సీబీఐ: మెహుల్ చోక్సీ రెడ్ కార్నర్ నోటీస్ కోసం మళ్లీ అప్పీలు చేస్తాం

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు సంబంధించిన రూ.13,000 కోట్ల కుంభకోణంలో మెహుల్ చోక్సీ ప్రధాన నిందితునిగా ఉన్నారు.

లైవ్ కవరేజీ

  1. జుల్ఫికర్ అలీ భుట్టో: ‘నేను భారత పౌరుడిని’ అంటూ బెనజీర్ భుట్టో తండ్రి భారతీయ కోర్టుల్లో ఎందుకు పోరాడారు?

  2. అర్నబ్ తుపానుతో పంటలకు తీవ్ర నష్టం: అమిత్ షాకు సీఎం లేఖ

    అమిత్‌ షాకు చంద్రబాబు లేఖ
    ఫొటో క్యాప్షన్, అమిత్‌ షాకు చంద్రబాబు లేఖ

    కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అర్నబ్ తుపాను తీవ్రతను గుర్తించి నష్టాలను అంచనా వేసేందుకు కేంద్ర బృందాలను త్వరగా పంపించాలని విజ్ఞప్తి చేశారు.

    తుపాను వేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను అమిత్ షాకు చంద్రబాబు వివరించారు.

    ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రాణ నష్టం లేకుండా చూశామని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

    ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఇతర కేంద్ర సిబ్బంది సహాయం మరింత కాలం అందించాలని విజ్ఞప్తి చేశారు.

  3. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లోకి జియో ఫ్లాట్‌ఫామ్స్.. ధర ఎంతంటే?

    ఇవాళ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన జియో ప్లాట్‌ఫామ్
    ఫొటో క్యాప్షన్, ఇవాళ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించిన జియో ప్లాట్‌ఫామ్

    నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్‌కు చెందిన ఒక్కో షేరు రూ. 1,358 చొప్పున లిస్ట్ అయ్యింది.

    ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇషా అంబానీ మాట్లాడుతూ, 1977లో రిలయన్స్ తొలి పబ్లిక్ ఇష్యూకి వచ్చినప్పుడు తన తండ్రి ముఖేష్ అంబానీ ఎంతో శ్రమించారని తెలిపారు.రిలయన్స్‌ను సామాన్య ప్రజల వద్దకు తీసుకెళ్లాలనే నిర్ణయాన్ని మా తాత ధీరూభాయ్ అంబానీ తీసుకున్నారు. ఆ సమయంలో కంపెనీ రూ. 10 కోట్ల వాల్యుయేషన్‌తో రూ. 2.82 కోట్లు సమీకరించింది" అన్నారు.

    జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్ కోసం జరిగిన గంట మోగించే కార్యక్రమానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ, ఎన్‌ఎస్‌ఈ ఎండీ & సీఈఓ ఆశిష్ చౌహాన్ హాజరయ్యారు.

  4. నరసాపురం సమీపంలో తీరం దాటిన అర్నబ్ తుపాను

    నరసాపురం సమీపంలో తీరం దాటిన అర్నబ్ తుపాను
    ఫొటో క్యాప్షన్, నరసాపురం సమీపంలో తీరం దాటిన అర్నబ్ తుపాను

    అర్నబ్ తుపాను నర్సాపురానికి సమీపంలో తీరాన్ని దాటినట్టు ఆంధ్రప్రదేశ్ విపత్తుల సంస్థ ప్రకటించింది.

    రాత్రి 2 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య యానాంకు నైరుతిగా, నర్సాపురం సమీపంలో తీరం దాటినట్టు కొద్దిసేపటి కిందట ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు.

    తీరం దాటిన తర్వాత ప్రస్తుతం ఈ తుపాను బలహీనపడిందని తెలిపారు. అర్నబ్తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

    దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని ప్రఖర్ జైన్ తెలిపారు.

  5. ‘నర్సాపురం-యానాం మధ్య తీరాన్ని తాకిన అర్నబ్ తుపాను’

    అర్నబ్ తీవ్ర తుపాను తీరాన్ని తాకింది
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తీవ్ర తుపాను తీరాన్ని తాకింది

    ఈ తీవ్ర తుపాను నర్సాపురం, యానాం మధ్య ప్రాంతంలో తీరాన్ని తాకినట్టు మూర్తి ఏఎన్ఐకి చెప్పారు.

