అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ,పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
దిల్లీ: అభిజిత్, సౌరవ్ దాస్, అశుతోష్‌లను విమానంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఫొటో సోర్స్, CJP
ఫొటో క్యాప్షన్, దిల్లీలో విమానం ల్యాండ్ అయిన వెంటనే సీజేపీ ప్రతినిధులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, సహ కన్వీనర్ అశుతోష్ రాంకా అలాగే సౌరవ్ దాస్‌లను పోలీసులు దిల్లీ ఎయిర్‌పోర్టులో విమానంలోనే అదుపులోకి తీసుకున్నారు.
ఈ సమయంలో అభిజిత్ దీప్కే మాట్లాడుతూ, తాను అరెస్టుకు భయపడనని, సిద్ధంగా ఉన్నానని తెలిపారు.
“దేశం ఏ దిశలో వెళ్తుందో చూడండి. విమానంలోనే మమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇలాంటిది ఇందిరా గాంధీ కూడా ఎప్పుడూ చేయలేదు. ఇది నిరంకుశత్వం, కానీ మేం వీటికి భయపడం” అన్నారు.
తమను అదుపులోకి తీసుకోవడానికి వచ్చిన పోలీసులతో అభిజిత్ దీప్కే, “నేను మీకు భయపడను, మేం అరెస్టుకు సిద్ధంగా ఉన్నాం” అని చెప్పారు.

ఫొటో సోర్స్, CJP
ఫొటో క్యాప్షన్, సీజేపీ ప్రతినిధులను విమానంలో అదుపులోకి తీసుకుంటున్న మహిళా పోలీసులు అభిజిత్, సౌరవ్ అలాగే అశుతోష్‌లను అదుపులోకి తీసుకోవడానికి మహిళా పోలీసులు ముందుకు వచ్చారు. దీనిపై దీప్కే, ఆయన సహచరులు పురుష పోలీసులను పంపాలని కోరారు.
కాగా, దిల్లీ పోలీసుల తీరు 'నిరంకుశమైనది'గా అభివర్ణించిన సీజేపీ, ముగ్గురు ప్రతినిధులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది. ఇది ప్రజల స్వేచ్ఛా సంచార హక్కును ఉల్లంఘించడమేనని సీజేపీ పేర్కొంది.
దీనికి ముందు ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, సీజేపీ లీగల్ అఫైర్స్ హెడ్ రత్నా సింగ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
జంతర్ మంతర్‌కు వస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు

ఫొటో సోర్స్, ANI Video grab
ఫొటో క్యాప్షన్, కొంతమంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దిల్లీలోని జంతర్-మంతర్‌కు వస్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకుంటున్నారు.
సీజేపీ నిరసనను దృష్టిలో ఉంచుకుని దిల్లీ రైల్వే స్టేషన్లు, హోటళ్లు, ప్రధాన సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. రైల్వే స్టేషన్లకు చేరుకుంటున్న ప్రయాణికులను, హోటళ్లలో బస చేస్తున్నవారిని తనిఖీ చేస్తున్నారు. అంతేకాకుండా నిరసనలో పాల్గొనడానికి దిల్లీకి చేరుకుంటున్న వారిపై కూడా పోలీసులు దృష్టి సారించారు.
జంతర్-మంతర్ వద్ద తలపెట్టిన నిరసనకు ముందే ఫిరోజ్ షా రోడ్డు, మండి హౌస్‌ల వద్ద రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) బలగాలను మోహరించారు. అలాగే దిల్లీ-నోయిడా సరిహద్దులో కూడా భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు.
నిరసన పిలుపు నేపథ్యంలో దక్షిణ జిల్లాతో పాటు మొత్తం దిల్లీలో సమగ్ర భద్రతా ఏర్పాట్లు చేశామని దక్షిణ దిల్లీ డీసీపీ అనంత్ మిట్టల్ తెలిపారు. అనధికార వ్యక్తులు దిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసులు తనిఖీల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు.
డీసీపీ అనంత్ మిట్టల్ వెల్లడించిన వివరాల ప్రకారం, నిరసన సమయంలో శాంతిభద్రతలను కాపాడటమే పోలీసుల ప్రథమ ప్రాధాన్యం. ఇందుకోసం వివిధ సరిహద్దుల్లో దాదాపు 12 పోలీసు పికెట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జిల్లా అంతటా అనేక చోట్ల పోలీసు పికెట్లను ఏర్పాటుచేశారు.

