ఆర్డర్ ఆఫ్ ది నైల్: మోదీకి ఈజిప్ట్ అత్యున్నత పురస్కారం
ప్రధాని నరేంద్రమోదీని 'ఆర్డర్ ఆఫ్ ది నైల్' గౌరవంతో ఈజిప్ట్ ప్రభుత్వం సత్కరించింది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే అల్-సిసి ఆదివారం మోదీకి ఈ గౌరవాన్ని అందించారు.
లైవ్ కవరేజీ
గరివిడి లక్ష్మి ఈవిడే.. ‘ఆమె పాటల క్యాసెట్ లేని ఇల్లు ఉండేది కాదు’
కామ్రేడ్ కళ్యాణ్: లవ్ స్టోరీకి నక్సలిజం టచ్ ఇచ్చి కామెడీ పండించేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందా?
ఎలాన్ మస్క్ విషయంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కాంగ్రెస్ వైఖరికి భిన్నంగా ఉన్నాయా?
బంగారు ఇటుకలు, లగ్జరీ కార్లు, ఖరీదైన వాచీలు: ఓ గూఢచారి ఘరానా మోసం..
ఇన్ఫోసిస్‌తో సహా ఈ టెక్ కంపెనీలపై తీసుకున్న చర్యలను సమర్థించిన జేడీ వాన్స్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి కంపెనీల తొలగింపు

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి కంపెనీల తొలగింపును సమర్థించిన జేడీ వాన్స్ గ్రీన్ కార్డ్, అమెరికా పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి ఎనిమిది టెక్ కంపెనీలను తొలగించడాన్ని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సమర్థించారు.
కంపెనీలకు చౌకైన విదేశీ కార్మికుల సరఫరాకు విమర్శకులు సహాయం చేయాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
ఈ నిర్ణయాన్ని డెమొక్రాటిక్ కాంగ్రెస్ సభ్యురాలు ప్రమీలా జయపాల్ ప్రశ్నించిన తర్వాత, వాన్స్ ' సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో విమర్శలు చేశారు. ‘సోషలిజం' అంటే పెద్ద కంపెనీలకు చౌకగా కార్మికుల సరఫరా ఎప్పటికీ ఆగకుండా ఉండేలా చూడటానికి సర్వశక్తులు ఒడ్డి పోరాడటమే అనిపిస్తోంది."
మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమిని అనే ఎనిమిది కంపెనీలను సస్పెండ్ చేయాలన్న నిర్ణయం చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదానికి ఈ ప్రకటన మరింత ఆజ్యం పోసింది.
స్మిత్ మచ్చర్‌కు అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు, స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం

ఫొటో సోర్స్, @IsraelMFA
ఫొటో క్యాప్షన్, భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్నారు (ఫైల్ ఫోటో) ఫ్లైదుబాయ్ విమానం కాక్‌పిట్‌లో కో-పైలట్ దాడి చేసినప్పటికీ, ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం ప్రదానం చేయనున్నారు.
భారత పైలట్ కోలుకున్న తర్వాత ఆయన ఇజ్రాయెల్ అత్యున్నత పురస్కారం అందజేస్తామని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ తెలిపారు.
"ఈ రోజు మనం గౌరవిస్తున్న ఇజ్రాయెల్ వీరులతోపాటు, భారత్‌కు చెందిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ కూడా త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. కెప్టెన్ మచ్చర్ అపారమైన ధైర్యం, అత్యుత్తమ వృత్తి నైపుణ్యం ఒక పెద్ద విపత్తును నివారించడంలో సహాయపడ్డాయి. ఆయన కోలుకున్న తర్వాత, ఇజ్రాయెల్ ప్రజల తరపున ఇచ్చే అత్యున్నత పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేయడం నాకు గౌరవంగా ఉంటుంది" అని ఆయన అన్నారు.
భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై ఒమన్‌కు చెందిన కో-పైలట్ దాడి చేయగా, ఆయన ధైర్యంగా ఎదుర్కొని 174 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను కాపాడారు.
ఎన్నికల సంఘానికి మద్దతుగా 42 మంది మాజీ న్యాయమూర్తులు లేఖలు, 42 మంది మాజీలు రాసిన లేఖలో ఏం ఉంది

