‘ఆస్కార్ అవార్డు ప్రజెంటర్లలో నేనూ ఉన్నా’- ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించిన దీపికా పదుకొణె

డ్వేన్ జాన్సన్, మైఖేల్ జోర్డాన్, రిజ్ అహ్మద్, ఎమిలీ బ్లంట్, గ్లెన్ క్లోజ్, ట్రాయ్ కోట్సర్, జెన్నిఫర్ కానెలీ, సామ్యూల్ జాక్సన్, మెలిసా మెకార్తీ, జో సల్దానా, డానీ యెన్, జొనాథన్ మేజర్స్ కూడా ఈ కార్యక్రమంలో ప్రజెంటర్లుగా వ్యవహరించనున్నారు

లైవ్ కవరేజీ

  1. మిడ్‌టర్మ్ ఎలక్షన్స్ : ట్రంప్‌ నిర్ణయాలకు ఈ ఫలితాలు కళ్లెం వేస్తాయా?

  2. ధన త్రయోదశి: బంగారం, వెండి భవిష్యత్‌ ఏంటి?

  3. అమెరికాలో మధ్యంతర ఎన్నికల ప్రాధాన్యత ఏంటి? భారత్ మీద వీటి ప్రభావం ఎలా ఉండొచ్చు?

  4. ‘ఇది ఎన్నిక కాదు ఎంపిక, కంగ్రాట్స్ పోలీస్... ’ అన్న జగన్, ఈ ఫలితాలు సుపరిపాలనకు నిదర్శనమన్న సీఎం చంద్రబాబు

  5. 'నిమిషానికి 20వేల అడుగుల వేగంతో కిందికి పడిపోతున్నాం'- ఫ్లోరిడా విమాన ప్రమాదంలో పైలట్లు చివరగా ఇంకా ఏం చెప్పారు?

  6. 20 మంది సిబ్బందిని రక్షించిన భారత్‌కు కృతజ్ఞతలు చెప్పిన ఇరాన్

    ఇరాన్, భారత్
    ఫొటో క్యాప్షన్, 20 మంది సిబ్బందిని రక్షించిన భారత్‌కు కృతజ్ఞతలు చెప్పిన ఇరాన్

    'అజినీ' నౌకలోని 20 మంది ఇరాన్ సిబ్బందిని రక్షించినందుకు భారత ప్రభుత్వానికి, భారత నౌకాదళానికి, భారత వైమానిక దళానికి న్యూఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం కృతజ్ఞతలు తెలిపింది.

    "భారత సాయుధ దళాల నైపుణ్యం, ధైర్యం, సమన్వయాన్ని ప్రశంసిస్తున్నాం" అని ఇరాన్ రాయబార కార్యాలయం రాసుకొచ్చింది.

    "ఇది మానవతా సహాయం, విపత్తు సహాయక చర్యల పట్ల భారత్‌కు ఉన్న బలమైన నిబద్ధతను తెలియజేస్తోంది. తన సరిహద్దులకు ఆవల ప్రాణాలను కాపాడటంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుందని ఈ ఘటన చూపిస్తుంది." అని అభిప్రాయపడింది

    ఈ ఆపరేషన్‌ను భారత్, ఇరాన్‌ మధ్య స్నేహం, సంఘీభావం, సహకార స్ఫూర్తికి ప్రతీకగా ఇరాన్ రాయబార కార్యాలయం అభివర్ణించింది.

    ఇరాన్ సిబ్బందిని సురక్షితంగా రక్షించడంలో పాలుపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.

    ఈ మిషన్‌కుగాను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సోషల్ మీడియాలో భారత నౌకాదళాన్ని అభినందించారు. ముంబయికి 3,000 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న అరేబియా సముద్రంలో 48 గంటల పాటు సాగిన ఆపరేషన్ తర్వాత, సిబ్బందిలోని 20 మందిని కాపాడారని ఆయన అన్నారు.

    ఈ ఆపరేషన్‌లో భారత వైమానిక దళం కూడా సకాలంలో సహకారం అందించింది.

    భారత నౌకాదళం సముద్రపు దొంగలను గుర్తించి, వారిని అడ్డుకుని, సిబ్బందిని సురక్షితంగా తీసుకొచ్చిందని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

  7. అమెరికన్లు మార్పు కోరుకుంటున్నారా?

  8. తుపానులు అక్టోబరు, నవంబరులోనే ఎక్కువగా ఎందుకు వస్తుంటాయి..

  9. సీజేపీ నిరసనలకు కాంగ్రెస్ దూరం.. ‘ఇండియా’ బ్లాక్‌ ర్యాలీకి సీజేపీ దూరం.. డిమాండ్ ఒక్కటే అయినా దారులెందుకు వేరయ్యాయి?