ఫొటో సోర్స్, ANI Video grab

ఫొటో సోర్స్, ANI Video grab
యూట్యూబర్ ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఫొటో సోర్స్, EPA/Shutterstock
ఫొటో క్యాప్షన్, యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సీజేపీ నిరసన నేపథ్యంలో యూట్యూబర్ ధ్రువ్ రాఠీని పోలీసులు శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు.
బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా తెలిపిన వివరాల ప్రకారం, ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఆయన సన్నిహితుడు, అలాగే గురుగ్రామ్ పోలీసులు ధ్రువీకరించారు. గురుగ్రామ్ సెక్టార్-56 నుంచి ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన సన్నిహితుడు తెలిపారు. పీటీఐ వార్తా సంస్థ కూడా రాఠీ అరెస్టు గురించి సమాచారం ఇచ్చింది.
అంతకుముందు, ధ్రువ్ రాఠీ శుక్రవారం రాత్రి సోషల్ మీడియాలో ఒక రీల్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఆయన ఇండియా గేట్ ఎదురుగా తిరుగుతూ కనిపించారు.
“నేను దిల్లీకి వచ్చాను. ప్రధానమంత్రి 50కి పైగా మెట్రో స్టేషన్లను మూసివేశారని, అనేక రైళ్లు, బస్సులను రద్దు చేశారని విన్నాను. నిరసన కారణంగా దిల్లీని లాక్‌డౌన్‌లో ఉంచుతున్నారు” అని ఆ వీడియోలో ధ్రువ్ రాఠీ అన్నారు.
“మోదీజీ ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మా నిరసనలో జనసంచారం ఉండదని ఒకవైపు మీ ఐటీ సెల్ చెబుతోంది. ఒకవేళ జనం రాకపోతే, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? మీరు భయపడ్డారని భావిస్తున్నాను. నిజానికి ప్రజలందరూ మేల్కొన్నారు” అన్నారు.
ఈ నిరసనలో పాల్గొనడానికి జంతర్ మంతర్ చేరుకుంటున్న పలువురు ఆందోళనకారులను కూడా దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
"రైలు ఎక్కి తనిఖీలు చేశారు, పోలీసుల నిర్బంధాలు చూస్తే భయమేస్తోంది"-తెలుగు రాష్ట్రాల యువకులు ఇంకా ఏం చెప్పారు?
దిల్లీ: జంతర్ మంతర్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత, కఠిన ఆంక్షలు

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, అనేక చిత్రాలలో బారికేడ్లు, భారీ పోలీసు బలగాలు అలాగే పోలీసు వ్యాన్‌లు కూడా కనిపిస్తున్నాయి కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శన నేపథ్యంలో జంతర్-మంతర్ అలాగే దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దిల్లీ పోలీసులు భారీగా భద్రతా బలగాలు ఏర్పాటు చేయడంతో పాటు, ఆంక్షలను కఠినతరం చేశారు.
పోలీసు బలగాలు, సెక్యూరిటీ ఫోర్సులు, పోలీసు వ్యాన్‌లు కనిపిస్తున్న కొన్ని ఫోటోలను ఏఎన్‌ఐ వార్తా సంస్థ విడుదల చేసింది.
సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనకు అనుమతి లభించలేదు. అయినా తాము జంతర్-మంతర్‌కు చేరుకుంటామని సీజేపీ నాయకులు చెబుతున్నారు. చరిత్ర సృష్టిస్తామని పార్టీ సహ కన్వీనర్ అశుతోష్ రాంకా శుక్రవారం రాత్రి పేర్కొన్నారు.
"ప్రియమైన కాక్రోచ్‌లు.. మనం ఇప్పటివరకు ఎంత దూరం ప్రయాణించామో తలచుకుంటే గర్వంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మనం కచ్చితంగా చరిత్ర సృష్టిస్తాం" అని అశుతోష్ రాంకా ఎక్స్ పోస్టులో తెలిపారు.
అలాగే, "ఒకటే గుర్తుంచుకోండి - చేతిలో రాజ్యాంగం, గుండెల్లో గాంధీ. ఏం జరిగినా మన చేయి ఎత్తరాదు. భారత్ మాతా కీ జై" అని రాశారు.
ఆయనతో పాటు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్, సామాజిక రాజకీయ కార్యకర్త యోగేంద్ర యాదవ్, ఐసా అధ్యక్షురాలు నేహా బోరా, ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ కూడా ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో సోర్స్, ANI

