లైవ్, ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలు: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

సారాంశం

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

లైవ్ కవరేజీ

  1. ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలు: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా
    ఫొటో క్యాప్షన్, అనిల్ చంద్ర పునేఠా

    సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత 19 ప్రాంతాల్లోనే ఆపాలని భావించినా, ఇప్పుడు మొత్తం 100 స్థానాల్లో ఆపేస్తున్నట్లు పేర్కొంది.

    అభ్యర్థుల జాబితా ప్రకటన ఈ నెల 25 వరకు వాయిదా వేయడంపై ఇవాళ నిర్ణయించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీల నివేదికల ఆధారంగా తుది నిర్ణయం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

    రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో నామినేషన్లు వేసే అవకాశం తమ పార్టీ అభ్యర్థులకు కల్పించలేదని సుప్రీంకోర్టులో వైసీపీ పిటీషన్ వేసింది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు 25వ తేదీ వరకు అభ్యర్థుల జాబితా ప్రకటించవద్దని ఆదేశించింది. గురువారం ఒక నిర్ణయం ప్రకటించాలని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

    సుప్రీంకోర్టు ఆదేశాలపై బుధవారం న్యాయనిపుణులతో చర్చించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా నోటిఫికేషన్ వచ్చిన 100 మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్‌లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించారు.

  2. గుడ్ మార్నింగ్

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లకు స్వాగతం.

    నేను బీబీసీ ప్రతినిధి ఖగేష్, మధ్యాహ్నం 2 గంటల వరకు ముఖ్యమైన వార్తలను మీకు అందిస్తాను.

    నిన్నటి లైవ్ పేజీ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.