    అర్నబ్ తుపాను పూర్తిగా తీరం దాటేందుకు మరో రెండు మూడు గంటల సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు.

    "ప్రస్తుతం ఈ తీవ్ర తుపాను నర్సాపురం, యానాం మధ్య తీర ప్రాంతంలో ఉంది. ఇది గంటకు మూడు కిలోమీటర్ల అతి తక్కువ వేగంతో కదులుతోంది. తుపాను కేంద్రం ఇప్పటికే తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటడానికి ఒకటి నుంచి రెండు గంటలు, లేదా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టవచ్చు. తీరం దాటిన తర్వాత, ఈ తుపాను ఉత్తర-వాయవ్య దిశగా పయనించే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి, ఇవి గంటకు 140 కిలోమీటర్ల వేగం వరకు కూడా ఉండవచ్చు. తీరం దాటిన తర్వాత ఈ గాలుల తీవ్రత క్రమంగా తగ్గుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల తీవ్రత ఈ సాయంత్రం వరకు కొనసాగుతుంది; సాయంత్రం నుంచి వర్షాల తీవ్రత నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది, అదే సమయంలో గాలుల వేగం కూడా క్రమంగా తగ్గుతుంది" అని తెలిపారు.

  6. ‘మధ్యాహ్నానికి గాలుల వేగం తగ్గే అవకాశం’ : ఏపీ వాతావరణ శాఖ

    అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరందాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు.
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరందాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు.

    అర్నబ్ తుపాను ప్రస్తుతానికి ఒకే చోట నిలిచి ఉందని, ఒకట్రెండు గంటల్లో తీరం దాటుతుందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు. ఏఎన్ఐతో మాట్లాడిన ఆమె తుపాను తీరం దాటే సమయంలో 150 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు.

    "ప్రస్తుతం ఈ తుపాను తీవ్రతను గమనిస్తే, కోనసీమ, కాకినాడ పరిసర ప్రాంతాలతోపాటు ఇతర తీరప్రాంత జిల్లాల్లో గాలి వేగం గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వరకు ఉంది. ఇది గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం తుపాను దాదాపు ఒకే చోట నిలిచి ఉంది.ఒకటి రెండు గంటల్లో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. రాబోయే కొద్ది గంటల్లో ఈ తుపాను తీరాన్ని దాటుతుందని అంచనా. ఆ తర్వాత దీని తీవ్రత తగ్గి, 'తీవ్ర తుపాను'గా మారుతుంది.మధ్యాహ్నానికి ఇది మరింత బలహీనపడి కేవలం 'తుపాను'గా మారే అవకాశం ఉంది. తీరాన్ని దాటే సమయంలో ఇది 'అత్యంత తీవ్ర తుపాను' స్థితిలో ఉంటుంది. కొన్ని గంటల తర్వాత గాలి వేగం గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు. మధ్యాహ్నానికి గాలి వేగం మరింత తగ్గి, గంటకు 60 నుంచి 70 కిలోమీటర్లకు చేరుకుంటుందని అంచనా" అని నాగరత్నం తెలిపారు.

  7. అర్నబ్ తుపాను: ఇవాళ, రేపు, ఎల్లుండి పలు రైళ్లు రద్దు

    అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే

    అర్నబ్ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే దీనికి సంబంధించిన తాజా వివరాలతో ఒక ప్రకటన విడుదల చేసింది.

    దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన వివరాల ప్రకారం ఇవాళ రేపు రద్దు అయిన రైళ్ల వివరాలు ఇవే

    ఇవాళ రద్దు అయిన రైళ్లు (28 అక్టోబర్)

    • 12727 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 12739 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 17206 కాకినాడ పోర్టు- సాయినగర్ షిర్డీ
    • 12737 కాకినాడ పోర్టు – లింగంపల్లి
    • 20707 సికింద్రాబాద్- విశాఖపట్నం
    • 20708 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 20833 విశాఖపట్నం- సికింద్రాబాద్
    • 12787 నర్సాపురం- నాగర్‌సోల్
    • 17255 నర్సాపురం- లింగంపల్లి
    • 20834సికింద్రాబాద్- విశాఖపట్నం

    రేపు రద్దు అయిన రైళ్లు(29 అక్టోబర్)

    • 12703 హౌరా- సికింద్రాబాద్ ట్రైన్
    • 17015 భువనేశ్వర్ – సికింద్రాబాద్
    • 22881 పుణె- భువనేశ్వర్
    • 17205 సాయినగర్ షిర్డీ- కాకినాడ పోర్ట్