  10. గుండె కొట్టుకోవడం ఆగిపోతే ఎంతసేపు సీపీఆర్ చేయాలి?

  11. మురసు తుపాను ప్రభావంతో ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కౌంటింగ్ ఆలస్యం, గరికిపాటి ఉమాకాంత్, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్, మురసు, మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్,
    ఫొటో క్యాప్షన్, ఓట్ల లెక్కింపు(ప్రతీకాత్మక చిత్రం)

    మురసు తుపాను ప్రభావం మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై కనిపించింది. రెండు జిల్లాల్లో లెక్కింపు ఆలస్యం కానుందని అధికారులు ప్రకటించారు.

    ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం మార్పులు చేశారు.

    ఈ రెండు జిల్లాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభం కావాల్సిన కౌంటింగ్ 11.30 గంటలకు వాయిదా వేసినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. మిగిలిన జిల్లాల్లో కౌంటింగ్ యథావిధిగా సాగుతుందన్నారు.

    భారీ వర్షాలు, ఈదురుగాలులతో రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

    కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు కేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రహించిన ఎన్నికల అధికారులు అందుకు తగట్టుగా చర్యలు తీసుకున్నారు.

    అందుకే ఉదయం 10.30 గంటలకు మరోసారి పరిస్థితి సమీక్షించనుంది. వర్షాలు తగ్గకపోతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది.

    ఈ నిర్ణయం కేవలం ప్రకాశం, బాపట్ల జిల్లాలకే పరిమితమని ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. మిగతా జిల్లాల్లో ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభమైందని కూడా వెల్లడించింది. పటిష్టమైన భద్రత మధ్య కౌంటింగ్ నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశించింది.

  12. ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం, గరికిపాటి ఉమాకాంత్, బీబీసీ కోసం

    ఆంధ్రప్రదేశ్‌, మున్సిపాలిటీ ఎన్నికలు
    ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం (ప్రతీకాత్మక చిత్రం)

    ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలట్లు లెక్కిస్తున్నారు.

    ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభించనున్నారు.

    జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు. మిగిలిన జిల్లాల్లో యథావిధిగా లెక్కింపు ప్రారంభించామన్నారు.

    మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌పై తుపాను ప్రభావం ఉంది.

    విజయవాడలో రాత్రి నుంచి ఎడతెరపి లేని వర్షం కారణంగా కొన్నిచోట్ల కౌంటింగ్ కేంద్రాలకు సిబ్బంది పూర్తిగా చేరుకోలేదని అధికారులు చెప్పారు. కొందరికి ఆర్డర్‌ కాపీలు కూడా అందడంలోనూ ఆలస్యమైందని చెబుతున్నారు.

  13. ఒంగోలు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను

    ఒంగోలుకు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను
    ఫొటో క్యాప్షన్, ఒంగోలుకు సమీపంలో తీరం దాటిన మురసు తుపాను

    తీవ్ర తుపాను మురసు బంగాళాఖాతంలో ఉత్తర-వాయవ్య దిశగా పయనించి ఒంగోలు సమీపంలో తీరం దాటింది.

    మంగళవారం ఉదయం 3.30 నుంచి 5.30 గంటల మధ్య నెల్లూరు- నర్సాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటిందని ఐఎండీ ప్రకటించింది.

    ఈ సమయంలో గాలి వేగం గంటకు 100–110 కిలోమీటర్లుగా ఉందని, గాలి తీవ్రత ఒక్కసారిగా పెరిగినప్పుడు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిందని వెల్లడించింది.

  14. విశాఖ హెచ్‌పీసీఎల్‌లో అగ్ని ప్రమాదం, భారీ ఎత్తున ఎగసిన మంటలు, లక్కోజు శ్రీనివాస్, బీబీసీ కోసం

    విశాఖపట్నం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌
    ఫొటో క్యాప్షన్, హెచ్‌పీసీఎల్ గాజువాక నడిబొడ్డున ఉంటుంది. దీని చుట్టూ వేలాది నివాసాలు ఉంటాయి.

    విశాఖపట్నంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌ రిఫైనరీలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మల్కాపురం, శ్రీహరిపురం పారిశ్రామిక ప్రాంతాల పరిసరాల్లో ఈ ఘటనతో ఆందోళన నెలకొంది.

    రిఫైనరీలో రఫ్ పిచ్ ఆయిల్‌ (తారు) నిల్వ ఉన్న ట్యాంకు సమీపంలో మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటంతో పక్కనే ఉన్న రహదారులపై ప్రయాణిస్తున్నవారు వాటిని గమనించారు. పలువురు తమ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి.

    దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందారు. కొందరు మంటలు వ్యాప్తిని చూసి ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. హెచ్పీసీఎల్ గాజువాక నడిబొడ్డున ఉంటుంది. దీని చుట్టూ వేలాది నివాసాలు ఉంటాయి.

    విశాఖపట్నం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌
    ఫొటో క్యాప్షన్, హెచ్పీసీఎల్ ప్రమాద దృశ్యాలను అటుగా వెళ్తున్నవారంతా సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి

    ప్రమాదానికి కారణాలపై ఆరా

    హెచ్‌పీసీఎల్‌ వర్గాల ప్రాథమిక సమాచారం ప్రకారం... ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    ఆయిల్‌ ట్యాంకు పేలిపోయిందంటూ పారిశ్రామిక ప్రాంతంలో వదంతులు వ్యాపించాయి.

    ఇందులో వాస్తవం లేదని చెప్పారు.

    ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు పరిశీలన చేపట్టారు.

    విశాఖ హెచ్పీసీఎల్‌లో అగ్ని ప్రమాదం, భారీ ఎత్తున ఎగసిన మంటలు
    ఫొటో క్యాప్షన్, విశాఖ హెచ్పీసీఎల్‌లో అగ్ని ప్రమాదం, భారీ ఎత్తున ఎగసిన మంటలు

    రఫ్ పిచ్ ఆయిల్ అంటే ఏమిటి?

    రఫ్ పిచ్ ఆయిల్ అనేది బిటుమెన్‌ (తారు) తయారీలో ఉపయోగించే మధ్యంతర ఉత్పత్తి.

    తారు ముడి చమురు శుద్ధి ప్రక్రియలో లభించే లేదా సహజంగా లభించే నల్లటి, చిక్కటి, జిగటగా ఉండే హైడ్రోకార్బన్‌ పదార్థం.

    దీనిని వేడి చేసినప్పుడు మెత్తబడి, ప్రవహించే స్వభావం పెరుగుతుంది. అలాగే మండేటప్పుడు వెలువడే ఆవిరి, ఉష్ణోగ్రతను బట్టి అగ్ని ప్రమాద తీవ్రత ఆధారపడి ఉంటుంది.

    దీనిని రోడ్ల నిర్మాణం, వాటర్‌ప్రూఫింగ్‌, రూఫింగ్‌ వంటి పనులకు ఉపయోగిస్తారు.

    విశాఖపట్నం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌
    ఫొటో క్యాప్షన్, హెచ్‌పీసీఎల్‌ వర్గాల ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేదా ప్రాణనష్టం జరగలేదు.

    స్థానిక పోలీసులు ఏమన్నారంటే...

    ఈ ప్రమాదంతో గాజువాక పారిశ్రామిక ప్రాంతం కావడంతో అందరిలోనూ అందోళన నెలకొంది.

    సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాలతో పెద్ద ప్రమాదాన్ని తలపించాయి. దీనిపై మల్కాపురం సీఐ నర్సింహరావు మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

    “పెట్రోల్ తయారు చేసే క్రమంలో ఉత్పత్తయ్యే వ్యర్థ ఉత్పత్తిని నిల్వ చేసే ట్యాంకర్‌లో మంటలు వ్యాపించాయి.

    ఈ మంటలను హెచ్పీసీఎల్ ఫైర్ ట్యాంకులు అదుపు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.” అని సీఐ నర్సింగరావు తెలిపారు.

    విశాఖ
    ఫొటో క్యాప్షన్, విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు HPCL యాజమాన్యంతో మాట్లాడినట్లు ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.

    ఆందోళన అవసరం లేదు: ఎమ్మెల్యే గణబాబు

    విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పీజీవీఆర్ నాయుడు(గణబాబు) HPCL యాజమాన్యంతో మాట్లాడినట్లు ‘ఎక్స్’ లో పేర్కొన్నారు.

    “హెచ్పీసీఎల్ అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం…”సల్ఫర్ ప్లాంట్‌లో ట్రయల్ రన్ సమయంలో భారీగా మంటలు బయటకు రావడం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మంటలను అదుపు చేసేందుకు చుట్టుపక్కల పరిశ్రమల సహాయం తీసుకున్నారు. గత రెండు గంటలుగా పలువురు పరిశ్రమల యాజమాన్యంతో పాటు అగ్నిమాపక, పోలీసు శాఖల అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్రజలు ఎవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు.” అని పోస్ట్ చేశారు.