ఫొటో సోర్స్, ANI

ఫొటో సోర్స్, ANI
కాక్రోచ్ జనతా పార్టీ నిరసన నేపథ్యంలో 250కి పైగా రైళ్లు రద్దు

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, రైల్వే స్టేషన్ (ఫైల్ ఫోటో) కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన ప్రదర్శన నేపథ్యంలో, న్యూదిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే 250కి పైగా రైళ్లను అధికారులు రద్దు చేశారు.
పీటీఐ వార్తాసంస్థ కథనం ప్రకారం, అక్టోబర్ 9న మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఆయా ప్రారంభ స్టేషన్ల నుంచి బయలుదేరాల్సిన ప్యాసింజర్ రైళ్లను రైల్వేబోర్డు ఆదేశాల మేరకు రద్దు చేశారు.
అంతేకాకుండా, అక్టోబర్ 10న ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూదిల్లీ లేదా హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌కు చేరుకోవాల్సిన రైళ్లు కూడా రద్దయ్యాయి.
రైల్వే మాజీ అధికారులు, ప్రయాణికుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈ చర్యను తప్పుబట్టాయి.
"ఇంత భారీ సంఖ్యలో రైళ్లను రద్దు చేయడం ఆందోళనకారుల ముందు తలవంచడమే" అని రైల్వే బోర్డు మాజీ సభ్యుడు (ఇంజనీరింగ్) సుబోధ్ జైన్ పేర్కొన్నారు.
దేశంలోని ఏదైనా ప్రాంతంలో నిరసనలు లేదా ఉద్యమాల కారణంగా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో రైళ్లు రద్దు కావడం తన అనుభవంలో లేదని ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివ్ గోపాల్ మిశ్రా పీటీఐతో అన్నారు.
అకస్మాత్తుగా రైళ్లు రద్దు కావడం వల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
మరోవైపు, దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) కూడా 57 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను మూసివేసింది.
రష్యాతో డీజిల్ దిగుమతికి అమెరికా ఒప్పందం

ఫొటో సోర్స్, Anna Moneymaker/Getty Images
ఫొటో క్యాప్షన్, అమెరికా, ప్రపంచ మార్కెట్ల కోసం డీజిల్‌ను తక్షణమే సరఫరా చేయడానికి పుతిన్ అంగీకరించారని ట్రంప్ అన్నారు. ఇంధన ధరలను తగ్గించాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్న అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, రష్యా నుంచి అమెరికాకు డీజిల్ దిగుమతి చేసుకునే ఒప్పందాన్ని ప్రకటించారు.
అమెరికా, ప్రపంచ మార్కెట్ల కోసం 3 లక్షల టన్నుల డీజిల్‌ను తక్షణమే సరఫరా చేయడానికి పుతిన్ అంగీకరించారని, నవంబర్‌లో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత మరో మిలియన్ టన్నులు ఇస్తారని ట్రంప్ తెలిపారు.
శుక్రవారం నాటి ఈ నిర్ణయంపై యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియెన్‌స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పుతిన్‌కు బహుమతి అని, అంతం కావాల్సిన యుద్ధాన్ని పొడిగించే పెట్టుబడిగా అభివర్ణించారు.
ఈ ఒప్పందంలో భాగంగా రష్యన్ డీజిల్ ఎగుమతులపై ఆంక్షలను అమెరికా ట్రెజరీ ఏప్రిల్ 7 వరకు ఎత్తివేసింది. అయితే, అమెరికా బ్యాంకుల్లో ఉన్న మిగతా రష్యన్ ఆస్తులపై ఆంక్షలు అలాగే ఉన్నాయి.
యుక్రెయిన్ దాడుల కారణంగా దెబ్బతిన్న రిఫైనరీల పనితీరును బట్టి, త్వరలోనే మరో 3 మిలియన్ టన్నుల రష్యన్ డీజిల్ సరఫరా అవుతుందని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
జంతర్ మంతర్ నిరసన: ముందస్తు అరెస్టులు, భారీ సంఖ్యలో కేంద్ర బలగాలు
గుడ్ మార్నింగ్
బీబీసీ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం,
నేను బీబీసీ ప్రతినిధి వద్ది ప్రభాకర్. మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.
నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
ఈ లైవ్ పేజీని ఈ రోజుకు ముగిస్తున్నాం.
బీబీసీ న్యూస్ తెలుగు వెబ్సైట్లో కొన్ని ముఖ్యమైన వార్తాంశాలను చదవాలంటే ఈ కింది లింక్‌లను క్లిక్ చేయండి.
‘మోదీ సూత్రధారి.. అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ పాత్రధారులు.. రాష్ట్రపతి కూడా దీన్ని ఖండించలేదు: రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన అనంతరం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
‘ఓట్లు చోరీకి గురవుతున్నాయని దేశమంతటికీ తెలుసు. నరేంద్ర మోదీ దీనికి సూత్రధారి. అమిత్ షా, జ్ఞానేశ్ కుమార్ దీన్ని అమలు చేస్తున్నారు. ఈ నిజాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు ఖండించలేదు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఇండియా కూటమి నాయకులు రాష్ట్రపతిని కలిసి మెమొరాండం సమర్పించినట్లు చెప్పారు. దేశంలో ఓట్ల చోరీ గురించి, తాము చేస్తున్న నిరసనల గురించి తెలిపామన్నారు. అన్ని వివరాలూ రాష్ట్రపతికి చెప్పామన్నారు. ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్రపతిని కోరామన్నారు.
ఓట్ల చోరీకి ఆధారాలు చూపించాలని రాష్ట్రపతి అడిగారని, త్వరలో సమర్పిస్తామని ఖర్గే చెప్పారు.
ఫ్రాన్స్ ఆందోళనలు: విద్యార్ధుల కోపానికి కారణమేంటి?
రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లిన విపక్ష ఎంపీలు