    శుక్రవారం రద్దు అయిన రైళ్లు(30 అక్టోబర్)

    • 20809 సంబల్‌పూర్- హెచ్ఎస్ నాందేడ్
    • రీ షెడ్యూల్ అయిన రైళ్లు(బయల్దేరాల్సిన సమయానికి కంటే మూడు గంటలు ఆలస్యంగా నడుస్తాయి)
    • 12805 విశాఖపట్నం- లింగంపల్లి
    • 17221 కాకినాడ పోర్టు – ఎల్టీటీ ముంబై
    • 12806 లింగంపల్లి- విశాఖపట్నం
    • 18046 చర్లపల్లి- షాలీమర్
    • 18519 విశాఖపట్నం- ముంబై ఎల్టీటీ (నిన్న బయల్దేరాల్సిన రైలు ఇవాళ ఉదయం నాలుగు గంటలకు రీ షెడ్యూల్ చేశారు)
  8. అర్నబ్: కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు - ఐఎండీ హెచ్చరిక

  9. భారత్ విడిచి వెళ్లాలంటూ ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసుపై బాంబే హైకోర్టు తాజా స్పందనేంటి?

    ముంబైలోని ఫారెనర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) అక్టోబర్ 14న ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను ఇమ్రాన్ ఖాన్ జారీ చేసింది.
    ఫొటో క్యాప్షన్, నటుడు ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)

    ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు నవంబర్ 2వ తేదీకి వాయిదా వేసింది.

    ఆ నోటీసులో ఇమ్రాన్ ఖాన్ అక్టోబర్ 28వ తేదీలోగా భారత్ విడిచి వెళ్లాలని పేర్కొన్నారు.

    కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ), తదుపరి విచారణ జరిగే వరకు ఇమ్రాన్ ఖాన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టుకు మౌఖికంగా హామీ ఇచ్చారు.

    తదుపరి విచారణ వరకు ఈ కేసులో తదుపరి చర్యలను కూడా కోర్టు నిలిపివేసింది.

    ముంబైలోని ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్(ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ) అక్టోబర్ 14న జారీ చేసిన ‘భారత్ విడిచి వెళ్లాలనే నోటీసు’ను సవాలు చేస్తూ ఇమ్రాన్ ఖాన్ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్నందున ఈ నోటీసు జారీ చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ పేర్కొంది.

  10. అర్నబ్ తుపాను ప్రభావంతో రద్దైన రైళ్లు ఇవే- దక్షిణమధ్య రైల్వే అధికారిక ప్రకటన

    అర్నబ్, విశాఖ, దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్,
    ఫొటో క్యాప్షన్, రైళ్లు రద్దు చేస్తున్నట్టు అధికారిక ప్రకటన విడుదల చేసిన దక్షిణ మధ్యరైల్వే

    అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతల గుండా రాకపోకలు సాగించే రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.

    పశ్చిమ- మద్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ప్రభావం రవాణా రంగం తీవ్రంగా ఉంది. ఇప్పటికే విమానాల సర్వీసులపై ఎఫెక్ట్ పడుతుందని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలని ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు సూచించింది.

    ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే కూడా ఒక ప్రకటన చేసింది. తుపాను ప్రభావిత ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగేంచే పలు రైళ్లను రద్దు చేసింది.

    ఇవాళ రద్దు అయిన రైళ్లు ఇవే

    • 12704 సికింద్రబాద్- హౌడా
    • 17016 సికింద్రాబాద్- భువనేశ్వర్ న్యూ
    • 12728 హైదరాబాద్- విశాఖపట్నం
    • 12862 మహబూబ్‌నగర్- విశాఖపట్నం
    • 12740 సికింద్రాబాద్- విశాఖపట్నం
    • 12776 లింగంపల్లి- కాకినాడ టౌన్
    • 17256 లింగంపల్లి- నర్సాపూర్
    • 12738 లింగంపల్లి- కాకినాడ పోర్ట్
    • 20810 హెఎస్ నాందేడ్- సంబల్‌పూర్
    • 07037 చర్లపల్లి- శ్రీకాకుళం రోడ్

    రేపు(28/10/2026) రద్దు అయిన రైళ్లు ఇవే

    • 07038 శ్రీకాకుళం రోడ్ – చర్లపల్లి
    • నాగర్‌సోల్- నర్సాపూర్ మధ్య నడిచే 12788 ట్రైన్‌ను చర్లపల్లి నర్సాపూర్ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు.
  11. ‘అర్నబ్’ తుపానుకు ఆ పేరు ఎలా వచ్చింది? అసలు తుపానులకు పేర్లు ఎలా పెడతారు?