  15. మురసు: ఒంగోలు, మచిలీపట్నం మధ్య తీరం దాటుతున్న తీవ్ర తుపాను

    ఒంగోలు, మచిలీపట్నానికి మధ్య తీరం దాటుతున్న మురసు తుపాను
    ఫొటో క్యాప్షన్, ఒంగోలు, మచిలీపట్నానికి మధ్య తీరం దాటుతున్న మురసు తుపాను

    బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను మురసు ఆంధ్రప్రదేశ్‌లో తీరం దాటుతోంది. తీవ్ర తుపానుగా మారిన తరువాత ఇది మంగళవారం తెల్లవారుజాము నుంచి ఒంగోలు, మచిలీపట్నం మధ్య తీరాన్ని తాకి, దాటుతోందని భారత వాతాావరణ శాఖ(ఐఎండీ) నవంబరు 3న ఉదయం 5 గంటలకు జారీ చేసిన బులెటిన్‌లో వెల్లడించింది.

    ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో రెండు గంటల సమయం పడుతుందని వెల్లడించింది.

    తుపాను ముందుభాగంలోని ప్రధానమైన వాల్ క్లౌడ్ ఎక్కువ భాగం భూభాగంలోకి ప్రవేశించిందని తెలిపింది. సైక్లోన్ ఐ మాత్రం ఇంకా తీర ప్రాంతంలోకి ప్రవేశించే ప్రక్రియ కొనసాగుతున్నట్టు వెల్లడించింది.

    మురసు తుపాను గ‌డ‌చిన 6 గంట‌ల్లో గంట‌కు 9 కిలోమీటర్ల వేగంతో క‌దిలింది.

    తీవ్ర తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.

  16. బైడెన్‌ను అధికారానికి దూరం చేసిన ‘ఆర్థిక’ ఇబ్బందే ఇప్పుడు ట్రంప్‌కూ ఎదురవుతోంది, మరి ఆయనేం చేస్తారు?

  17. మురసు: అర్ధరాత్రి దాటాక ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం- వెల్లడించిన ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ

  18. ఛప్పనియా కరువు: మహిళలు సిగ్గు, మర్యాద వదిలేశారని చరిత్రకారులు ఎందుకన్నారు? కుక్కల దగ్గర్నుంచి మనుషులు ఆహారాన్ని లాక్కునేంత కరువు గురించి చరిత్రలో ఏం రాశారు?

  19. జర్మనీ: ఈ దేశంలో ఫ్రెండ్స్‌తో బయటికెళితే మన బిల్లు మనమే కట్టుకోవాలి, ఎందుకంటే..

  20. ఝార్ఖండ్: పోలీస్ స్టేషన్‌లో మహిళపై అత్యాచార యత్నం ఆరోపణలు, ముగ్గురు పోలీసుల అరెస్టు

    అత్యాచారం, పోలీస్ స్టేషన్, జార్ఖండ్
    ఫొటో క్యాప్షన్, ఈ కేసులో మొత్తం 15 మంది నిందితులుగా ఉన్నారని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మనోజ్ స్వర్గియారి తెలిపారు.

    ఝార్ఖండ్‌లోని సరాయ్‌కేలా జిల్లా గమ్హరియా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక మహిళపై అత్యాచారం కేసులోప్రధాన నిందితుడైన వైర్‌లెస్ ఆపరేటర్‌తో సహా ముగ్గురు పోలీసులను అరెస్టు చేసి జైలుకు పంపారు.

    జిల్లా ఎస్పీ మనోజ్ స్వర్గియారి దీన్ని ధృవీకరించారు. ఈ కేసులో మొత్తం 15 మంది నిందితులు ఉన్నారని ఆయన బీబీసీతో చెప్పారు.

    “నిర్లక్ష్యం, అజాగ్రత్త, క్రమశిక్షణారాహిత్యంపై చర్యల్లో భాగంగా 12 మంది పోలీసులను సస్పెండ్ చేశాం” అని ఆయన తెలిపారు.

    భర్తతో గొడవ జరిగిన తర్వాత స్థానిక గమ్హరియా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించినట్లు బాధిత మహిళ చెప్పారు. ఆమెను నిర్బంధించిన గదిలో వైర్‌లెస్ ఆపరేటర్ ఆమెపై అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి.

    “ఈ కేసు కోసం ఏర్పాటు చేసిన సిట్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. నివేదిక వచ్చిన తర్వాత నిందితులపై చర్యలు తీసుకుంటాం” అని ఎస్పీ అన్నారు.

    అత్యాచారం జరిగినట్లు వైద్య నివేదిక నిర్ధరించిందా అని పోలీస్ సూపరింటెండెంట్‌ను అడగ్గా “వైద్య పరీక్ష జరిగింది. రిపోర్ట్ ఇంకా రాలేదు. మేము దాని కోసం ఎదురుచూస్తున్నాం" అని ఎస్పీ చెప్పారు.