లైవ్ , మనీషా భన్వాలా: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళ రికార్డు

ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 59 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా మనీషా భన్వాలా నిలిచారు. కజకిస్థాన్ రాజధాని అస్తానాలో శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో అమెరికాకు చెందిన అబిగైల్ నెట్‌ను 8-6 తేడాతో ఓడించారు.

సారాంశం

  • ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా మనీషా భన్వాలా నిలిచారు.
  • కజకిస్థాన్ రాజధాని అస్తానాలో శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో అమెరికాకు చెందిన అబిగైల్ నెట్‌ను 8-6 తేడాతో ఓడించారు.
  • రష్యా వైమానిక దాడులు తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో యుక్రెయిన్‌కు 500 పేట్రియాట్ క్షిపణుల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపింది.
  • శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.
  • శుక్రవారం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.ఈ రాకెట్ ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.

లైవ్ కవరేజీ

  1. జీఎస్‌ఎల్‌వీ ద్వారా కక్ష్యలోకి చేరిన ఎన్‌వీఎస్‌-03 నావిగేషన్ ఉపగ్రహం

    శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్
    ఫొటో క్యాప్షన్, తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్‌వీఎస్-03 మూడో ఉపగ్రహం.

    శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో ప్రకటించింది.

    శుక్రవారం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.ఈ రాకెట్ ఎన్‌వీఎస్-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది.

    జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్18/ఎన్‌వీఎస్-03 ప్రయోగం విజయవంతం కావడంతో శ్రీహరికోటలోనిసతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇస్రో శాస్త్రవేత్తలుఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

    తదుపరి తరం నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థలో ఎన్‌వీఎస్-03 మూడో ఉపగ్రహం. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్ ద్వారా అందించే నావిగేషన్ సేవలను నిరంతరాయంగా కొనసాగించేందుకు దీన్ని రూపొందించారు.

    దేశానికి స్థానం, నావిగేషన్, సమయ నిర్ధరణ సేవలను స్వతంత్రంగా పొందే అవకాశం కల్పించే వ్యూహాత్మక ఉపగ్రహం ఇదని ఇస్రో చీఫ్ డాక్టర్ వి. నారాయణన్ అన్నారు.

    నావిగేషన్ ఉపగ్రహాలను సాధారణ ప్రజలకు ఉపయోగపడే పనుల కోసం కూడా వినియోగిస్తారని ఆయన తెలిపారు. రైళ్లను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయడంతో పాటు వాహనాలు, సముద్ర నౌకల కదలికలను పర్యవేక్షించేందుకు ఇవి ఉపయోగపడతాయని చెప్పారు. 'వన్ నేషన్ వన్ టైమ్' ప్రాజెక్టులోనూ ఈ ఉపగ్రహం కీలక భాగమని వివరించారు.

    'గగన్' వ్యవస్థతో కలిసి నావిగేషన్ సేవలు అందించడం ద్వారా ప్రపంచ నావిగేషన్ వ్యవస్థలో భారత్ తన వంతు పాత్ర పోషిస్తోందని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు.

  2. మనీషా భన్వాలా: ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళ రికార్డు

    మనీషా భన్వాలా
    ఫొటో క్యాప్షన్, ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా మనీషా నిలిచారు.

    ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో 59 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలిచి, ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా మనీషా భన్వాలా నిలిచారు.

    కజకిస్థాన్ రాజధాని అస్తానాలో శుక్రవారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో అమెరికాకు చెందిన అబిగైల్ నెట్‌ను 8-6 తేడాతో ఓడించారు.

    ఒలింపిక్స్‌లో లేని ఈ వెయిట్ కేటగిరీలో మనీషా తన పోరును ప్రీ క్వార్టర్ ఫైనల్‌తో ప్రారంభించారు. ఈ దశలో కెనడాకు చెందిన లారెన్స్ బ్యూత్రెగార్డ్‌ను విక్టరీ బై ఫాల్ పద్ధతిలో ఓడించారు.

    క్వార్టర్ ఫైనల్‌లో మంగోలియాకు చెందిన బొలోర్తుయా ఖురెల్ఖూను 6-0 తేడాతో ఓడించారు. ఆ తర్వాత సెమీఫైనల్‌లో స్థానిక రెజ్లర్ అల్టిన్ షగయేవాను సాంకేతిక ఆధిక్యంతో ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. దీంతో హరియాణాకు చెందిన మనీషా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో స్వర్ణ పతకం సాధించారు.

    ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన రెండో భారత రెజ్లర్‌గా మనీషా నిలిచారు. అంతకుముందు 2010లో మాస్కోలో జరిగిన పోటీల్లో సుశీల్ కుమార్ 66 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించారు.

    ప్రస్తుత చాంపియన్‌షిప్‌లో మహిళల విభాగంలో పతకాలు సాధించిన నాలుగో భారత రెజ్లర్ మనీషా. ఆమె కంటే ముందు నీలం సిరోహి (50 కిలోలు), కాజల్ ధోచక్ (76 కిలోలు) రజత పతకాలు సాధించగా, తనూ శర్మ (72 కిలోలు) కాంస్య పతకం గెలుచుకున్నారు.

  3. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీకి స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి