అనకాపల్లి పుష్ప: ‘ఔను. కాబోయే భర్త గొంతు కోశా.. ఎందుకంటే..’
కాబోయే భర్త గొంతు కోసిన కేసులో నిందితురాలైన యువతి పుష్పని బుచ్చెయ్యపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘‘నిన్న బండిపై నుండి పడ్డామని చెప్పిన పుష్ప ఈరోజు నేరం అంగీకరించింది. కాబోయే భర్త రామునాయుడు గొంతును తానే కోసినట్లు ఒప్పుకుంది’’ అని బుచ్చయ్యపేట పీఎస్ ఎస్ఐ రామకృష్ణ బీబీసీతో చెప్పారు.
లైవ్ కవరేజీ
వరికూటి రామకృష్ణ
తుపాన్లు ఎక్కువవుతున్నాయా, లేక వాటి తీవ్రత పెరుగుతోందా? తుపాను, హరికేన్, టైఫూన్ మధ్య తేడా ఏమిటి?
కాకినాడ తీరంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం

ఫొటో సోర్స్, @APSDMA
ఫొటో క్యాప్షన్, కాకినాడ తీరంలో గల్లంతైన మత్స్యకారులు సురక్షితం కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతంలో మత్స్యకారులకు చెందిన బోటు మంగళవారం బోల్తా పడింది.
ఈ ఘటనలో గల్లంతైన మత్స్యకారులను రెస్క్యూ సిబ్బంది కాపాడి ఒడ్డుకు చేర్చారు.
తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన ముగ్గురు మత్స్యకారులు వేటకు వెళ్లారని.. వారు వెళ్తున్న బోటు సముద్రంలో బోల్తా పడడంతో వారంతా ఈదుకుంటూ వెళ్లి హోప్ ఐలాండ్‌కు చేరుకున్నారని అధికారులు చెప్పారు.
దీనికి సంబంధించిన సమాచారం మత్స్యశాఖ, ఆర్టీజిఎస్, విపత్తుల నిర్వహణ సంస్థలకు చేరింది.
వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది 10 బోట్ల సహాయంతో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. చివరకు ఇవాళ వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
‘గత 30 ఏళ్లలో ఇంత తీవ్రమైన గాలులు చూడలేదు’.. అర్నబ్ తుపాను తీవ్రతను వివరించిన 88 ఏళ్ల వృద్ధుడు
అండమాన్‌కు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించిన ఐఎండీ

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, అండమాన్‌కు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించిన ఐఎండీ దక్షిణ అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాలపై అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని ఐఎండీ పేర్కొంది.
ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది.
దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న అండమాన్ & నికోబార్ దీవులపై ప్రభావం చూపుతుంది. మరో 24 గంటల్లో ఇది వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించిన అర్నబ్ తుపాను ఇప్పుడు అల్పపీడనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్, దాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఈశాన్య తెలంగాణ ప్రాంతాల మీదుగా గంటకు 22 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపు కదిలుతోంది.
గురువారం ఉదయం 5.30 గంటలకు, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఆనుకొని ఉన్న దక్షిణ ఒడిశా వద్ద కేంద్రీకృతమై ఉంది.
ఇది జగదల్పూర్ (ఛత్తీస్‌గఢ్)కు పశ్చిమాన సుమారు 20 కిలోమీటర్లు, భవానీపట్నానికి (ఒడిశా) నైరుతి దిశలో 170 కిలోమీటర్లు, టిట్లాగఢ్ (ఒడిశా)కు నైరుతి దిశలో 210 కిలోమీటర్లు, రాయ్‌పూర్‌కు దక్షిణాన 250 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇది ఉత్తరం వైపు కదులుతూ సాయంత్రానికి బలహీనపడి స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
ప్రపంచ పర్యటనకు క్రూయిజ్‌లో తీసుకెళ్లారు.. చమురు ధరలను భరించలేమంటూ సముద్రంలోనే నిలిపేశారు
జియో: చౌక ఇంటర్నెట్ కాలం ముగియనుందా? మొబైల్ రీచార్జ్ ధరలు పెరుగుతాయా
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

ఫొటో సోర్స్, @APSDMA
ఫొటో క్యాప్షన్, తుపాను కారణంగా అనేక చోట్ల వరి పంట నేలవాలింది. అర్నబ్ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం పర్యటించనున్నారు.
మధ్యాహ్నం కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరులో పంటలు పరిశీలిస్తారు. అక్కడే రైతులతో మాట్లాడుతారు. అనంతరం తుపాను షెల్టర్లలో ఆశ్రయం పొందుతున్న ముంపు బాధితులతో మాట్లాడనున్నారు.
అంతకంటే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను కారణంగా ఇళ్లు, పంటలు, దుకాణాలు,ఇతర ఆస్తులు నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం- సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరిన బాధితులకు 25కిలోల బియ్యం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు.
చేనేత కార్మికులు, మత్స్యకారులకు 50 కిలోల బియ్యంతోపాటు కిలో చొప్పున ఉల్లి, వంటనూనె, కందిపప్పు అందిస్తామని ప్రకటించారు. షెల్టర్ క్యాంపుల్లో ఆశ్రయం పొందిన వారికి రూ.1,000చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.
పంట నష్టాన్ని మినహాయించి,ఇతర నష్టాలకు సంబంధించి అర్హులైన బాధితులకు గురువారం నుంచే ఆర్థిక సాయం అందించేలా చర్యలు చేపడతామని చెప్పారు. సుమారు 30వేల మంది క్షేత్రస్థాయి అధికారులు,సిబ్బందితో టెలి కాన్ఫరెన్సుల ద్వారా నిరంతరం సమన్వయం చేసుకున్నామని తెలిపారు.

ఫొటో సోర్స్, @APSDMA
ఫొటో క్యాప్షన్, కాసేపట్లో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోనసీమలో అర్నబ్ తుపాను బీభత్సం

ఫొటో క్యాప్షన్, కోనసీమలో అర్నబ్ తుపాను బీభత్స దృశ్యాలు కోనసీమలో అర్నబ్ తుపాను బీభత్సం సృష్టించింది.
నేలకొరిగిన కొబ్బరి చెట్లు, విద్యుత్ స్తంభాలు, ధ్వంసమైన ఇళ్లు ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు.
డా.బీఆర్ అంబేడ్కర్ జిల్లాలో పలుచోట్ల భారీ గాలులతో కూడిన వర్షాలు కురిశాయి.
మంగళవారం రాత్రి బాసర్లపూడిలో ఓ ఇంటి పైకప్పు ఎగిరిపోయింది.
యానాం నుంచి అమలాపురం వెళ్లే మార్గంలో కొబ్బరిచెట్లు నేలకొరిగాయి.
పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ అధికారులు సరఫరా పునరుద్ధరించే పనులు చేపట్టారు.
పశ్చిమగోదావరి జిల్లాల్లో సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ- మంత్రి గొట్టిపాటి రవి ప్రకటన

ఫొటో సోర్స్, @ravi_gottipati
ఫొటో క్యాప్షన్, పశ్చిమగోదావరి జిల్లాల్లో సాయంత్రానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అర్నబ్ తుపాను ప్రభావంతో పశ్చిమగోదావరి జిల్లాలో దెబ్బతిన్న పంటల నష్టాలను తక్షణమే అంచనా వేసి, బాధిత రైతులకు అవసరమైన సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్టు మంత్రిగొట్టిపాటి రవి ప్రకటించారు.
తుపాను సహాయక చర్యలు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై పశ్చిమగోదావరి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, దెబ్బతిన్న 3,700 విద్యుత్ స్తంభాల మరమ్మతులు చేపట్టి, విద్యుత్ అంతరాయం ఏర్పడిన సుమారు 400 గ్రామాలకు గురువారం సాయంత్రంలోగా సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు ఆటంకం కలగకుండా చూడటంతోపాటు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలకు నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, బాధితులకు తక్షణ సహాయం అందిస్తూ సాధారణ పరిస్థితులు త్వరగా నెలకొనేలా అన్ని శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేసినట్టు తెలిపారు.
అర్నబ్ ప్రభావంతో ఒడిశాలోనూ వానలు

