రవీంద్ర జడేజా: అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ఆల్‌రౌండర్

ఇండోర్‌తో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఓపెనర్ ట్రావిస్‌ హెడ్ అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డును జడేజా సాధించాడు.

లైవ్ కవరేజీ

  1. దసరా పండుగను అక్కడ 76 రోజుల పాటు జరుపుకుంటారు, కానీ రావణ దహనం మాత్రం ఉండదు

  2. స్థానిక సంస్థల ఎన్నికలు: తెలుసుకోవాల్సిన కీలక విషయాలు

  3. ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలు: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
    ఫొటో క్యాప్షన్, అనిల్ చంద్ర పునేఠా

    సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 19 ప్రాంతాల్లోనే ఆపాలని భావించినా, ఇప్పుడు మొత్తం 100 స్థానాల్లో ఆపేస్తున్నట్లు పేర్కొంది.

    అభ్యర్థుల జాబితా ప్రకటన ఈ నెల 25 వరకు వాయిదా వేయడంపై ఇవాళ నిర్ణయించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీల నివేదికల ఆధారంగా తుది నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

    రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో నామినేషన్లు వేసే అవకాశం తమ పార్టీ అభ్యర్థులకు కల్పించలేదని సుప్రీంకోర్టులో వైసీపీ పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దని ఆదేశించింది. గురువారం ఒక నిర్ణయం ప్రకటించాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

    సుప్రీంకోర్టు ఆదేశాలపై బుధవారం న్యాయనిపుణులతో చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా నోటిఫికేషన్ వచ్చిన 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.

  4. 82 ఏళ్ల కిందట గల్లంతైన జర్మన్ జలాంతర్గామి ఇప్పుడు కనిపించింది

  5. ఏపీ మున్సిపల్ ఎన్నికలు: నామినేషన్ల గడువుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

  6. నకిలీ పోస్టల్ స్టాంపులతో అమెరికాకు రూ.100 కోట్ల నష్టం కలిగించిన పాక్ పౌరుడి అరెస్ట్

    అమెరికా, పాకిస్తాన్,
    ఫొటో క్యాప్షన్, నకిలీ పోస్టేజ్ స్టాంపులతో అమెరికాకు వంద కోట్లకుపైగా నష్టం కలిగించిన పాకిస్తానీ అరెస్టు

    నకిలీ పోస్టల్ స్టాంపులను విక్రయించే వ్యాపారాన్ని నడుపుతున్నాడనే ఆరోపణలపై పాకిస్తాన్ సైబర్ క్రైమ్ ఏజెన్సీ ఒక వ్యక్తిని అరెస్టు చేసింది.

    ఈయన చేసిన మోసం కారణంగానే యూఎస్ పోస్టల్ సర్వీస్‌కు 126 మిలియన్ (119 కోట్ల రూపాయలు) డాలర్ల నష్టం వాటిల్లిందని ఆరోపణలు ఉన్నాయి.

    నిందితుడిని 33 ఏళ్ల ఫహీమ్ అక్రమ్‌గా గుర్తించారు. ఈయన ఒక నకిలీ వెబ్‌సైట్ ద్వారా యూఎస్ వినియోగదారులకు నకిలీ పోస్టల్ స్టాంపులు, షిప్పింగ్ లేబుల్‌లను విక్రయించినట్లు అభియోగాలు ఉన్నాయి.

    యూఎస్ ప్రాసిక్యూటర్ల ప్రకారం, ఫహీమ్ అక్రమ్ 2023 నుంచి లేబుల్స్‌బ్యాంక్‌ డాట్ కామ్ అనే వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. ఈ వెబ్‌సైట్ ద్వారా నకిలీ యూఎస్ పోస్టల్ స్టాంపులు, షిప్పింగ్ లేబుళ్లను విక్రయించారనే ఆరోపణలతో అధికారులు ఆ వెబ్‌సైట్‌ను మూసివేశారు.

    ఫ్లోరిడాలోని ఒక ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ గత నెలలో అక్రమ్‌పై అభియోగాలు మోపింది. ఆయన గత కొన్నేళ్లుగా వేల మంది అమెరికన్ వినియోగదారులకు 5 మిలియన్లకు పైగా నకిలీ షిప్పింగ్ లేబుళ్లను విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

    ఈ నెల ప్రారంభంలో, యూఎస్ పోస్టల్ సర్వీస్ ఆయనను పట్టుకోవడానికి తగిన సమాచారం ఇచ్చినవారికి 100,000 డాలర్ల వరకు బహుమతిని ప్రకటించింది.

  7. గరివిడి లక్ష్మి: ‘మూణ్నాలుగు జిల్లాలకు తెలిసిన నన్ను మొత్తం ప్రపంచానికి పరిచయం చేశారు’

  8. పుట్టిన రోజు సందడి తరువాత రాత్రి 9 గంటలకు అమ్మ పక్కన పడుకున్న ఆరేళ్ల పాప తెల్లారేసరికి మాయమైంది.. 8 రోజులైనా దొరకని ఆచూకీ

  9. కనిగిరి: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వచ్చిన మహిళ ఎందుకు ఏడ్చారు? మరో మహిళ పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకున్నారు?

  10. హైదరాబాద్: 1000 మందితో సెక్స్ చాటింగ్.. 82 మంది న్యూడ్ వీడియోలు, ఫోటోలు సేకరించిన ‘మహిళ’.. కానీ 'ఆమె' చివరికి 'అతడు' అని ఎలా తెలిసింది?