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ఎన్నికల కమిషన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మాజీ న్యాయమూర్తుల ఆరోపణ 'ఎన్నికల కమిషన్‌ను అప్రతిష్టపాలు చేయడానికి' ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని మాజీ న్యాయమూర్తులు ఆరోపించారు.
'ఎన్నికల సంఘాన్ని బలహీనపరిచే ప్రయత్నాలకు' వ్యతిరేకంగా 42 మంది మాజీ న్యాయమూర్తులు ఒక బహిరంగ లేఖ రాశారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ లేఖలో, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, ఇతర రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై మాజీ న్యాయమూర్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పీటీఐ వార్తా సంస్థ ప్రకారం, ఆ లేఖపై సంతకం చేసిన మాజీ న్యాయమూర్తులు, ఎటువంటి నిర్దిష్ట ఆధారాలు లేకుండా 'ఓట్ల దొంగతనం' ఆరోపణలు చేయడాన్ని ప్రశ్నించారు.
రాజ్యాంగ సంస్థలను పదేపదే 'దొంగలు', 'కుట్రదారులు' అని ముద్ర వేయడం ప్రజాస్వామ్యంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
"సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు, కానీ వాటిని అపఖ్యాతి పాలు చేయడం కాదు" అని ఆ లేఖలో పేర్కొన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు చేపట్టిన నిరసన అక్టోబర్ 8న మూడో రోజుకు కొనసాగింది.
వీసా మోసాలు: ఇన్ఫోసిస్, టీసీఎస్ సహా పలు భారతీయ ఐటీ కంపెనీలపై అమెరికా చర్యలు, మైక్రోసాఫ్ట్, అడోబ్‌లకు మినహాయింపు

ఫొటో సోర్స్, Reuters
ఫొటో క్యాప్షన్, అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ ప్రకారం, శాశ్వత వీసా కార్యక్రమం నుంచి కంపెనీలను నిలిపివేయడం అనేది అమెరికన్లకు ఒక పెద్ద విజయం ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కాగ్నిజెంట్, క్యాప్‌జెమిని సహా పలు ప్రధాన టెక్నాలజీ, ఐటీ కంపెనీలను యూఎస్ కార్మిక శాఖ యూఎస్ పర్మినెంట్ లేబర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి తప్పించింది.
అమెరికా కార్మిక శాఖ కార్యదర్శి కీత్ సోండర్లింగ్ ఒక ప్రకటనలో తెలిపిన ప్రకారం, ఈ ప్రోగ్రామ్ నుంచి మైక్రోసాఫ్ట్, అడోబ్‌లను కూడా తొలగించామని చెప్పారు. ఈ రెండు కంపెనీలపై పలు ఫెడరల్ దర్యాప్తులు కొనసాగుతుండటమే దీనికి కారణమని పేర్కొన్నారు.
"ప్రపంచంలోని అతిపెద్ద ఐటీ అవుట్‌సోర్సింగ్ కంపెనీలైన కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్‌జెమినిలను పర్మినెంట్ వర్కర్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. పలు ఫెడరల్ దర్యాప్తుల కారణంగా యూఎస్ కార్మిక శాఖ కూడా మైక్రోసాఫ్ట్, అడోబ్‌లను ఈ ప్రోగ్రామ్ నుంచి తప్పించింది" అని సోండర్లింగ్ అన్నారు.
ఆయన ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్‌ను కూడా ప్రస్తావించారు.
బహుశా మైక్రోసాఫ్ట్ కంటే మరే ఇతర అమెరికన్ కంపెనీ కూడా ఈ వ్యవస్థను ఇంతగా దుర్వినియోగం చేసి ఉండదని సోండర్లింగ్ ఆరోపించారు.
2025లో మైక్రోసాఫ్ట్ సుమారు 6,000 మంది అమెరికన్ ఉద్యోగులను తొలగించిందని సోండర్లింగ్ ఆరోపించారు.
కొన్ని పదవులకు అర్హతగల అమెరికన్ ఉద్యోగులను కనుగొనలేకపోతున్నామని ఆ సంస్థ ఇంతకుముందు చెప్పింది.
"వీసా ప్రక్రియ దుర్వినియోగాన్ని అరికట్టడం, అమెరికన్ కార్మికులను పరిరక్షించడానికి, ఈ రోజు తీసుకుంటున్న ఈ చరిత్రాత్మక చర్య ఒక ముఖ్యమైన మొదటి అడుగు" అని సోండర్లింగ్ X లోని ఒక పోస్ట్‌లో రాశారు.
బస్సులపై రష్యా దాడిలో కనీసం 30 మంది మృతి చెందారని యుక్రెయిన్ తెలిపింది, బస్సులను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు

ఫొటో సోర్స్, Office of the Prosecutor General
ఫొటో క్యాప్షన్, బస్సులపై రష్యా దాడిలో కనీసం 30 మంది మృతి చెందారని యుక్రెయిన్ తెలిపింది "బస్సులను లక్ష్యంగా చేసుకుని రష్యా జరిపిన దాడుల్లో" కనీసం 30 మంది మరణించారని యుక్రెయిన్ అధికారులు చెబుతున్నారు.
సరిహద్దు నగరమైన క్రమటోర్స్క్‌లో పౌరులతో ప్రయాణిస్తున్న రెండు బస్సులపై రష్యా గ్లైడ్ బాంబులు దాడి చేశాయని అధికారులు తెలిపారు.
ఈ దాడిలో మరో 18 మంది గాయపడ్డారని డొనెట్స్క్ ప్రాంత అధిపతి వాడిమ్ ఫిల్యాష్కిన్ తెలిపారు.
సాధ్యమైనంత ఎక్కువ మంది పౌరులను చంపేందుకు, ప్రయాణికులతో వెళ్తున్న బస్సులను రష్యా లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.
స్థానిక అధికారులు పోస్ట్ చేసిన చిత్రాలలో రోడ్డుపై శిథిలాలు, మండుతున్న బస్సు కనిపించాయి.
రష్యా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న కోట ప్రాంతంలో క్రామటోర్స్క్, దాని పొరుగు నగరమైన స్లోవియాన్స్క్ ఉన్నాయి. యుక్రెయిన్లోని డాన్‌బాస్ పారిశ్రామిక ప్రాంతం మొత్తం తమదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వాదిస్తున్నారు.
దేశవ్యాప్తంగా రష్యా దాడులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో జరిగిన ఈ తాజా దాడిపై రష్యా ఇంకా స్పందించలేదు.
ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఈ ఏడాది ఆగస్టు నాటికి యుక్రెయిన్‌లో మరణించిన పౌరుల సంఖ్య, 2025 సంవత్సరం మొత్తం మీద మరణించిన పౌరుల సంఖ్యను మించిపోయింది.
బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
నేను, బీబీసీ కరస్పాండెంట్ ఖగేష్, ఇప్పటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మీకు ముఖ్యమైన వార్తలను అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కాంగ్రెస్‌కు, సీజేపీ మధ్య విభేదాలు ఉన్నాయా? అరవింద్ కేజ్రీవాల్ నిరసనలకు ఎందుకు వెళ్లలేదు?
రొమ్ము క్యాన్సర్: లక్షణాలు లేకపోయినా టెస్ట్‌లు ఎందుకు చేయించుకోవాలి?
భారత్ రక్షణ సమాచారం పాకిస్తాన్ నిఘా సంస్థలకు అందుతోందా?
‘గంటకు పైగా సీపీఆర్ చేసినా బతకలేదు’ నానా పాటేకర్ చివరిక్షణాలపై వైద్యులు ఏం చెప్పారు?
పిడుగు పడిందా, వడగళ్ల వర్షమా? 104 మందితో వెళ్తున్న ఆ విమానం ఎందుకు దెబ్బతింది?
‘‘సుమారు 150 ఏళ్లు ప్రపంచానికి దూరంగా ఒక ద్వీపంలో బతికారు, వాళ్లకు షాపులు, డబ్బులు, టీవీలు, సినిమాలు అంటే ఏంటో తెలియదు’’
‘సర్’ వివాదం: హైదరాబాద్‌లో ‘చలో లోక్ భవన్’ నిర్వహించిన ‘ఇండియా’ కూటమి

ఫొటో క్యాప్షన్, ఇండియా కూటమి నిరసన ఓట్ల సవరణ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడ్డారంటూ భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి ఇచ్చిన ‘సేవ్ డెమోక్రసీ’ పిలుపులో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చలో లోక్‌భవన్ (రాజ్‌భవన్)’ ర్యాలీ జరిగింది.
నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వివేక, అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కును కాపాడాలనే ప్రధాన డిమాండ్‌తో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. ఈ ర్యాలీలో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, తెలంగాణ జన సమితి (టీజేఎస్), ఆర్జేడీ నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న మంత్రులందర్నీ అరెస్టు చేసి పంజాగుట్ట స్టేషన్‌కు , ఇతర నాయకులను వేర్వేరు పోలీసుస్టేషన్లకు తరలించారు.
నిన్న అద్వానీని కలిసిన ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, x.com/narendramodi
ఫొటో క్యాప్షన్, అద్వానీ, మోదీ ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీతో సమావేశమయ్యారు.
ఈ సమావేశం నిన్న(అక్టోబర్ 7) జరిగిన్టటు మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
‘‘అద్వానీని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్నా. దశాబ్దాలుగా అద్వానీ అందించిన ప్రజాసేవ, దేశానికి ఆయన చేసిన కృషి చెరగని ముద్రవేశాయి. దేశ ప్రగతిని బలోపేతం చేయడంలో అద్వానీది కీలకపాత్ర’’ అని మోదీ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రముఖ నటుడు నానా పాటేకర్ కన్నుమూత

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, నానా పాటేకర్ ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటుడు నానా పాటేకర్ కన్నుమూశారు. 75ఏళ్ల నానా పాటేకర్ గోవాలో కన్నుమూసినట్టు ఆయన కుమారుడు మల్హర్ పాటేకర్ చెప్పారు. ఈ దురదృష్టకర వార్త నిజమేనని ధ్రువీకరించారు.
ఈ ఉదయం 5.20గంటలకు తీవ్రమైన గుండెపోటుతో తన నివాసంలో పాటేకర్ మరణించారు.
‘‘45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినా నానా పాటేకర్‌ను కాపాడలేకపోయారు. ఈ ఘటనపై మెడికో లీగల్ కేసు(ఎంఎల్‌సీ) నమోదు చేసినట్టు, పోస్ట్ మార్టమ్ నిర్వహించనున్నట్టు మణిపాల్ ఆస్పత్రి ఆంకాలజీ విభాగం అధిపతి డాక్టర్ శేఖర్ సాళ్కర్ తెలిపారు’’ అని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
దశాబ్దాలపాటు సాగిన కెరీర్‌లో హిందీ, మరాఠీ సినిమాల్లో ప్రముఖ నటుడిగా నానా పాటేకర్ గుర్తింపు పొందారు.
పరిందా, ప్రహార్: ది ఫైనల్ అటాక్, క్రాంతివీర్, అగ్ని సాక్షి, ఖామోషీ: ది మ్యూజికల్, అబ్ తక్ ఛప్పన్, వెల్కమ్ వంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి గుర్తింపు లభించింది.
నటనతో పాటు 'ప్రహార్: ది ఫైనల్ ఎటాక్' చిత్రానికి నానా పాటేకర్ దర్శకత్వం కూడా వహించారు. సినిమా, కళారంగానికి చేసిన సేవలకుగాను 2013లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
నానా పాటేకర్ చివరిసారిగా విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'ఓ'రోమియో'లో కనిపించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలయింది. ప్రకాశ్ ఝా రాజకీయ డ్రామా సిరీస్ ‘సంకల్ప్’తో ఓటీటీలోకి ప్రవేశించారు.
నానా పాటేకర్ తొలి హిందీ చిత్రం ‘గమన్’. 1978లో ఇది విడుదలయింది. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్‌లో హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు.
2007లో వచ్చిన 'వెల్కమ్' అనే కామెడీ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ ఉదయ్ శెట్టి పాత్రతో ప్రేక్షకులను అలరించారు నానా పాటేకర్. సీక్వెల్ అయిన 'వెల్కమ్ బ్యాక్' (2015)లో కూడా అదే పాత్రను పోషించారు.