  12. అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

    అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు
    ఫొటో క్యాప్షన్, అర్నబ్ తుపాను ప్రభావిత ప్రాంతాల కోసం ప్రత్యేక కంట్రోల్ రూంలు ఏర్పాటు

    పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారిన ‘అర్నబ్’ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్టు ఆంధ్రప్రదేశ్రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఫోన్ నెంబర్లను విడుదల చేసింది.

    ఈ తుపాను ప్రభావంతో విశాఖ, శ్రీకాకుళం,విజయనగరం, మన్యం, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ప్రకటించారు.

    అర్నబ్ తుపాన్ వేళ ప్రభావిత జిల్లాల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన నెంబర్లను విడుదల చేశారు.

    అత్యవసర సహాయం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నంబర్లు 112 , 1070 , 1800 425 0101 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా తుపాన్ స‌మ‌స్యలకు వేగవంతమైన పరిష్కారం పొందవచ్చని ప్రఖర్ జైన్ తెలిపారు.

    • శ్రీకాకుళం- 08942240557
    • విజయనగరం- 8922236947
    • పార్వతీపురం మన్యం- 08963450347
    • అల్లూరి సీతారామరాజు- 8935293448
    • విశాఖపట్నం- 0891-2590102 / 0891-2590100
    • అనకాపల్లి- 08924-222888 / 08924-226599 / 08924-225999
    • కాకినాడ-0884-2356801 / 9849903879
    • కోనసీమ-8856293104
    • తూర్పు గోదావరి-8832944455
    • పశ్చిమ గోదావరి-08816-299181
    • ఏలూరు-18002331077 / 9494041419
    • పోలవరం-18004254225
    • తిరుపతి-0877 2236007
    • మార్కాపురం-9248702500
    • కృష్ణా-08672 252399
    • ఎన్టీఆర్- 9154970454
    • గుంటూరు- 0863-2234014
    • బాపట్ల- 08643-220226
    • ప్రకాశం- 08592 295600 / 18004250277
    • నెల్లూరు- 7995576699
  13. రైళ్ల రద్దు, విద్యాసంస్థలకు సెలవులు, నిత్యావసరాలు రెడీ చేసుకుంటున్న ప్రజలు.. అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌పై ఎలాంటి ప్రభావం చూపుతోందంటే

  14. ‘జైలులో అనారోగ్యం నటించారు.. సిబ్బందిపై దాడి చేసి 17 మంది పారిపోయారు’

  15. ఎల్ నినో ‘అత్యంత తీవ్రరూపం’ దాల్చబోతోందా? ఇది ఎప్పటివరకు కొనసాగొచ్చు? ‘ఇన్‌కాయిస్’ ఏం చెప్పింది?

  16. ఇంజమామ్ ఉల్ హక్: సిక్స్ కొట్టాలని ఉందని సెహ్వాగ్ చెబితే, ఫీల్డర్లను ముందుకు తీసుకొచ్చిన పాకిస్తానీ కెప్టెన్

  17. సౌదీలో చిక్కుకున్న భారతీయ యాత్రికుల పరిస్థితి ఎలా ఉంది?

  18. పార్లమెంట్‌కు సమీపంలో నార్త్ బ్లాక్‌లో కమ్ముకున్న దట్టమైన పొగ– వెల్డింగ్ పనుల కారణంగా చెలరేగిన మంటలు

    నార్త్ బ్లాక్‌, దిల్లీ
    ఫొటో క్యాప్షన్, పార్లమెంట్‌కు సమీపంలో నార్త్ బ్లాక్‌లో కమ్ముకున్న దట్టమైన పొగ

    పార్లమెంట్‌కు సమీపంలో నార్త్‌బ్లాక్‌లో సోమవారం ఒక్కసారిగా దట్టమైన పొగ కమ్ముకుంది.