  11. ఫ్రాన్స్‌లోని పరిస్థితికి వలసదారులే కారణమని ట్రంప్ ఆరోపణ

    ఫ్రాన్స్, డోనల్డ్ ట్రంప్, అమెరికా, పారిస్, యూరప్,
    ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లోని పరిస్థితికి వలసదారులే కారణమని ట్రంప్ ఆరోపించారు

    ఫ్రాన్స్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణలకు వలసదారులు, జిహాదీలు, కమ్యూనిస్టులే కారణమని ట్రంప్ ఆరోపించారు.

    కాన్సాస్‌లోని విచిటాలో జరిగిన ఒక ప్రచార సభలో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఫ్రాన్స్‌లో కొనసాగుతున్న ఘర్షణల గురించి ప్రస్తావించారు. రాబోయే మధ్యంతర ఎన్నికల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. అమెరికాలో అలాంటి పరిస్థితులు రాకుండా నివారించాలని మద్దతుదారులకు సూచించారు.

    ఐరోపా వామపక్ష నాయకులు "పాశ్చాత్య విలువలను దెబ్బతీసే" వలస విధానాలను అనుసరిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఐరోపాలో జరిగిన తప్పులు జరగొద్దని అన్నారు.

    "పశ్చిమ దేశాలతో ఏమాత్రం సంబంధం లేని మూడో ప్రపంచ దేశాల వలసదారులను ప్రపంచ వామపక్షం ఐరోపాకు తీసుకువస్తోంది. వారు ఫ్రాన్స్‌లోని ప్రతి విషయాన్నీ ద్వేషిస్తారు. వారు ఆ దేశాన్ని నాశనం చేస్తున్నారు. మన దేశానికి అలా జరగనివ్వం," అని ట్రంప్ అన్నారు.

    విలేకరులతో మాట్లాడుతూ, దేశ సరిహద్దులను మూసివేయడం గురించి తాను ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఇప్పటికే హెచ్చరించినట్లు ట్రంప్ చెప్పారు.

    "ఫ్రాన్స్‌లో జరుగుతున్నది పాఠశాలల వల్లనో లేదా మరే ఇతర కారణం వల్లనో కాదు. అది వలసల వల్లే," అని ట్రంప్ అన్నారు.

  12. ‘భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.. మనం అప్రమత్తంగా ఉండాలి’ - మోహన్ భగవత్

  13. దేశవ్యాప్తంగా దసరా ఉత్సవాలు.. ఫోటోల్లో

  14. ‘‘నన్ను బలవంతంగా టాయ్‌లెట్‌లోకి లాక్కెళ్లాడు, నేను కళ్లు మూసుకుని అక్కడ లేననుకున్నా’’

  15. దసరా: మీకు పాలపిట్ట కనిపించిందా?

  16. అమిలీయా ఇయర్‌హార్ట్: 90 ఏళ్ల కిందట ప్రపంచాన్ని చుట్టిరావాలని బయల్దేరిన ఈ మహిళ ఎలా అదృశ్యమయ్యారు, ఈ మిస్టరీని ఛేదిస్తారా?

  17. భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా

    క్రికెట్, భారత జట్టు, బీసీసీఐ
    ఫొటో క్యాప్షన్, ప్రజ్ఞాన్ ఓజా

    అజిత్ అగార్కర్ స్థానంలో ప్రజ్ఞాన్ ఓఝానుచీఫ్ సెలెక్టర్‌గా బీసీసీఐ నియమించింది.

    భారత మాజీ క్రికెటర్ రమేశ్ పొవార్‌ను పురుషుల క్రికెట్ జట్టు కొత్త సెలెక్టర్‌గా నియమించింది.

    అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ), పురుషుల సెలక్షన్ కమిటీ సభ్యుని నియామకం కోసం ఎంపిక ప్రక్రియను పూర్తి చేసిందని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

    దరఖాస్తుదారుల పత్రాలను పరిశీలించి, బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించిన అనంతరం రమేశ్ పొవార్ పేరును ఏకగ్రీవంగా సిఫార్సు చేసినట్టు తెలిపింది.

    పురుషుల సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ చేసిన సేవలను, ఆయన నిబద్ధతను, కృషిని బీసీసీఐ ప్రశంసించింది.

    2023జూలైలో అగార్కర్‌ చీఫ్ సెలక్టరయ్యాడు.

    అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ప్రాతిపదిక ఆధారంగా ప్రజ్ఞాన్ ఓఝా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా ఉంటాడని బీసీసీఐ తెలిపింది.

    రమేశ్ పొవార్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో భారత్ తరఫున రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడాడు. ఆ తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టుతో పాటు ముంబై, గుజరాత్‌ జట్లకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో బౌలింగ్ కోచ్‌గా కూడా సేవలందించాడు.

  18. కొలంబస్ కన్నా ముందే అమెరికాను చేరుకున్న వైకింగ్స్ ఎవరు?

  19. పారా ఆసియా క్రీడలు: ఒకే ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం

    పారా ఆసియా క్రీడలు
    ఫొటో క్యాప్షన్, అవని లేఖరా(ఎడమ), మోనా అగర్వాల్(కుడి)(ఫైల్ ఫోటో)

    జపాన్‌లోని నాగోయాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత షూటర్ మోనా అగర్వాల్ స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని లేఖరా రజత పతకం సాధించింది.

    ఆర్2 మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్‌లోని ఎస్‌హెచ్1 విభాగంలో ఇద్దరూ ఈ ఘనతను సాధించారు. ఫైనల్‌లో ఇద్దరు షూటర్ల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

    మోనా 250.0 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, అవని 249.6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

    దక్షిణ కొరియాకు చెందిన యున్రి లీ 227.9 పాయింట్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

    ఈ ఘనత సాధించినందుకు ఇద్దరు భారత షూటర్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అభినందించింది.

  20. సల్మాన్ నుంచి టైగర్ దాకా.. బాలీవుడ్ నటులపై దాడులతో ఆందోళన