాందేడ్- సంబల్పూర్
07037 చర్లపల్లి-
శ్రీకాకుళం రోడ్
రేపు(28/10/2026)
రద్దు అయిన రైళ్లు ఇవే
07038 శ్రీకాకుళం
రోడ్ – చర్లపల్లి
నాగర్సోల్-
నర్సాపూర్ మధ్య నడిచే 12788 ట్రైన్‌ను చర్లపల్లి
నర్సాపూర్ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు.