ఆసియా కప్ ఫైనల్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక

ఫైనల్‌ మ్యాచ్‌కూ వర్షం ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం అక్కడ వర్షం పడుతోంది, దీంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది.

లైవ్ కవరేజీ

  1. 'నా పుస్తకం వెలువడితే, అదొక సంచలనం అవుతుంది': సోనియా గాంధీ

    రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి కావడం నాకు ఇష్టం లేదు- సోనియా గాంధీ
    ఫొటో క్యాప్షన్, రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి కావడం నాకు ఇష్టం లేదు- సోనియా గాంధీ

    కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్, మాజీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, తన రాబోయే ఆత్మకథ 'బిలాంగింగ్ – ఎ జర్నీ ఆఫ్ లవ్' గురించి ఒక వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పంచుకున్నారు.

    రాజీవ్ గాంధీని దేశ ప్రధానిని చేస్తున్నప్పుడు తాను ఆ నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించానని, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కావడం తనకు అసలు ఇష్టం లేదని ఆ వీడియోలో ఆమె చెప్పారు.

    వచ్చే నెల నవంబర్ 10న విడుదల కానున్న తన పుస్తకం గురించి, తన జీవితంలోని పలు ముఖ్యమైన ఘట్టాల గురించి ఆమె ఈ వీడియోలో సూటిగా మాట్లాడారు.

    "ఈ పుస్తకం బయటకు వచ్చినప్పుడు, కచ్చితంగా కొంత నాటకీయత చోటుచేసుకుంటుంది" అని తను పోస్ట్ చేసిన వీడియోకు క్యాప్షన్ పెట్టారు సోనియా గాంధీ.

    "దశాబ్దాలుగా ఇతరులు నా కథ చెబుతూ వచ్చారు, ఇప్పుడు నావంతు వచ్చింది, నేను పూర్తి కథ చెప్పాలా వద్దా అన్నది నాకు తెలియదు, కానీ నా గురించి చాలా రాశారు, అందులో చాలా వరకు నిజం కాదని నాకు అనిపించింది" అని ఆమె పేర్కొన్నారు.

    "చాలా విషయాలు కల్పించారు లేదా అతిశయోక్తి జోడించారు. అందుకే నా సొంత కథను రాసి, వాస్తవాలను, జరిగిన సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ఇదే సరైన సమయం అని నేను అనుకుంటున్నా" అని ఆమె చెప్పారు.

  2. అర్నబ్: 24 నుంచి 48 గంటల్లో ఏపీలోని 13 జిల్లాల్లో ఫ్లాష్ ‌ఫ్లడ్ వచ్చే అవకాశం- వాతావరణ శాఖ హెచ్చరిక

  3. భారత్ విడిచి వెళ్లాలంటూ ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసుపై బాంబే హైకోర్టు తాజా స్పందనేంటి?

    ముంబైలోని ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) అక్టోబర్ 14న ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను ఇమ్రాన్ ఖాన్ జారీ చేసింది.
    ఫొటో క్యాప్షన్, నటుడు ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)

    ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.

    ఆ నోటీసులో ఇమ్రాన్ ఖాన్ అక్టోబర్ 28వ తేదీలోగా భారత్ విడిచి వెళ్లాలని పేర్కొన్నారు.

    కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ), తదుపరి విచారణ జరిగే వరకు ఇమ్రాన్ ఖాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టుకు మౌఖికంగా హామీ ఇచ్చారు.

    తదుపరి విచారణ వరకు ఈ కేసులో తదుపరి చర్యలను కూడా కోర్టు నిలిపివేసింది.

    ముంబైలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) అక్టోబర్ 14న జారీ చేసిన ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందున ఈ నోటీసు జారీ చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ పేర్కొంది.

  4. రిలయన్స్: స్టాక్‌ మార్కెట్‌‌పై భారతీయుల అభిప్రాయంపై ఈ కంపెనీ ఎలా ప్రభావం చూపింది? 1977లో ఏం జరిగింది?, స్టాక్ మార్కెట్

    ధీరూభాయ్ అంబానీ
    ఫొటో క్యాప్షన్, ధీరూభాయ్ అంబానీ

    రిలయన్స్ జియో ఐపీఓ చుట్టూ ప్రస్తుతం నెలకొన్న ఈ సందడితో, 49 ఏళ్ల క్రితం తొలిసారి రిలయన్స్ గ్రూప్ తన ఐపీఓను ప్రారంభించినప్పుడు.. అప్పుడు వాతావరణం ఎలా ఉంది, దాని ద్వారా పెట్టుబడిదారులు ఎంత లాభం పొందారో తెలుసుకోవడం ఆసక్తికరం.

    పూర్తి కథనం కోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి.

  5. అభిషేక్ శర్మ తుపాన్ బ్యాటింగ్, న్యూజీలాండ్‌పై 35 బంతుల్లోనే సెంచరీ.. 6 వికెట్లతో భారత్ గెలుపు

  6. రిలయన్స్: స్టాక్‌ మార్కెట్‌‌పై భారతీయుల అభిప్రాయంపై ఈ కంపెనీ ఎలా ప్రభావం చూపింది? 1977లో ఏం జరిగింది?

  7. అర్నబ్ తుపాను ప్రభావంతో రద్దైన రైళ్లు ఇవే- దక్షిణమధ్య రైల్వే అధికారిక ప్రకటన

    అర్నబ్, విశాఖ, దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్,
    ఫొటో క్యాప్షన్, రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేసిన దక్షిణ మధ్యరైల్వే

    అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతల గుండా రాకపోకలు సాగించే రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

    పశ్చిమ- మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావం రవాణా రంగం తీవ్రంగా ఉంది. ఇప్పటికే విమానాల సర్వీసులపై ఎఫెక్ట్ పడుతుందని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలని ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు సూచించింది.

    ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే కూడా ఒక ప్రకటన చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగేంచే పలు రైళ్లను రద్దు చేసింది.

    ఇవాళ రద్దు అయిన రైళ్లు ఇవే

    • 12704 సికింద్రబాద్- హౌడా
    • 17016 సికింద్రాబాద్- భువనేశ్వర్ న్యూ
    • 12728 హైదరాబాద్- విశాఖపట్నం
    • 12862 మహబూబ్‌నగర్- విశాఖపట్నం
    • 12740 సికింద్రాబాద్- విశాఖపట్నం
    • 12776 లింగంపల్లి- కాకినాడ టౌన్
    • 17256 లింగంపల్లి- నర్సాపూర్
    • 12738 లింగంపల్లి- కాకినాడ పోర్ట్
    • 20810 హెఎస్ నాందేడ్- సంబల్‌పూర్
    • 07037 చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్

    రేపు(28/10/2026) రద్దు అయిన రైళ్లు ఇవే

    • 07038 శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి
    • నాగర్‌సోల్- నర్సాపూర్ మధ్య నడిచే 12788 ట్రైన్‌ను చర్లపల్లి నర్సాపూర్ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు.
  8. ‘అర్నబ్’ తుపానుకు ఆ పేరు ఎలా వచ్చింది? అసలు తుపానులకు పేర్లు ఎలా పెడతారు?

  9. అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

    అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

    పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన ‘అర్నబ్’ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్టు ఆంధ్రప్రదేశ్రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఫోన్ నెంబర్లను విడుదల చేసింది.

    ఈ తుపాను ప్రభావంతో విశాఖ, శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటించారు.

    అర్నబ్ తుపాన్ వేళ ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నెంబర్లను విడుదల చేశారు.

    అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నంబర్లు 112 , 1070 , 1800 425 0101 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తుపాన్ స‌మ‌స్యలకు వేగవంతమైన పరిష్కారం పొందవచ్చని ప్రఖర్ జైన్ తెలిపారు.

    • శ్రీకాకుళం- 08942240557
    • విజయనగరం- 8922236947
    • పార్వతీపురం మన్యం- 08963450347
    • అల్లూరి సీతారామరాజు- 8935293448
    • విశాఖపట్నం- 0891-2590102 / 0891-2590100
    • అనకాపల్లి- 08924-222888 / 08924-226599 / 08924-225999
    • కాకినాడ-0884-2356801 / 9849903879
    • కోనసీమ-8856293104
    • తూర్పు గోదావరి-8832944455
    • పశ్చిమ గోదావరి-08816-299181
    • ఏలూరు-18002331077 / 9494041419
    • పోలవరం-18004254225
    • తిరుపతి-0877 2236007
    • మార్కాపురం-9248702500
    • కృష్ణా-08672 252399
    • ఎన్టీఆర్- 9154970454
    • గుంటూరు- 0863-2234014
    • బాపట్ల- 08643-220226
    • ప్రకాశం- 08592 295600 / 18004250277
    • నెల్లూరు- 7995576699
  10. రైళ్ల రద్దు, విద్యాసంస్థలకు సెలవులు, నిత్యావసరాలు రెడీ చేసుకుంటున్న ప్రజలు.. అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతోందంటే

  11. ‘జైలులో అనారోగ్యం నటించారు.. సిబ్బందిపై దాడి చేసి 17 మంది పారిపోయారు’

  12. ‘జ్ఞానేశ్ కుమార్ ఒక్కరే నిర్ణయాలు తీసుకోరు, ఫామ్-6లో ఎలాంటి మార్పులు చేయలేదు’.. సుప్రీంకోర్టుకు సమాధానం ఇచ్చిన ఎలక్షన్ కమిషన్

  13. ఎల్ నినో ‘అత్యంత తీవ్రరూపం’ దాల్చబోతోందా? ఇది ఎప్పటివరకు కొనసాగొచ్చు? ‘ఇన్‌కాయిస్’ ఏం చెప్పింది?

  14. ఆంధ్రప్రదేశ్ స్థానిక పోరులో ‘నామినేషన్ల’ రగడ: ప్రజాస్వామ్యమా లేక బలప్రదర్శనా?

  15. ఆంధ్రప్రదేశ్: అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు

    హుద్‌హుద్ తుపాను సమయంలో కూలిన చెట్లు(ఫైల్ ఫోటో)
    ఫొటో క్యాప్షన్, హుద్‌హుద్ తుపాను సమయంలో కూలిన చెట్లు(ఫైల్ ఫోటో)

    ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుపాను సహాయక చర్యల కోసం రాష్ట్ర ప్రభుత్వం 20 జిల్లాలకు రూ.27 కోట్ల నిధులు విడుదల చేసింది.

    బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు.

    శ్రీకాకుళం, మార్కాపురం, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, అల్లూరి, పోలవరం, మన్యం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీసత్యసాయి, నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తూ విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

  16. అర్నబ్: తుపాను ఎక్కడుంది? ఎప్పుడు తీరం దాటుతుంది, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి?

  17. ఇంజమామ్ ఉల్ హక్: సిక్స్ కొట్టాలని ఉందని సెహ్వాగ్ చెబితే, ఫీల్డర్లను ముందుకు తీసుకొచ్చిన పాకిస్తానీ కెప్టెన్

  18. సౌదీలో చిక్కుకున్న భారతీయ యాత్రికుల పరిస్థితి ఎలా ఉంది?

  19. పార్లమెంట్‌కు సమీపంలో నార్త్ బ్లాక్‌లో కమ్ముకున్న దట్టమైన పొగ– వెల్డింగ్ పనుల కారణంగా చెలరేగిన మంటలు

    నార్త్ బ్లాక్‌, దిల్లీ
    ఫొటో క్యాప్షన్, పార్లమెంట్‌కు సమీపంలో నార్త్ బ్లాక్‌లో కమ్ముకున్న దట్టమైన పొగ

    పార్లమెంట్‌కు సమీపంలో నార్త్‌బ్లాక్‌లో సోమవారం ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్ముకుంది.

    “పార్లమెంట్‌కు వెళ్తున్నప్పుడు, నార్త్‌బ్లాక్ వెనుకాల దట్టమైన పొగను గమనించాను. అక్కడ అగ్ని ప్రమాదం జరిగిం ఉండొచ్చని అనుమానం వచ్చింది. అంతా క్షేమంగా ఉంటారని భావిస్తున్నాను. అత్యవసర సిబ్బంది వేగంగా స్పందించాలని కోరుకుంటున్నాను” అని బీజేపీ ఎంపీ మిలింద్ డియోరా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

    “దిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలోని చిల్లర్ ప్లాంట్‌లో ఉపయోగించే ఫైబర్ ట్యాంక్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో నల్లటి పొగ భారీగా వ్యాపించింది. దీంతో సమీపంలోని ప్రజలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు” అని హిందూ పేర్కొంది.

    నార్త్‌బ్లాక్‌లో వెల్డింగ్ వర్క్ చేస్తుంటే చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. వెల్డింగ్ నుంచి వచ్చిన నిప్పు రవ్వలు సమీపంలోని ట్యాంక్‌కు వ్యాపించి మంటలు చెలరేగి పొగ వ్యాపించింది అని ఏఏఎన్ఎస్ పేర్కొంది.

    ఘటన జరిగిన వెంటనే మంటలను ఆర్పేశారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. ఎవరూ గాయపడినట్టు రిపోర్ట్ కాలేదు.

    సోమవారం 11 గంటలకు అగ్ని ప్రమాదం సమాచారం అందింది. సమాచారం వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి 6 ఆగ్నిమాపక యంత్రాలను పంపి మంటలను అదుపు చేసినట్టు దిల్లీ ఫైర్ డిపార్ట్‌మెంట్ చెప్పింది.

  20. రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

    పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రహదారి, రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

    ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై రాహుల్ గాంధీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన కాన్వాయ్‌లోని వాహనాలే ఒకదానికొకటి ఢీకొన్నాయి.

    అందరూ క్షేమంగా ఉన్నారని పవన్ ఖేరా చెప్పినట్టు బీసీసీ ప్రతినిధి ప్రేరణ తెలిపారు.

    చాలా స్వల్ప ప్రమాదమని, ఎవరికీ ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది.

    రాహుల్ గాంధీ లఖ్‌నవూ నుంచి సుల్తాన్‌పూర్ వెళ్తుండగా హాలియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగిందని ఐఏఎన్‌ఎస్ రిపోర్టు చేసింది.

    ప్రమాదంలో కారు బానెట్ ధ్వంసమైనట్టు వివరించింది.

    ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ రాహుల్ గాంధీ వెంటనే వేరే వాహనంలో సుల్తాన్‌పూర్ వెళ్లినట్టు తెలిపింది. ఎంపీ-ఎంఎల్‌ఏ కోర్టు ముందు హాజరయ్యేందుకు రాహుల్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.