ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గింపు
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీ రేటును ప్రభుత్వం తగ్గించింది. 2021-22 సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.1 శాతంగా ఆమోదించింది. గత నాలుగు దశాబ్దాలలో ఇదే కనిష్టం.
లైవ్ కవరేజీ
రాహుల్ గాంధీ ధర్నా: మోదీ ఇంటి నుంచి ఛత్రసాల్ స్టేడియం వరకు.. మంగళవారం రాత్రి ఏం జరిగింది?
నమస్తే, బీబీసీ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.
దేశంలో, ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ వార్తలను ఎప్పటికప్పుడు ఇక్కడ అప్టేడ్ చేస్తాం.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
బీబీసీ న్యూస్ తెలుగు వెబ్‌సైట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొన్ని ముఖ్యమైన వార్తలను ఇక్కడ చదవొచ్చు.
ఛత్రసాల్ స్టేడియానికి రాహుల్ గాంధీ, అఖిలేష్ సహా పలు ప్రతిపక్ష నేతల తరలింపు, కొందరి విడుదల

ఫొటో సోర్స్, ANI
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఇతర విపక్ష నేతలను పోలీసులు మొదట ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు.
లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నివాసం ముందు వీరంతా ధర్నా చేస్తుండగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. లోక్ కల్యాణ్ మార్గ్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్న విపక్ష నేతలలో కొందరిని ఈ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఛత్రసాల్ స్టేడియంలో కాసేపు ఉంచిన తర్వాత పోలీసులు రాహుల్ గాంధీని విడిచిపెట్టారు. తర్వాత ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి ఒక వాహనంలో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
విద్యార్థులపై ప్రభుత్వం వ్యవహరించిన తీరును సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తప్పుబట్టారు. "ప్రభుత్వం విద్యార్థుల డిమాండ్లను అంగీకరించాలి. విద్యార్థులు, యువతపై ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరించింది. వారిని కొట్టారు, తలలు పగలగొట్టారు.. చివరికి విద్యార్థినుల బట్టలు కూడా చింపేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సమయంలో, ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం నుంచి ఆశించే ప్రవర్తన ఇదేనా? మేం ఈ అంశాన్ని సభలో లేవనెత్తుతాం" అని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. "మన దేశ భవిష్యత్తైన పిల్లల మాట వినడానికి ఉన్న ఇబ్బంది ఏంటి? వారి డిమాండ్ చాలా న్యాయమైంది. ప్రజాప్రతినిధులుగా వారి గొంతుకను వినిపించడం, బలోపేతం చేయడం మా బాధ్యత. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రాథమిక హక్కు. ఎక్కడ అవసరమైతే అక్కడ మా గొంతు వినిపిస్తాం. మా డిమాండ్ చాలా స్పష్టంగా ఉంది. మొదటి నుంచి మేం ఒకే మాటపై ఉన్నాం. కుప్పకూలిన విద్యా వ్యవస్థను సరిచేయాలి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరగాలి. విద్యా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక బిల్లును ఎందుకు తీసుకురావడం లేదు?" అని తెలిపారు.
"ప్రభుత్వం నిన్న తన క్రూరత్వాన్ని ప్రదర్శించింది. ఈ రోజు కూడా అదే క్రూరత్వాన్ని పునరావృతం చేసింది. వీరు పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేకులు. జితేంద్ర సింగ్ మాకు నోటీసు ఇవ్వమని, ఆ తర్వాత చర్చ గురించి ఆలోచిస్తామని చెప్పారు; కానీ మాకు అది ఇష్టం లేదు. మేం నిన్న నోటీసు ఇచ్చాం, ఈ రోజు కూడా ఇచ్చాం" అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.
పోస్ట్ X స్కిప్ చేయండిX ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గాంధీ: 73 ఏళ్ల వయసులో 21 రోజుల నిరాహార దీక్ష: ఇక బతకరని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం
నూట పదహార్లు: పెళ్లిళ్లలో చదివింపులు, దాన ధర్మాలు, విరాళాలు ఇలా ఎందుకిస్తారు?
ప్రధాని నివాసం వద్ద ధర్నాకు దిగిన రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి భేటీ

ఫొటో సోర్స్, @INCIndia
ఫొటో క్యాప్షన్, దిల్లీలోని '7 లోక్ కళ్యాణ్ మార్గ్' వద్ద రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ఎంపీలు దిల్లీలోని ప్రధానమంత్రి నివాసం '7 లోక్ కల్యాణ్ మార్గ్' వెలుపల రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నాకు దిగారు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోంమంత్రి తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కాగా, ప్రధాని నివాసం వద్ద ధర్నా చేస్తున్న రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలను కలవడానికి కొద్దిసేపటి కిందట కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అక్కడకు చేరుకున్నారు. ధర్నా స్థలం నుంచి వస్తున్న దృశ్యాలలో జితేంద్ర సింగ్, రాహుల్ గాంధీతో మాట్లాడుతుండటం కనిపించింది.