    “పార్లమెంట్‌కు వెళ్తున్నప్పుడు, నార్త్‌బ్లాక్ వెనుకాల దట్టమైన పొగను గమనించాను. అక్కడ అగ్ని ప్రమాదం జరిగిం ఉండొచ్చని అనుమానం వచ్చింది. అంతా క్షేమంగా ఉంటారని భావిస్తున్నాను. అత్యవసర సిబ్బంది వేగంగా స్పందించాలని కోరుకుంటున్నాను” అని బీజేపీ ఎంపీ మిలింద్ డియోరా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

    “దిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనంలోని చిల్లర్ ప్లాంట్‌లో ఉపయోగించే ఫైబర్ ట్యాంక్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో నల్లటి పొగ భారీగా వ్యాపించింది. దీంతో సమీపంలోని ప్రజలు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు” అని హిందూ పేర్కొంది.

    నార్త్‌బ్లాక్‌లో వెల్డింగ్ వర్క్ చేస్తుంటే చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. వెల్డింగ్ నుంచి వచ్చిన నిప్పు రవ్వలు సమీపంలోని ట్యాంక్‌కు వ్యాపించి మంటలు చెలరేగి పొగ వ్యాపించింది అని ఏఏఎన్ఎస్ పేర్కొంది.

    ఘటన జరిగిన వెంటనే మంటలను ఆర్పేశారు. కొన్ని ప్రాంతాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. ఎవరూ గాయపడినట్టు రిపోర్ట్ కాలేదు.

    సోమవారం 11 గంటలకు అగ్ని ప్రమాదం సమాచారం అందింది. సమాచారం వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి 6 ఆగ్నిమాపక యంత్రాలను పంపి మంటలను అదుపు చేసినట్టు దిల్లీ ఫైర్ డిపార్ట్‌మెంట్ చెప్పింది.

  19. రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

    పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రహదారి, రాహుల్ గాంధీ
    ఫొటో క్యాప్షన్, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం

    ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ రహదారిపై రాహుల్ గాంధీ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన కాన్వాయ్‌లోని వాహనాలే ఒకదానికొకటి ఢీకొన్నాయి.

    అందరూ క్షేమంగా ఉన్నారని పవన్ ఖేరా చెప్పినట్టు బీసీసీ ప్రతినిధి ప్రేరణ తెలిపారు.

    చాలా స్వల్ప ప్రమాదమని, ఎవరికీ ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని న్యూస్ ఏజెన్సీ పీటీఐ పేర్కొంది.

    రాహుల్ గాంధీ లఖ్‌నవూ నుంచి సుల్తాన్‌పూర్ వెళ్తుండగా హాలియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదం జరిగిందని ఐఏఎన్‌ఎస్ రిపోర్టు చేసింది.

    ప్రమాదంలో కారు బానెట్ ధ్వంసమైనట్టు వివరించింది.

    ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ రాహుల్ గాంధీ వెంటనే వేరే వాహనంలో సుల్తాన్‌పూర్ వెళ్లినట్టు తెలిపింది. ఎంపీ-ఎంఎల్‌ఏ కోర్టు ముందు హాజరయ్యేందుకు రాహుల్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

  20. న్యూజీలాండ్‌తో జరిగే మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం

    న్యూజీలాండ్‌, ఇషాన్ కిషన్
    ఫొటో క్యాప్షన్, న్యూజీలాండ్‌తో జరిగే మూడో టీ20కి ఇషాన్ కిషన్ దూరం

    తొడ కండరాలు పట్టేయడంతో న్యూజీలాండ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌కి కూడా ఇషాన్ కిషన్ దూరంకానున్నట్టు బీసీసీఐ ప్రకటించింది.

    న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లోని తొలి టీ20 మ్యాచ్‌లో కుడి తొడ కండరాలు గాయంతో రెండో టీ20కి దూరమయ్యాడు. ఆయన స్థానంలో వైభవ్ సూర్యవంశీ ఆడాడు. రెండో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వైభవ్ ఆకట్టుకోలేకపోయాడు.

    ఇషాన్ కిషన్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని బీసీసీఐ తెలిపింది. అతను ఇంకా మ్యాచ్ ఆడే స్థాయికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేదని వెల్లడించింది. అందుకే అక్టోబర్ 27న వెల్లింగ్‌టన్‌లో జరగనున్న మూడో టీ20 మ్యాచ్‌కు దూరమవుతున్నట్టు పేర్కొంది. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఇషాన్ కోలుకుంటున్నాడని చెప్పింది. కుమార్ కుశాగ్ర మూడో టీ20 మ్యాచ్‌లో ఆడతాడని వెల్లడించింది.