ఫొటో సోర్స్, ANI
ఫొటో క్యాప్షన్, రాహుల్ గాంధీ ఇండియా కూటమి ఎంపీలు శుక్రవారం రాత్రి భేటీ అయిన తరువాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశానికి బయల్దేరారు.
దారిలో వారు విజయ్ చౌక్ వద్ద బైఠాయించి సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
అక్కడి నుంచి 10 మంది విపక్ష ఎంపీలు రాష్ట్రపతిని కలవడానికి వెళ్తున్నట్లు ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
దిల్లీలోని జనపథ్-కర్తవ్యపథ్ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవల తాత్కాలిక నిలిపివేత

ఫొటో సోర్స్, ANI
సీజేపీ నిరసనల నేపథ్యంలో దిల్లీలోని నిర్దిష్ట ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలన్న ప్రతిపాదనకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.
హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. జనపథ్-కర్తవ్య పథ్ కూడలి చుట్టూ 4 కిలోమీటర్ల పరిధిలో ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తారు.
అక్టోబర్ 9 రాత్రి 10 గంటల నుంచి అక్టోబర్ 10వ తేదీ రాత్రి 10 గంటల వరకు 24 గంటల పాటు అక్కడ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండవని ఈ మేరకు పోలీసులు జారీచేసిన సర్క్యులర్‌లో పేర్కొన్నారు.
ఈయనకు లైవ్‌లో మరణ శిక్ష అమలు చేస్తామని అమెరికా రక్షణ మంత్రి చెప్పారు
గరివిడి లక్ష్మి ఈవిడే.. ‘ఆమె పాటల క్యాసెట్ లేని ఇల్లు ఉండేది కాదు’
రైళ్ల రద్దు, మెట్రో స్టేషన్ల మూసివేతపై సుప్రీంకోర్ట్ ఏమంది?

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, న్యూదిల్లీ రైల్వే స్టేషన్ (పాత ఫొటో) కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల నేపథ్యంలో దిల్లీ నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను రద్దు చేయడం, 57 మెట్రో స్టేషన్లను మూసివేయడంపై సుప్రీంకోర్ట్ ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసింది.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు... ‘రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలి’ అని సూచించినట్లు లైవ్‌లా వెబ్‌సైట్ పేర్కొంది.
మెట్రో స్టేషన్ల మూసివేత విషయంలోనూ సుప్రీంకోర్ట్ సూచనలు చేసిందని, ప్రజలు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సేవలు ఉండాలని పేర్కొందని లైవ్‌లా వెబ్‌సైట్ తెలిపింది.
సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఒక పిటిషన్‌లో, "అన్ని రైళ్లను రద్దు చేశారు, మెట్రో స్టేషన్లను మూసివేశారు, మీరు ఎక్కడికీ వెళ్లలేరు. దేశంలో ఇదే జరుగుతోంది. ఇది ఒక శాంతియుత నిరసన" అని పేర్కొన్నారు.
కామ్రేడ్ కళ్యాణ్: లవ్ స్టోరీకి నక్సలిజం టచ్ ఇచ్చి కామెడీ పండించేందుకు చేసిన ప్రయత్నం ఫలించిందా?
భారతీయ మూలాలున్న నవనీతమ్ పిళ్లైకు నోబెల్ శాంతి బహుమతి

ఫొటో సోర్స్, Getty Images
ఫొటో క్యాప్షన్, నవనీతమ్ పిళ్లై ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి దక్షిణాఫ్రికాకు చెందిన నవనీతమ్ ‘నవి’ పిళ్లైని వరించింది.
అంతర్జాతీయ చట్టాలు, శాంతిని ప్రోత్సహించేందుకు చేసిన కృషికి గాను నోబెల్ కమిటీ ఆమెను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమె పేరును నార్వే నోబెల్ కమిటీ ఛైర్మన్ జోర్జెన్ వట్నె ఫ్రిడ్సెస్ ప్రకటించారు.
భారతీయ మూలాలున్న నవనీతమ్ పిళ్లై ఐరాసలో మానవ హక్కుల కమిషనర్‌గా పనిచేశారు.
ఎంతో ధైర్యసాహసాలతో నవి పిళ్లై ప్రపంచ శాంతి భద్రతల కోసం పనిచేశారని జోర్జెన్ కొనియాడారు.
“దక్షిణాఫ్రికాలో లాయర్‌గా ఆమె కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ వివక్షపై సుదీర్ఘ కాలం పాటు పోరాడారు.” అని ఆయన చెప్పారు.