రాహుల్ గాంధీ 'ఎక్స్'లో పోస్ట్ చేస్తూ "నిన్న విద్యార్థులపై జరిగిన క్రూరమైన దాడికి సంబంధించి ప్రధాని మోదీ నుంచి సమాధానం రాబట్టేందుకు మేం ఆయన ఇంటి వరకు మార్చ్ నిర్వహించాం. ప్రభుత్వం జవాబుదారీతనం వహించడానికి ఇష్టపడట్లేదు. పార్లమెంట్‌లో దీనిపై చర్చను కూడా కోరుకోవట్లేదు. దేశ యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోంమంత్రి రాజీనామా చేయాలి" అని తెలిపారు.
మరోవైపు, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనను కొనసాగిస్తోంది. సీజేపీ చేపట్టిన 'పార్లమెంట్ మార్చ్' పై సోమవారం లాఠీచార్జ్ జరిగింది. ఈ ఘటనలో పలువురు యువకులు గాయపడ్డారు.
ఈ నేపథ్యంలో, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొదటిసారి ఒక ప్రకటన చేశారు. అయితే, ఈ ప్రకటన ప్రధాని మోదీ నుంచి నేరుగా రాలేదు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ద్వారా వచ్చింది.
నీట్ పేపర్ లీకేజీపై తొలిసారి స్పందించిన ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Ajay Aggarwal/Hindustan Times via Getty Images
వర్షాకాల సమావేశాల రెండో రోజైన మంగళవారం.. ఎన్డీఏ ఎంపీలతో నిర్వహించిన 'మంగళ్ మిలన్'లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన నీట్ పేపర్ లీక్ అంశంపై ప్రభుత్వ వైఖరిని తెలియజేశారు.
సమావేశం అనంతరం, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రధానమంత్రి ప్రసంగం గురించి మీడియాకు తెలియజేశారు.
‘నీట్ పరీక్షకు సంబంధించి, అవకతవకలు జరిగినట్లు నివేదికలు అందిన వెంటనే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుందని, పదమూడు మందిని అరెస్టు చేసి జైలుకు పంపినట్లు ప్రధానమంత్రి చెప్పారు" అని కిరణ్ రిజిజు చెప్పారు.
‘విద్యార్థుల భవిష్యత్తుకు ప్రాధాన్యమిస్తూ పరీక్ష మళ్లీ నిర్వహించి, ఎలాంటి ఆలస్యం లేకుండా ఫలితాలను ప్రకటించామని ప్రధాని మోదీ అన్నారు. పేపర్ లీక్ వంటి సంఘటనలను నివారించడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు కూడా ఆయన తెలిపారు’ అని రిజిజు చెప్పారు.
పేపర్ లీక్ అంశంపై కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు తెలుపుతున్న సందర్భంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
'ఆడపిల్లలపై లాఠీ ఎత్తితే, నేను లాఠీ పడతా. కేసు పెట్టుకో'
సీజేపీ నిరసనలు: మద్దతుదారులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్.. పార్లమెంట్ దగ్గర ఏం జరిగింది?
హార్ముజ్‌పైనే పీటముడి.. నిలవని ఒప్పందం ఏం చెబుతోంది?
లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. సిరీస్ ఇంగ్లండ్ వశం
‘మా కుటుంబాన్ని ఆదుకోవడానికి అక్క లండన్‌కు వెళ్లింది, కానీ ఆమెకు జరిగింది మరెవరికీ జరగకూడదు’
రోహిత్ శర్మ: హిట్‌మ్యాన్ 'రిటైర్మెంట్' ఊహాగానాలకు బీజం పడింది ఎక్కడ?
కశ్మీర్: స్కూల్ పుస్తకాల్లో 'వేర్పాటువాదులను' కీర్తించేలా పాఠాలు ఉన్నాయా, అధికారుల తాజా ఆదేశాలపై చర్చ ఏంటి?
గుంటూరులో నడిరోడ్డుపై మహిళను వివస్త్రగా చేసి దాడి, 9 మంది అరెస్ట్
నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్: ఉత్తమ నటులుగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్, యామీ గౌతమ్.. ఉత్తమ తెలుగు చిత్రం - కమిటీ కుర్రోళ్లు
సోనమ్ వాంగ్‌చుక్ : ఆస్పత్రిలో ఎలా ఉన్నారు, డాక్టర్లు ఏం చెబుతున్నారు?
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలు.. ఎలక్ట్రిక్, డీజిల్ రైళ్లతో పోలిస్తే దీని ప్రత్యేకతలేంటి?
విక్రమ్ -1 : నింగిలోకి దూసుకెళ్లిన భారత ‘తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్’.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..