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, అర్నబ్ ప్రభావంతో ఒడిశాలోనూ వానలు అర్నబ్ తుపాను ప్రభావం ఒడిశాపై కూడా ఉంది. అందుకే అక్కడక్కడ ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
ఒడిశా రాష్ట్రంలో రాయగడ జిల్లా కలెక్టర్ అశుతోష్ కులకర్ణి ఏఎన్ఐతో మాట్లాడుతూ... గత 24 గంటల వ్యవధిలో రాయగడలో 40 మిమీ వర్షపాతం నమోదైందని తెలిపారు.
ఇది ఊహించిన దానికంటే చాలా తక్కువని పేర్కొన్నారు.
ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పెద్దగా ప్రమాదమేమీ లేదని, అయినప్పటికీ, అత్యంత అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు.
రాయగడలో ఇంకా కొంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణలోనూ వర్షాలు

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, తెలంగాణలోనూ వర్షాలు పడే అవకాశం తెలంగాణలో వాతావరణం పరిశీలిస్తే పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్లోనివాతావరణ శాఖ తెలిపింది.
భద్రాద్రి గూడెం, ఖమ్మం, సూర్యపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో గంటలకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది.
‘తుపాను బలహీన పడినా ఇంకా ప్రమాదం ఉంది.. ఫ్లాష్ ఫ్లడ్స్ రావొచ్చు’

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లోనూ అధికారులు అప్రమత్తం తుపాను బలహీనపడినా దాని ప్రభావం ఇంకా ఆంధ్రప్రదేశ్‌పై ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఒకటి,రెండు చోట్ల భారీ వర్షాలు మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కురిసిన భారీ వర్షాలతో ప్లాష్ ఫ్లడ్ వచ్చే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పొంగిపోర్లే వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.
సహాయ చర్యల్లో 16 ఎన్డీఆర్ఎఫ్, 11 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నట్లు తెలిపారు.
అర్నబ్: తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిశాలో జోరు వానలు

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, కొనసాగుతున్న అర్నబ్ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అర్నాబ్ తుపాను ప్రభావంతో వర్షాలు పడుతున్నాయి. తుపాను కారణంగా జరిగిన విధ్వంసంపై ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను పూర్తిగా బలహీనపడిందని ఐఎండీ పేర్కొంది.
గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో దాదాపు ఉత్తరం వైపు కదిలి తీవ్ర అల్పపీడనంగా మారింది.
ఇది అక్టోబర్ 28వ తేదీ రాత్రి 11.30 గంటలకు ఆంధ్రప్రదేశ్, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఈశాన్య తెలంగాణ ప్రాంతాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉందని తెలిపింది.
ఇది ఇవాళ ఉదయానికి వాయుగుండంగా, సాయంత్రానికి అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
యుక్రెయిన్: ప్రజలు కలుపు మొక్కలు వండుకొని తిన్న ప్రాంతంలో కాల్పుల విరమణ
కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II అవార్డు ప్రదానం

ఫొటో సోర్స్, PTI
ఫొటో క్యాప్షన్, కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II అవార్డు ప్రదానం కాక్‌పిట్‌లో జరిగిన దాడిని ధైర్యంగా ఎదిరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన ఇండియన్ కెప్టెన్ స్మిత్ మచ్చర్‌ను, ప్లైదుబై సిబ్బందిని యూఏఈ అధ్యక్షుడు సత్కరించారు.
దుబయ్-టెల్ అవీవ్ విమానం ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికులను రక్షించడానికి చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్, ఫ్లైదుబయ్ సిబ్బందికి ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II పురస్కారాన్ని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ప్రదానం చేశారు.
దుబయ్ క్రౌన్ ప్రిన్స్, ఉప ప్రధానమంత్రి, రక్షణమంత్రి షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ పతకాలను అందజేశారని, సిబ్బందిని ప్రశంసించారని దుబయ్ మీడియా కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
Cyclone Arnab: 'పీకలదాకా నీరొచ్చేసింది.. ఇల్లొదిలి వచ్చేశాం'
అర్నబ్ తుపాను ధాటికి ఏపీలో అయిదుగురి మృతి
చెట్లను పెకిలించి, పొలాలను ముంచేసి.. గతంలో ఏపీని వణికించిన తుపానులు ఇవే..
జుల్ఫికర్ అలీ భుట్టో: ‘నేను భారత పౌరుడిని’ అంటూ బెనజీర్ భుట్టో తండ్రి భారతీయ కోర్టుల్లో ఎందుకు పోరాడారు?
